Dill Raju: నిర్మాత దిల్ రాజు విజయవంతమైన ప్రొడ్యూసర్‌గా పేరు తెచ్చుకున్నారు. బొమ్మరిల్లుతో తెలుగు నాట మంచి మూవీ అందించిన దిల్ రాజు.. తర్వాత తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. ఇక నితిన్ హీరోగా నటించిన దిల్ మూవీ పేరునే తన ఇంటి పేరుగా మార్చుకునేంతగా మారిపోయాడు దిల్ రాజు. మోస్ట్ సక్సెస్‌ఫుల్ నిర్మాతగా అవతరించాడు. ఓ మూవీ ఆయన సారథ్యంలో వస్తోందంటే గ్యారెంటీ అనే స్థాయికి చేరుకున్నాడు.
నిర్మాతగా టాలీవుడ్‌లో పాతుకుపోయాడు దిల్ రాజు. అయితే, రీసెంట్‌గా దిల్ రాజుపై టాలీవుడ్‌లో ట్రోలింగ్ ఓ రేంజ్‌లో కొనసాగుతోంది. వారసుడు మూవీ విషయంలో ఈ ట్రోలింగ్ సాగుతున్నట్లు తెలుస్తోంది. తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి హీరోగా, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం వారసుడు. ఈ మూవీకి దిల్‌రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో విడుదలవుతోంది. ఇక తెలుగులో వారసుడు సినిమాను సంక్రాతి సందర్భంగా రిలీజ్ చేయనున్నారని టాక్ వినిపిస్తోంది.
మరోవైపు సంక్రాంతి బరిలో టాలీవుడ్ స్టార్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలయ్య సినిమాలు సైతం సంక్రాంతి బరిలో నిలిచాయి. ఈ నేపథ్యంలో దిల్ రాజుపై నందమూరి, మెగా ఫ్యాన్స్ సంయుక్తంగా ట్రోలింగ్‌కు దిగుతున్నారు. సంక్రాంతి బరిలో పెద్ద సినిమాలు ఉన్న నేపథ్యంలో ఆ నెల అంతా.. చిన్న సినిమాలు, డబ్బింగ్ చిత్రాలు విడుదల కావు. అలాంటిది వారసుడు సినిమాను సంక్రాంతి పండుగ సందర్భంగా దిల్ రాజు రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నాడట. దీంతోపాటు ఆంధ్ర, నైజాం ఏరియాలో థియేటర్లు కూడా బుక్ చేసుకున్నాడని టాక్.
Dill Raju: తనలో ఇంకో యాంగిల్ ఉందన్న దిల్ రాజు..
ఈ నేపథ్యంలో వారసుడు వివాదంపై దిల్ రాజు స్పందించాడు. తనలో మరో యాంగిల్ కూడా ఉందన్నాడు దిల్ రాజు. అది ఎవరికీ తెలియదన్నాడు. సినిమాను ప్రేమించి, మంచి కంటెంట్‌తో సినిమాలు తీసేవాళ్ల కోసం తాను ఏం చేయ్యడానికైనా వెనుకాడనన్నాడు. అందుకే మసూదకు మద్దతిచ్చానంటూ క్లారిటీ ఇచ్చాడు. మంచి సినిమా చేస్తే దాని కోసం ఏం చేయ్యడానికైనా తాను సిద్ధమని స్పష్టం చేశాడు దిల్‌రాజు. త్వరలోనే వారసుడు చిత్రం వివాదంపై క్లారిటీ ఇస్తానన్నాడు.