Viral News: మన దేశంలో రాజకీయ నాయకులు అంటే ఓ ప్రత్యేకత ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఎందుకంటే సామాన్య ప్రజల నుండి పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తున్న వారి వరకు రాజకీయాలు అంటే ఎంతో మక్కువ. రోజు వారి జీవితంలో ఖచ్చితంగా ఏదో ఓ సందర్భంలో రాజకీయాలు లేదా ఏదో ఒక రాజకీయ నాయకుడి గురించి ప్రస్తావన రావాల్సిందే.. ఈ విషయమంతా ఇప్పుడు మాకెందుకు అసలు విషయం ఏంటనేగా మీ సందేహం… అక్కడికే వద్దాం..!
చాలా మంది ప్రజాప్రతినిధులు ప్రజాసేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చానని తరచూ చెబుతూ ఉంటారు. కానీ కొందరు వారి వ్యాపారాలను కాపాడుకోవడానికి రాజకీయాల్లోకి వస్తారనుకోండి అది వేరే విషయనుకోండి. ఇప్పుడుఅసలు విషయంలోకి వస్తే… తమిళనాడుకు చెందిన ఓ ఎమ్మెల్యే మాత్రం తాను ప్రజాసేవకుడినే అని తన వ్యవహారశైలి ద్వారా నిరూపించుకుంటున్నాడు. తన నియోజకవర్గ పరిధిలోని ఓ ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన ఆయన టాయిలెట్స్ అశుభ్రంగా ఉండటం చూసి అక్కడ సిబ్బందిపై అసహనం వెలిబుచ్చారు. తానే స్వయంగా రంగంలోకి దిగి చీపురు పట్టి టాయిలెట్స్ గదులను శుభ్రం చేయడంతో.. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది.

తమిళనాడు రాష్ట్రంలోని ధర్మపురి నియోజకవర్గం నండి ఎమ్మెల్యేగా గెలిచిన ఎస్.పీ. వెంకటేశ్వరన్ ప్రజల సమస్య తెలుసుకునేందుకు ఇటీవల లిట్టారం అనే ప్రాంతానికి వెళ్లారు. అక్కడ ఇలక్కియంపట్టి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించడం జరిగింది. పాఠశాల ప్రాంగణం, మరుగుదొడ్లు అశుభ్రంగా ఉండటాన్ని గుర్తించిన ఆయన అక్కడి ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులపై ఫైర్ అయ్యారు. మరుగుదొడ్డి నుంచి దుర్వాసన వస్తుంటే మీరేం చేస్తున్నారంటూ ఆగ్రహం వెలిబుచ్చారు. తానే స్వయంగా చీపురు పట్టి టాయిలెట్స్ రూములను శుభ్రపరిచారు.
ఈ విషయంపై ఎమ్మెల్యే వెంటకటేశ్వరన్ స్పందిస్తూ…. అభివృద్ధి పనుల్లో భాగంగా డెవలప్ మెంట్ ఫండ్ నుంచి అత్యాధునికమైన సౌకర్యాలతో మరుగుదొడ్డిని నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఈ మరుగుదొడ్డిలో వినియోగించేందుకు శానిటరీ న్యాప్ కిన్ మిషన్ ను కూడా ఏర్పాటు చేయిస్తానని పేర్కొన్నారు. ఓ ఎమ్మెల్యే ప్రభుత్వ పాఠశాలలోని టాయిలెట్స్ క్లీన్ చేయడంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మొత్తానికి ఈ ఎమ్మెల్యే మాత్రం ప్రజాసేవకుడే అండోయ్..!