వివాదాస్పద హీరోగా టాలీవుడ్ లో అందరి దృష్టిలో పడిన నటుడు విశ్వక్ సేన్. ఆయన ప్రతి సినిమా విషయంలో ఏదో ఒక వివాదం నెలకొంటూ ఉంటుంది. తాజాగా యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాకి హ్యాండ్ ఇచ్చి అతని కోపానికి కారణం అయ్యాడు. అయితే బయట వివాదాలు ఎలా ఉన్నా కూడా వరుసగా సినిమాలతో మాత్రం విశ్వక్ సేన్ హిట్స్ కొడుతున్నాడు. కమర్షియల్ గా భారీగా కలెక్షన్స్ రాబత్తకపోయిన నిర్మాతకి నష్టాలు మాత్రం తీసుకురావడం లేదు. తాజాగా ఓరి దేవుడా సినిమాతో విశ్వక్ ప్రేక్షకుల ముందుకి వచ్చి హిట్ కొట్టాడు. ఇదిలా ఉంటే ఈ యంగ్ హీరో కూడా ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా మారిపోతున్నాడు. ధమ్కీ సినిమాతో తానే దర్శకుడిగా, నిర్మాతగా మారి హీరోగా చేస్తున్నాడు.
పలకనుమా దాస్ కి సీక్వెల్ గా ఈ మూవీని విశ్వక్ సేన్ తెరకేక్కిస్తున్నాడు. అయితే ఈ మూవీ ఒరిజినల్ కథతో తీస్తూ ఉండటం విశేషం. ఇక అందరి తెలుగు హీరోల మాదిరిగానే ధమ్కీ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోవాలని ఆశపడుతున్నాడు. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ ఫస్ట్ లుక్ లో మాస్ కా దాస్ అన్న క్యారెక్టర్ గా కరెక్ట్ గా సరిపోయే విధంగా విశ్వక్ కనిపించబోతూ ఉండటం విశేషం.
యూత్ కి కనెక్ట్ అయ్యే విధంగా విశ్వక్ లుక్ ఉండటం విశేషం. మరి ఈ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో ఈ రౌడీ హీరో ధమ్కీ సినిమాతో ఎంత వరకు సక్సెస్ అవుతాడనేది చూడాలి. ఇక ఈ మూవీతో పాటు మరో రెండు సినిమాలు విశ్వక్ సేన్ చేతిలో ఉన్నాయి. అయితే ఈ కుర్ర హీరో మాత్రం తాను దర్శకత్వం వహిస్తూ తెరకెక్కిస్తున్న సినిమాపైనే ఎక్కువ ఫోకస్ పెట్టాడు.