Dil raju: టాలీవుడ్ లో మోస్ట్ పాపులర్, మోస్ట్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ గా దిల్ రాజ్ ఉన్నాడు. ప్రస్తుతం ఆయన హవానే సినీ ఇండస్ట్రీలో కొనసాగుతోంది. ప్రొడక్షన్ హౌస్‌తో పాటు డిస్ట్రిబ్యూటర్‌గా కూడా దిల్ రాజు ఉన్నాడు. దిల్ రాజుకి రెండు పెళ్లిళ్లు అయిన విషయం తెలిసిందే. మొదటి భార్య చనిపోవడంతో దిల్ రాజు రెండో పెళ్లి చేసుకున్నాడు. తాజాగా ఓ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రెండో పెళ్లిపై దిల్ రాజుపై క్లారిటీ ఇచ్చాడు.
రెండో పెళ్లి ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది. దాని వెనుక ఏమి జరిగింది అనే విషయాలను దిల్ రాజు బయటపెట్టాడు. గత ఏడాది లాక్ డౌన్ సమయంలో దిల్ రాజు పెళ్లి జరిగింది. లాక్‌డౌన్ కావడంతో కొంతమంది సన్నిహితుల మధ్యనే దిల్ రాజు రెండో పెళ్లి జరిగింది. 2020 డిసెంబర్‌లో దిల్ రాజు పెళ్లి జరగ్గా.. ఆయన కూతురు హన్షిక పెళ్లి పనులు అన్నీ చూసుకుంది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో రెండో పెళ్లిపై దిల్ రాజు మాట్లాడారు. తన భార్య అనిత చనిపోయే సమయానికి తనకు 47 ఏళ్లు అని, ఆమె హఠాత్తుగా చనిపోవడంతో ఇంట్లో చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయని తెలిపాడు. తాను ఆ విషాదం నుంచి కోలుకోవాలంటే రెండో పెళ్లి చేయాలని తల్లితండ్రులు భావించారని, దానికి తన కూతురు కూడా ఒప్పుకుందన్నారు. ఇద్దరు, ముగ్గురు అమ్మాయిలను చూశానని, కానీ వైదా తనకు కరెక్ట్ అనిపించిందని తెలిపారు.
అన్వయ్ అనే పేరు అందుకే పెట్టా
ఇద్దరం మాట్లాడుకుని అంతా ఓకే అనుకున్న తర్వాత పెళ్లికి రెడీ అయినట్లు దిల్ రాజు స్పష్టం చేశారు. తమకు ఒక బిడ్డ పుట్టాడని, తన మెదటి భార్య అనిత, రెండో భార్య వైదా పేర్లు కలిసి వచ్చేలా మగబిడ్డకు అన్వయ్ అని పేరు పెట్టినట్లు చెప్పారు. ఇప్పుడు జీవితం హ్యాపీగా ఉందని దిల్ రాజు స్పష్టం చేశాడు.