Digestive Problems అసలు కాలం ఏ విధంగా మారిపోయింది అంటే ఎవరి జీవితంలో కూడా ఖాళీ ఉండట్లేదు. ఎవరికీ వారు బిజీ బిజీగా గడిపేస్తూ ఉన్నారు. ఇక ఇంట్లో దంపతులు అయితే ఇద్దరు ఎవరి పనుల్లో వారు బిజీ అయిపోవడంతో ఇంటి తిండి పూర్తిగా మరిచిపోయి చిరు తిండికి అలవాటు పడిపోయారు. బయట జంక్ ఫుడ్ కి బాగా అలవాటు పడిపోయారు. ఇలా రకరకాల ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇక యువత గురించి వేరే చెప్పనక్కర్లేదు.
వారు ఏ రకంగా జంక్ ఫుడ్ కి అలవాటు అయ్యారో అందరికి తెలిసిందే. ఇలా అలవాటు పడిపోయి అనారోగ్యాన్ని కొనితెచ్చుకుంటున్నారు. మరో విషయం ఏమిటంటే సమయానికి ఎవరు తినట్లేదు. ఇలా తినకపోవడం వల్ల జీర్ణ సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయితే ఇలా జీర్ణ సంబంధ సమస్యలు దూరమవ్వాలంటే ఇవి ఖచ్చితంగా పాటించాలి.
మీ పనుల కోసం భోజనం మానేయకండి. సమయానికి తినడం అలవాటు చేసుకోండి. అలాగే ఆకలి లేకపోయినా తినడానికి ప్రయత్నించకండి. నిద్ర పోయే ముందు అసలు తినకండి. పడుకోవడానికి మరియు డిన్నర్ చేసే ముందు ఖచ్చితంగా ఒక గంట అయినా సమయం ఉండేలా చూసుకోండి. ఎప్పుడు కూడా వేగంగా నమలకుండా తినడం అసలు చేయొద్దు. నెమ్మదిగా నమిలి తినడానికి ప్రయత్నించండి.
Digestive Problems
ఎందుకంటే సలైవా లో ఉండే ఎంజైమ్స్ జీర్ణ క్రియను మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. చద్దన్నం అనగానే ఎవరు ఇష్టపడరు. కానీ పొద్దున్నే చద్దన్నం తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు. అలాగే ఆపిల్ పండ్లను ఎక్కువగా తినండి. ఎందుకంటే ఆపిల్ మీరు తిన్న ఆహారాన్ని జీర్ణం చేసే శక్తిని పెంచుతుంది. అలాగే సోంపు గింజల్లో ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణ శక్తిని మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది. భోజనం చేసిన తర్వాత జీలకర్రను నమలండి. ఇలా చేస్తే గ్యాస్ట్రిక్ మరియు ఎసిడిటీ సమస్యలు దూరం అవుతాయి.