ఇళయదళపతి విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం వారసుడు. దిల్ రాజు ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించాడు. ఇక ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని సంక్రాంతి బరిలో రిలీజ్ కి రెడీ అవుతుంది. ఇక ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ లోపు చిత్రం నుంచి విజయ్ లుక్ కి సంబందించిన పోస్టర్స్ ని లాంచ్ చేస్తున్నారు. తమిళంలో ఈ సినిమా వారిసు అనే టైటిల్ తో రిలీజ్ అవుతుంది. అయితే ఈ సినిమాని నిన్నటి వరకు బైలింగ్వల్ మూవీ అని అందరూ అనుకున్నారు. కానీ ఇది ప్యూర్ తమిళ్ సినిమా అని దర్శకుడు వంశీ పైడిపల్లి తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశాడు.
తమిళ్ నేటివిటీ, అక్కడి ప్రేక్షకులని దృష్టిలో ఉంచుకొని ఈ సినిమాని తెరకెక్కించినట్లు తెలిపారు. తెలుగులో డబ్బింగ్ సినిమాగానే ఈ మూవీ రిలీజ్ కాబోతుందని వంశీ మాటల బట్టి అర్ధమవుతుంది. తమిళంలో విజయ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన సినిమా మినిమమ్ రేంజ్ లో ఉంటేనే ఏకంగా 100 కోట్ల కలెక్షన్ ఈజీగా దాటిపోయింది. ఇప్పుడు వారసుడు మీద కూడా అదే స్థాయిలో బజ్ ఉంది. సంక్రాంతి బరిలో ఈ మూవీ భారీ కలెక్షన్స్ కొల్లగొట్టడం గ్యారెంటీ అనే మాట వినిపిస్తుంది. అయితే దిల్ రాజు మాత్రం ఈ సినిమాని బైలింగ్వల్ మూవీగానే ప్రాజెక్ట్ చేసే ప్రయత్నం చేశారు.
దీనికి కారణం తెలుగులో విజయ్ మార్కెట్ తక్కువ బై లింగ్వల్ అని ప్రచారం చేస్తే సినిమాపై తెలుగులో కూడా మంచి బజ్ ఉంటుందని భావించారు. అయితే ఇప్పుడు ప్యూర్ తమిళ్ మూవీ అని దర్శకుడు వంశీ రివీల్ చేయడం ద్వారా తెలుగులో అంత బజ్ క్రియేట్ చేయకపోవచ్చనే మాట వినిపిస్తుంది. రీసెంట్ గా శివ కార్తికేయన్ ప్రిన్స్ మూవీ కూడా బైలింగ్వల్ అనే బ్రాండ్ తోనే వచ్చింది. అయితే ఈ సినిమాలో క్యాస్టింగ్ మొత్తం కోలీవుడ్ కి చెందినవారే కావడం కథ బ్యాగ్రౌండ్ కూడా పాండిచ్చేరి ఉండటంతో తెలుగు ప్రేక్షకులు పెధ్దగా రిసీవ్ చేసుకోలేకపోయారు. దీంతో పాజిటివ్ టాక్ వచ్చిన కూడా తెలుగులో ఈ మూవీకి అనుకున్న స్థాయిలో కలెక్షన్స్ రాలేదు. తమిళ్ లో అయితే కొంత వరకు పర్వాలేదని విధంగా కలెక్షన్స్ ఉన్నాయి.