Nayanatara: డిస్కో శాంతి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 90లలో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో గ్లామర్ పాత్రలు చేయడం మాత్రమే కాదు ఐటెం సాంగ్స్ తో ఒక ఊపు ఊపింది. చాలామంది టాప్ హీరోలతో అదరగొట్టే స్టెప్పులు వేసిన డిస్కో శాంతి అనంతరం శ్రీహరిని పెళ్లాడింది. అయితే 2013వ సంవత్సరంలో శ్రీహరి అనారోగ్యంతో మరణించాక.. కుటుంబ బాధ్యతలు భుజాన వేసుకుని.. పిల్లలను పెంచుతూ వస్తోంది. ఈ క్రమంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరోయిన్స్ వేసుకుంటున్న వస్త్రధారణ పై డిస్కో శాంతి సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. స్టోరీకి సంబంధించి హీరోయిన్ ఎటువంటి వస్త్రాలైనా వేసుకోవచ్చు.
గ్లామర్ గా కనిపించడంలో తప్పులేదు. కానీ ఎటువంటి డ్రెస్సులు సెలెక్ట్ చేసుకుంటున్నాం.. అన్నదే చాలా ముఖ్యం. గ్లామర్ దుస్తులు ధరించినంత మాత్రాన ఏ హీరోయిన్ పైన నెగటివ్ ఇమేజ్ అనేది పడదు. కానీ ఎలాంటి దుస్తులు ధరిస్తున్నామనేది చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. అసలు ఆ దుస్తులు మనకి సూట్ అవుతాయా..? లేదా..? కూడా హీరోయిన్ లు గమనించుకోవాలి. ఉదాహరణకు నయనతార.. కాస్ట్యూమ్స్ గమనిస్తే చాలా ఆకట్టుకునే విధంగా ఉంటాయి.
గ్లామర్ దుస్తులలోనైనా ఇంకా సాంప్రదాయ బద్ధమైన వస్త్రధారణలోనైనా నయనతార చాలా ఆకట్టుకునే విధంగా స్క్రీన్ మీద కనబడుతూ ఉంటుంది. ఆమె ఎంపిక చాలా అద్భుతంగా ఉంటుంది. కొంతమంది హీరోయిన్ లు వేసుకుని దుస్తులు చూస్తే చాలా అసహ్యంగా కనిపిస్తాయి. కానీ అన్ని రకాల కాస్ట్యూమ్స్ నయనతారకి బాగా సూట్ అవుతాయి. అజిత్ సరసన నటించిన “బిల్లా”లో బికినీ వేసుకుని చాలా అందంగా …స్టైల్ గా కనిపించడం జరిగింది. పెద్దగా అసభ్యంగా కూడా కనిపించలేదు. చివరికి చెప్పేది ఏమిటంటే.. ఎటువంటి బట్టలు ధరించామన్నది ముఖ్యం కాదు. ఎలా కనిపించామన్నది హీరోయిన్స్ దృష్టిలో ఉంచుకొని కాస్ట్యూమ్స్ ఎంపిక చేసుకోవాలని డిస్కో శాంతి సూచించింది.