అల్లుఅర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ హిందీలో ఏకంగా వంద కోట్లకి పైగా కలెక్షన్ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాలోని డైలాగ్స్, సాంగ్స్ వరల్డ్ వైడ్ గా ఫేమస్ అయిపోయాయి. సోషల్ మీడియాలో, షార్ట్ వీడియో యాప్స్ లో సెన్సేషన్ క్రియేట్ చేసి వైరల్ గా మారిపోయాయి. ఇప్పటికి నార్త్ ఇండియాలో పుష్ప సినిమాలోని సాంగ్స్ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా కలెక్షన్స్ అన్ని కూడా ఫేక్ అనే ప్రచారం గతంలో జరిగింది. కేవలం పబ్లిసిటీ స్టంట్ తప్ప నిజం కాదని టాక్ వినిపించింది.
తాజాగా డైరెక్టర్ తేజ కూడా ఈ విషయంపై ఆసక్తికర కామెంట్స్ చేశాడు. పుష్ప సినిమా తెలుగులో డిజాస్టర్ అయ్యిందని. ఏపీలో చాలా మంది డిస్టిబ్యూటర్స్ ఈ సినిమాతో నష్టాలు చవిచూశారని కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ సినిమాకి హిందీలో భారీగా కలెక్షన్స్ రావడం వలన నిర్మాతలు సేఫ్అయ్యారని, ఆ విధంగా సినిమా హిట్ కేటగిరీలోకి వెళ్లిందని చెప్పుకొచ్చారు. తెలుగు రాష్ట్రాలలో మాత్రం సినిమాకి ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాలేదని తేజ చెప్పాడు.
ఇప్పుడు ఈ వ్యాఖ్యలు టాలీవుడ్ లో సంచలనంగా మారాయి. కేవలం పుష్ప సినిమాలో అల్లు అర్జున్ నటించడం వలన, అది కూడా పాన్ ఇండియాలో రిలీజ్ చేయడం వలన హైప్ క్రియేట్ చేయడం కోసమే సినిమాని హిట్ అంటూ ప్రచారం చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం తేజ సురేష్ బాబు చిన్న కొడుకు అభిరామ్ తో అహింస అనే సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమాకి సంబందించిన ఫస్ట్ సింగిల్ ఇప్పటికే రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. చాలా రోజుల తర్వాత ఆర్పీ పట్నాయక్ ఈ సినిమాకి సంగీతం అందిస్తూ ఉండటం విశేషం.