Digestive problems Gas: మనం తీసుకునే ఆహారం అన్ని రకాల మంచి చేసేలా ఉండాలి. అయితే కొన్ని ఆహారపదార్దాలు ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి. జీర్ణ సమస్యలను పెంచుతాయి. ఇలాంటి వాటి వల్ల గ్యాస్ ప్రాబ్లమ్స్, గుండెల్లో మంట వస్తాయి. ఇక అలాంటి ఆహారానికి దూరంగా ఉండకపోతే సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. ఇక కొన్ని రకాల ఆహారాలు తీసుకోవడం వల్ల గ్యాస్ సమస్య బాగా పెరుగుతుందని వాటిని దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.
వీటితో గ్యాస్ సమస్యలు:
*వంకాయ ఆరోగ్యానికి మంచిదే అయినా.. అతిగా తిన్నప్పుడు గ్యాస్, గుండెల్లో మంట కూడా రావచ్చు.
*గోధుమ పిండి తో చేసే పదార్దాలు జీర్ణం అవ్వడానికి అధిక సమయం పడుతుంది. కావున జీర్ణ సమస్యలు తలెత్తుతాయి.
*పొట్టసమస్యలున్న వారు కీరదోసకాయ తినకూడదు.. దోసకాయలోని “కుకుర్బిటాసిన్” అనే పదార్ధం మనకు అజీర్తిని కలిగిస్తుంది.
*క్యాబేజీ, కాలీఫ్లవర్ లలో ఉండే సల్ఫర్ సమ్మేళనాలను “గ్లూకోసినోలేట్స్” అంటారు. ఇది అపానవాయువుకు కారణమవుతుంది. గుండెల్లో మంట సమస్యలను కలిగిస్తుంది.
*సోయాబీన్స్ శరీరంలో అధికంగా కార్బన్ డయాక్సైడ్, హైడ్రోజన్ లను ఉత్పత్తి చేస్తుంది. ఇది గ్యాస్, గుండెల్లో మంట సమస్యకు దారి తీయవచ్చు.
అయితే పైన తెలిపిన పదార్దాలు ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగిస్తాయి. కాబట్టి వాటిని ఎలా తినాలో, ఎంత మోతాదులో తినాలో తెలుసుకుని తినడం మంచిది. అధికంగా తినడం వల్ల గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి. కొన్నింటిని వండే పద్ధతి మార్చడం వల్ల ఆరోగ్యాంగా ఉండవచ్చు.
Digestive problems Gas:
ఏ ఆహారమైనా తగిన మోతాదులో తీసుకోవాలి. తగిన విధంగా తీసుకోవాలి. కాబట్టి నిపుణుల సూచనల మేరకు తగిన జాగ్రత్తలు తీసుకుని ఆహారం తీసుకోవడం ద్వారా ఎలాంటి సమస్యలు రాకుండా ఉండవచ్చు. గ్యాస్ సమస్యలు, జీర్ణ సమస్యలకు దూరంగా ఉండడానికి ఇలాంటి సూచనలు పాటించండి