ఈ మధ్యకాలంలో దర్శకులు సినిమా బిజినెస్ విషయంలో ఇన్వాల్వ్ ఎక్కువ అవుతున్నారు. రెమ్యునరేషన్ కాకుండా సినిమా లాభాలలో వాటాలు తీసుకోవడం వలన సినిమా ప్రమోషన్ బాధ్యత అంటా వారే చూసుకుంటూ కంటెంట్ పై దృష్టిపెట్టడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి కూడా ఎవరి పనులు వారు చేయాలని పరోక్షంగా దర్శకులు అందరికి సూచించారు. సినిమా సక్సెస్ అనేది దర్శకుడి చేతిలో ఉంటుందని, అతను కేవలం కంటెంట్ మీద స్క్రిప్ట్ పెర్ఫెక్షన్ మీద దృష్టిపెట్టాలని అనవసరమైన విషయాలపై ద్యాశపెడితే సినిమా రిజల్ట్ వేరుగా ఉంటుందని చెప్పారు.
దీనితో చాలా మంది దర్శకులకి జ్ఞానోదయం అయ్యింది. ఈ నేపధ్యంలో దర్శకులు ప్రొడక్షన్ లో తమ ఇన్వాల్వ్ మెంట్ తగ్గించుకుంటున్నారు. కథ, కథనాలపై దృష్టిపెట్టి సినిమాని తెరపై ఎలా ఆవిష్కరించాలి అనే అంశాల మీద ద్యాస పెడుతున్నారు. ఇప్పటికే ఎన్ఠీఆర్ సలహాతో కొరటాల శివ తన కొత్త సినిమా విషయంలో ప్రొడక్షన్ విషయాలు పక్కన పెట్టి సబ్జెక్టు మీద దృష్టిపెట్టాడు. ఇక ఇప్పుడు కొండపొలం ఇచ్చిన షాకింగ్ రిజల్ట్ తో దర్శకుడు క్రిష్ కూడా ఆలోచనలో పడ్డాడు. ఆ సినిమా డిస్టిబ్యూటర్స్ అందరూ క్రిష్ మీద నమ్మకంతో సినిమాని కొన్నారు. అయితే రిజల్ట్ వేరేగా ఉంది. దీంతో వారంతా క్రిష్ మీద పడ్డారు.
దీంతో ఈ తలనొప్పి ఎందుకని భావించిన క్రిష్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తెరకెక్కిస్తున్న హరిహర వీరమల్లు విషయంలో అనవసర విషయాల జోలికి పోకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ప్రొడక్షన్ బాధ్యతలు అంతా నిర్మాత ఏఎం రత్నంకి అప్పగించి కేవలం సినిమా పెర్ఫెక్షన్ మీదనే దృష్టిపెట్టారు. ఇక తన టీమ్ లో రైటర్స్ ని కూడా పెంచుకున్నారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ అభిమానులని దృష్టిలో ఉంచుకొని, మరో వైపు తన మార్క్ మిస్ కాకుండా సినిమాని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఫేమ్ తో సినిమాకి ఎలాగూ బిజినెస్ జరిగిపోతుంది కాబట్టి క్రిష్ టెన్షన్ లేకుండా తన పని తాను చూసుకుంటున్నాడని బోగట్టా.