Dhoni: ధోని.. ఇండియన్ క్రికెట్ చరిత్రలో, క్రికెట్ అభిమానుల్లో అతనిది చెరిగిపోని ముద్ర. టీం గడ్డు పరిస్థితుల్లో ఉన్నప్పుడు జట్టు పగ్గాలు చేపట్టడమే కాక, అద్భుత విజయాలు, అత్యద్భుత ప్రదర్శనతో టీమిండియాను నెం.1 గా నిలపడమే ఇందుకు కారణం. భారత్ కు రెండు వరల్డ్ కప్ లు మరియు ఒక చాంపియన్స్ ట్రోఫీని అందించిన గొప్ప నాయకుడు మహేంద్ర సింగ్ ధోని. 2007 వన్డే ప్రపంచకప్ లో ఘోర ప్రదర్శనతో నిరుత్సాహంతో కూరుకుపోయిన ఇండియన్ క్రికెట్ టీం ను అదే సంవత్సరంలో టీ20 ప్రపంచకప్ అందించి ప్రపంచ క్రికెట్ విశ్లేషకులనే ఆశ్చర్యానికి గురి చేసాడు.
అలా తనదైన నాయకత్వ ప్రదర్శనతో టీ20 ప్రపంచకప్, ఆ తర్వాత 2011లో జరిగిన వన్డే ప్రపంచకప్ లో మరోసారి భారత్ ను విశ్వవిజేతగా నిలిపి, భారత క్రికెట్ చరిత్రలో సువర్ణ అధ్యాయం లిఖించాడు. ఇక 2013లో జరిగిన చాంపియన్స్ ట్రోఫీ విజయంతో మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమిండియా కెప్టెన్ గా నిలిపిన ధోనికి విమర్శకులు కూడా అభిమానులుగా మారిపోయారు. అయితే ఇటీవల ధోని ఓ ఘోర అవమానాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. అది నిజంగా బాధాకరమే.. అని అభిమానులు అంటున్నారు. ఇంతకీ ఏంటా సంగతి. మీరే చదవండి..
ఇటీవల ప్రముఖ స్పోర్ట్స్ వెబ్ సైట్ అయిన విజ్డెన్ ఇండియా టీమిండియా ఆల్ టైమ్ టి20 ప్లేయింగ్ ఎలెవెన్ టీం ను ప్రకటించింది. అయితే ఈ టీమిండియా ఆల్ టైమ్ టి20 ప్లేయింగ్ ఎలెవెన్ లో ధోనికి చోటు దక్కలేదు. దీనితో అభిమానులతో పాటు, క్రీడా రంగ నిపుణులు షాక్ అయ్యారు. టి20 ప్రపంచకప్ ను అందించడంతో పాటు, టీ20 ఫార్మాట్లో అద్భుత ప్రదర్శన చేసినా.. ధోనికి చోటు దక్కక పోవడం పలువురిని విస్మయానికి గురి చేసింది. కెప్టెన్, ఫినిషనర్, వికెట్ కీపర్ అలా అన్ని రంగాల్లో ధోని ప్రతిభ అసామాన్యం. ఈ టీంలో వికెట్ కీపర్ గా దినేశ్ కార్తీక్ ను విజ్డెన్ ఎంపిక చేయడం ఇక్కడ విశేషం.
Dhoni :
ఇక ఈ టీమిండియా ఆల్ టైమ్ టీ20 ప్లేయింగ్ ఎలెవెన్ లో ధోని సహచరుడు యువరాజ్ సింగ్ తో పాటు సురేశ్ రైనా.. దినేశ్ కార్తీక్, ఆశిష్ నెహ్రాలు చోటు దక్కించుకున్నారు. ఓపెనర్లుగా రోహిత్, విరాట్ కోహ్లీలను ఎంపిక చేసింది. 12వ ప్లేయర్ గా సెహ్వాగ్ ను ఎంపిక చేయడం మరో విశేషం. విజ్డెన్ ఇండియా టీమిండియా ఆల్ టైమ్ టి20 ప్లేయింగ్ ఎలెవెన్: రోహిత్ శర్మ, కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, యువరాజ్ సింగ్, హార్దిక్ పాండ్యా, సురేశ్ రైనా, దినేశ్ కార్తీక్ (వికెట్ కీపర్), అశ్విన్, బుమ్రా, భువనేశ్వర్, ఆశిష్ నెహ్రా, సెహ్వాగ్ (12వ ప్లేయర్).
ఈ టీం కెప్టెన్ ఎవరో ప్రకటించకపోవడం కొసమెరుపు.