Director Raghavendra Rao : పిచ్చిపిచ్చిగా ఉందా? అంటూ సుడిగాలి సుధీర్ ఫ్యాన్స్‌పై ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు ఫైర్ అయ్యారు. దీనికి కారణం లేకపోలేదు. సుధీర్ ఫ్యాన్స్ ప్రవర్తనతో విసిగిపోయిన ఆయన సీరియస్ అవక తప్పలేదు. అసలేం జరిగిందంటే.. ఇప్పుడిప్పుడే సినీ ఇండస్ట్రీకి పూర్వ వైభవం వస్తోంది. ఇటీవల విడుదలైన ‘సీతారామం, బింబిసార, కార్తికేయ 2’ వంటి సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇక త్వరలోనే వినోదాత్మకంగా రూపొందిన మా ‘వాంటెడ్ పండుగాడ్’ చిత్రం కూడా విడుదల కానుంది. ఈ సినిమా కూడా మంచి విజయం సాధిస్తుందని ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్రరావు అన్నారు.
సునీల్, అనసూయ భరద్వాజ్, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి, సుడిగాలి సుధీర్ ప్రధాన పాత్రల్లో శ్రీధర్ సీపాన దర్శకత్వంలో ‘వాంటెడ్ పండుగాడ్’ చిత్రం తెరకెక్కింది. కె. రాఘవేంద్రరావు సమర్పణలో సాయిబాబ కోవెలమూడి, వెంకట్ కోవెలమూడి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 19న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. అయితే ఆ సమయంలో అనసూయ మాట్లాడుతుండగా సుడిగాలి సుధీర్ స్టేజ్‌పైకి వచ్చాడు. అతన్ని చూడగానే ఫ్యాన్స్ అరుపులు, కేకలతో రచ్చ రచ్చ చేశారు. రాఘవేంద్ర రావు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా అస్సలు వినిపించుకోలేదు.
Director Raghavendra Rao : ఇలాగే ప్రవర్తిస్తే బయటకు పంపించేస్తా..
యాంకర్ అనసూయ మాట్లాడుతుండగా సుధీర్ స్టేజ్‌పైకి వచ్చాడు. సుధీర్‌ని చూడగానే ఫ్యాన్స్‌కు ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది. అరుపులతో స్టేడియంను దద్దరిల్లింది. దీంతో స్వయంగా రాఘువేంద్ర రావు మైక్ తీసుకొని సైలెంట్‌గా ఉండాలని కోరినా సుధీర్ ఫ్యాన్స్ వినిపించుకోలేదు. దీంతో ఆయన కాస్త అసహనం వ్యక్తం చేశారు. సుధీర్ సహా అందరూ మాట్లాడుతారని, కాస్త ఓపిగ్గా ఉండాలని కోరినా ఫలితం లభించలేదు. దీంతో ఆగ్రహించిన రాఘవేంద్రరావు.. ‘పిచ్చిపిచ్చిగా ఉందా? ఎవరు పిలిచారు వాళ్లని? పెద్దా చిన్నా తేడా లేదా? ఇలాగే ప్రవర్తిస్తే బయటకు పంపించేస్తా’ అంటూ సీరియస్ అయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.