Dia Mirza : ఇంటర్నేషనల్ బ్యూటీ దియా మిర్జా ఫ్యాషన్స్ సెన్స్ ఎప్పుడూ ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకుంటూనే ఉంటుంది. ఆమె ఫ్యాషన్ నోట్స్ తీసుకోవడానికి తహతహలాడుతూనే ఉంటారు . ఫార్మల్ అవుట్ ఫిట్ అయినా, క్యాజువల్ డ్రెస్సైనా, లేదా ఆరు గజాల చీర కట్టుకున్నా దియా ఫ్యాషన్ విభిన్నంగా, సౌకర్యవంతంగా, స్థిరంగా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. దియా మిర్జా అద్భుతమైన ఫ్యాషన్ వాది. తన ఫ్యాషన్ డైరీలో నుంచి అద్భుతమైన స్నిప్పెట్ లను ఇన్ స్టాగ్రామ్ ప్రొఫైల్ లో షేర్ చేస్తూ ఫ్యాషన్ స్టేట్మెంట్స్ ఇస్తుంది. పోస్ట్ చేసే ప్రతి పిక్ అందరినీ మెస్మరైస్ చేస్తుంది. రీసెంట్ గా ధరించిన అవుట్ ఫిట్ కూడా ఫ్యాషన్ ప్రియుల మనసు దోచేసింది.

దియా మిర్జా ఓ ఫ్యాషన్ షో కోసం అద్భుతమైన ఎత్నిక్ డిజైనర్ ను ధరించి అందరిని అట్రాక్ట్ చేసింది. ఫ్యాషన్ డిజైనర్ జిగ్యా ఎం కు మ్యూస్ గా వ్యవహరించింది దియా. ఫోటోషూట్ కోసం లెహంగా సెట్ ను ధరించి నవరాత్రి ఫెస్టివ్ వైబ్స్ ను తీసుకొచ్చింది. గార్భా నైట్స్ కోసం దియా తన ఫోటోల ద్వారా ప్రధాన ఫెస్టివ్ ఫ్యాషన్ సూచనలు అందించింది.

మెరూన్ రేషమ్ థ్రెడ్స్, లాంగ్ స్లీవ్స్ , మల్టీకలర్ థ్రెడ్ డీటెయిల్స్ తో ఉన్న పసుపు రంగు బ్లౌజ్ ని ఎంచుకుంది. ఈ బ్లౌజ్ కి జోడీగా మల్టీకలర్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ వివరాలు కలిగిన పొడవాటి పసుపు రంగు స్కర్ట్ వేసుకుంది. రంగురంగుల జరీ వివరాలతో ఉన్న బోర్డర్ , థ్రెడ్ డీటైల్స్ ఉన్న అద్భుతమైన పసుపు రంగు దుపట్టాను తన భుజం మీద ధరించింది దియా మిర్జా మెరిసిపోయింది. ఈ ఎంబ్రాయిడరీని గుజరాత్ లో ఎక్కువగా ఉపయోగించే మోచి డిజైన్స్ అని అంటారు. ఈ ఒక్క లెహంగా సెట్ ను ఎంబ్రాయిడరీ చేయడానికి కళాకారులకి దాదాపు 75 రోజులు పట్టిందట. ఈ అవుట్ ఫిట్ యొక్క వైవిధ్యాన్ని తెలుపుతూ దియా మిర్జా ఫోటోలను షేర్ చేసింది.
లెహంగా సెట్ కు మరింత అందాన్ని అందించేందుకు మెడలో బంగారపు నెక్ చోకర్ ని పెట్టుకుంది. వైట్ బీడ్స్ గోల్డెన్ పెండెంట్ తో వచ్చిన చైన్ వేసుకుంది. చెవులకు బంగారపు స్టేట్మెంట్ ఇయర్ రింగ్స్ ను పెట్టుకుంది. నుదుటన పాపిటబిళ్ళ పెట్టుకుని మంత్రముగ్ధులను చేసింది దియా మిర్జా . ఈ లుక్ లో దియా అందాన్ని చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

భారతీయ మోడల్, నటి, నిర్మాత , సోషల్ వర్కర్ ఇలా ఒక్కటేమిటి మల్టీ టాలెంటెడ్ నటిగా గుర్తింపు సంపాదించుకుంది దియా మిర్జా. 2000 సంవత్సరంలో మిస్ ఏషియా పెసిఫిక్ ఇంటర్నేషనల్ టైటిల్ కూడా సొంతం చేసుకుంది ఈ అందాల బొమ్మ. అందాల కిరీటం అందుకున్న దియా సినిమా రంగంపై ఆసక్తి పెంచుకొని 2001లో రెహనా హే తేరే దిల్ మే సినిమాతో వెండితెరపై కనిపించింది. నటిగానే తన కెరీర్ ను కొనసాగించలేదు దియా . ఆ తర్వాత కొన్ని సినిమాల్లో క్యారెక్టర్స్ చేసింది . సినిమాని సొంతంగా నిర్మించింది కూడా.


