Dhanush- Aishwarya: ఈ రోజుల్లో పెళ్లి చేసుకున్న ఏ జంట కూడా ఎక్కువ కాలం వైవాహిక బంధంలో కలసి ఉండడం లేదు . పెళ్లయిన కొన్ని రోజులకే చిన్న చిన్న కారణాల వల్ల విడిపోతున్నారు. పెళ్లయి పిల్లలున్నా కూడా పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించకుండా తమ ఇష్ట ప్రకారంగా విడిపోయి చిన్నపిల్లల జీవితాలను నాశనం చేస్తున్నారు.
ఇదే తరహాలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన చాలా జంటలు విడాకులు తీసుకుని విడిపోతున్నారు. అలా విడిపోయిన వారిలో సూపర్ స్టార్ రజినీకాంత్ గారి కుమార్తె సౌందర్య ధనుష్ కూడా ఉన్నారు. సౌందర్య, ధనుష్ విడిపోయినప్పుడు అభిమానులు చాలా బాధపడ్డారు.అయితే అభిమానులు ఈ జంట తప్పకుండా కలుస్తుందని కూడా ఆశలు పెట్టుకున్నారు.
అయితే ప్రస్తుతం ధనుష్, ఐశ్వర్య వీరి విడాకులను రద్దు చేసుకుంటున్నట్లు కోలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.
18 సంవత్సరాలు కలిసి జీవించిన ఈ జంట ఏవో చిన్న చిన్న కారణాలవల్ల విడిపోయారని, ఈ జంట మళ్లీ కలుస్తుందని పెద్దలందరూ వీరిద్దరితో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకుంటామని ధనుష్ తండ్రి చెప్పాడు. చెప్పినట్టుగానే రజినీకాంత్ గారు, ధనుష్ తల్లిదండ్రులు ఈ జంటతో మాట్లాడి పిల్లల కోసమైనా ఇద్దరు కలిసి ఉండాలని నిర్ణయించుకున్నట్టు వార్తలు వినిపించాయి.
దీని పై ఎవరు స్పందించకపోవడంతో నిజమే అని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రం ఈ వార్తలు నిజం కాదని తెలిసింది. వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రముఖ మీడియా సంస్థ ధనుష్ సన్నిహిత వర్గాల్ని సంప్రదించింది. వాళ్లు ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని వాళ్ళు తేల్చి చెప్పేశారు.
Dhanush- Aishwarya:ధనుష్ జంటపై వచ్చినవన్నీ ఫేక్ వార్తలేన..
అయితే వాళ్ళిద్దరూ కలుసుకోవడం కాదు కదా కనీసం మాట్లాడుకోవడానికి కూడా ఇష్టపడడం లేదని వాళ్ళు చెప్పారు. వాళ్ళు కేవలం పిల్లల బాగోతులు చూసుకుంటున్నారని చెప్పారు. ఇక పిల్లలు కోసం కలుస్తున్న సమయంలో ఈ వార్తలు పుట్టుంటాయని వాళ్ళు సమాచారం అందించారు. దీంతో ఐశ్వర్య, ధనుష్ లు కలవడం లేదని తేలిపోయింది.