టాలీవుడ్ లో హాట్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్న అందాల భామ డింపుల్ హయాతి. ఈ బ్యూటీ చివరిగా రవితేజ ఖిలాడీ సినిమాలో నటించింది. అందాల ఆరబోతలో నార్త్ ఇండియన్ భామలకి ఎ మాత్రం తీసిపోనని ఈ సినిమాలో ఏకంగా బికినీ కూడా ఈ అమ్మడు వేసింది. హాట్ హాట్ ఫోజులతో రెచ్చగొట్టింది. రెగ్యులర్ తో హాట్ ఫోటోషూట్ లతో సందడి చేసే ఈ అమ్మడు తెలుగుతో పాటు తమిళంలో కూడా మెల్లగా అవకాశాలు పెంచుకుంటుంది. లేటు వయస్సులో స్టార్ హీరోల పక్కన నటించే ఛాన్స్ వస్తున్న కూడా ఈ భామ మాత్రం వెనకడుగు వేయకుండా దర్శకులని మెప్పించే ప్రయత్నం చేస్తుంది.
ఎ మాత్రం దాచుకోకుండా హద్దులు దాటి అందాల ప్రదర్శన చేయడానికి ఈ బ్యూటీ రెడీగా ఉంది. అయితే తెలుగమ్మాయిల మీద తెలుగు నాట కొంత చిన్న చూపు ఉంటుందని అందరూ భామలు చెప్పిన మాట నిజం అనే విధంగానే ఈ బ్యూటీకి కూడా అవకాశాలు అంతంతగానే వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ భామ తాజాగా చేసిన కామెంట్స్ టాలీవుడ్ లో సంచలనంగా మారాయి. దర్శకులు వారి ఆలోచన విధానం మార్చుకోవాలి అంటూ డింపుల్ హయాతి సూచనలు చేస్తుంది. సమాజంలో అయిన సినిమాలో అయిన మహిళల చుట్టూనే కథలు తిరుగుతాయని ఈ భామ చెబుతుంది.
అయిన కూడా హీరోలకి ఇచ్చే ప్రాధాన్యత హీరోయిన్స్ కి సినిమాలలో ఇవ్వడం లేదని, పురుషుల చుట్టూనే కథలు తిప్పుతూ మహిళలకి ప్రాధాన్యత తగ్గించడం కరెక్ట్ కాదని చెబుతుంది. ఈ విషయంలో దర్శకులు కచ్చితంగా వారి ఆలోచనలు మార్చుకోవాలని డింపుల్ హయాతి సూచనలు ఇస్తుంది. అయితే ఈ బ్యూటీ సూచనలు దర్శకులు తీసుకునే అవకాశం తక్కువే అని చెప్పాలి. ఎందుకంటే సినిమా అనేది హీరో ఇమేజ్ మీద ఆధారపడి బిజినెస్ జరుపుకుంటుంది. ఈ నేపధ్యంలోనే దర్శకులు తమ కథలని హీరో పాత్రల చుట్టూనే ఉండే విధంగా చూసుకుంటున్నారు.