చైతు నిజంగానే నో చెప్పాడా
నాగచైతన్య ముచ్చటగా మూడోసారి డైరెక్టర్ చందు మొండేటికీ అవకాశం ఇచ్చారు. ఆయన డైరెక్షన్లోనే నాగచైతన్య తన తదుపరి సినిమా కూడా చేస్తున్నారు
నిన్నటి నుండీ మీడియాలో ఒక వార్త హల్ చల్ చేస్తోంది.అదేమిటంటే…నాగచైతన్య ఒక మంచి డబ్బులు వచ్చే ఆఫర్ ని వద్దనుకున్నాడని. అదే వేరే హీరో అయితే ఎగరి గంతేసేవారని అంటున్నారు. ఇంతకీ ఆ వార్త ఏమిటి … ఆఫర్ ఏంటీ…
హీరో నాగచైతన్య కు ఈ మధ్య కాలంలో సరైన హిట్ లు లేదు..ఏ సినిమా చేసినా ధాంక్స్ చెప్పేస్తున్నారు జనం. ఈ క్రమంలో చందు మొండేటితో ఒక సినిమాకి కమిటయ్యాడు. త్వరలో ఆ సినిమా షూట్ మొదలు కానుంది. అయితే ఈ లోగా వేరే సినిమాలో ఒక స్పెషల్ పాత్రకు ఆఫర్ చేసారట. ఆ సినిమాకు ఒక పది రోజులు డేట్స్ ఎలాట్ చేస్తే చాలు పది కోట్లు సింగిల్ పేమెంట్ ఇస్తా అంటే నో చెప్పాదంట హీరో నాగ్ చైతన్య. అయితే నిజంగానే ఇది జరిగిందా లేక పీఆర్ న్యూసా అనే సందేహం కూడా మొదలైంది.

అయితే స్పెషల్ క్యారక్టర్స్ గా చేయటం అనేది ఇప్పుడు సినిమాల్లో ట్రెండ్ గా మారింది. వేరే సీనియర్ హీరో ఉన్న సినిమాల్లో ఇలాంటి యంగ్ హీరోలు సర్పైజ్ గా వచ్చి కనపడుతూంటారు. వీళ్లకు బాగానే అప్లాజ్ వస్తుంది. అసలు స్పెషల్ పాత్రకు అడిగారు అంటేనే వీళ్లకు క్రేజ్ ఉన్నట్లేగా అని . అలాగే రోజుకు కోటి రూపాయలు ఆఫర్ చేసారు అంటే అది మామూలు పాత్ర అయ్యిండదు. అయితే ఎందుకు వద్దన్నాడు అంటే … తను చేస్తున్న సినిమాకు ఒక గెటప్ లో కనపడబోతున్నారని, అందుకోసం తన బాడీ లాంగ్వేజ్, హెయిర్ స్టెయిల్ అన్నీ మార్చుకుంటున్నాడని, ఇప్పుడు వేరే సినిమాకు వాళ్ల అడిగిన డేట్స్ టైమ్ కు అవన్నీ తీసేసి కనపడటం కష్టమనే నో చెప్పాడంటున్నారు. అయితే అది ఏ సినిమా అనేది మాత్రం తెలియలేదు .
ఇక నాగచైతన్య ముచ్చటగా మూడోసారి డైరెక్టర్ చందు మొండేటికీ అవకాశం కూడా ఇచ్చారు. ఆయన డైరెక్షన్లోనే నాగచైతన్య తన తదుపరి మూవీ చేస్తున్నారు.గత ఏడాది నిఖిల్ అనుపమ హీరో హీరోయిన్లుగా నటించిన కార్తికేయ2 మూవీ ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య తదుపరి మూవీ చేయబోతున్నారు. అయితే ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్లో ప్రేమమ్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అలాగే సవ్యసాచి మూవీ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రేమమ్ పరవాలేదు అనిపించుకున్న సవ్యసాచి మాత్రం కాస్త నిరాశను కలిగించిందనే చెప్పుకోవాలి .
గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మించనున్నారంట . శ్రీకాకుళం, గుజరాత్ నేపథ్యంలోని మత్స్యకారుల జీవితాలను ఆవిష్కరించేలా ఈ సినిమా కథ ఉంటుందంట . ఇందులో చైతన్య మత్స్యకారుడిగా కనిపించనున్నారని సమాచారం. అందుకే మత్స్యకారులను స్వయంగా కలిసి వారి జీవిత విశేషాలను తెలుసుకునేందుకు వైజాగ్ వెళ్లారు నాగచైతన్య, చందు మొండేటి, ‘బన్నీ’ వాసు. మూడు రోజులు అక్కడే ఉండి పూర్తి వివరాలు తెలుసుకున్నారంట . ఇక ఈ సినిమా కి ‘తండెల్’ అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నట్లు టాక్. శ్రీకాకుళంలో మత్స్యకారులను తండెల్ అని పిలుస్తారట.