ఈ మధ్యకాలంలో టాలీవుడ్ నుంచి హిందీలో డబ్ చేసి సినిమాలు రిలీజ్ చేయడం ఎక్కువ అయిపొయింది. తెలుగు సినిమాపై నార్త్ ఇండియా ఆడియన్స్ ఆసక్తి చూపించడంతో అక్కడ బాగానే కలెక్షన్స్ వస్తున్నాయి. బాహుబలి సినిమా తర్వాత హిందీలో రిలీజ్ అవుతున్న తెలుగు సినిమాల సంఖ్య గణనీయంగా పెరిగింది. అక్కడ తెలుగు సినిమాలకి ఆదరణ కూడా బాగా ఉండటంతో నిర్మాతలు కూడా కొద్దిగా ఖర్చు పెట్టి తెలుగులో తెరకెక్కించిన సినిమాని హిందీలో డబ్బింగ్ చేసేసి వదులుతున్నారు. పాన్ ఇండియా సినిమాలు అయితే మార్కెట్ పరంగా, బడ్జెట్ పరంగా యూనివర్శల్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతాయి కాబట్టి పర్లేదు. అయితే కొన్ని చిన్న సినిమాలు కూడా పాన్ ఇండియా పేరు పెట్టుకొని రిలీజ్ అవుతున్నాయి.
అయితే ఇవి ఇప్పుడు రిలీజ్ అవుతున్నాయో కూడా తెలియడం లేదు. ఇక ఈ అలవాటుని ఇప్పుడు తెలుగు నేటివిటీ, కమర్షియల్ ఫార్ములాతో తెరకెక్కించే సినిమాలకి కూడా వాడేస్తున్నట్లు అనిపిస్తుంది. త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో రవితేజ హీరోగా ధమాకా అనే సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా షూటింగ్ చివరిదశకి వచ్చేసింది. అయితే ఇప్పుడు ఈ మూవీని కూడా హిందీలో రిలీజ్ చేయడానికి నిర్మాతలు, దర్శకుడు ప్లాన్ చేస్తున్నాడు. ఓ విధంగా చెప్పాలంటే ధమాకా రొటీన్ ఫార్ములా కథతో వస్తున్న సినిమాగానే రవితేజ స్టిల్స్ , సాంగ్స్ చూస్తూ ఉంటే కనిపిస్తుంది.
అయితే ఇలాంటి సినిమాతో హిందీ ఆడియన్స్ దగ్గరకి వెళ్తే ఎంత వరకు ఆధరిస్తారేమో చెప్పలేం. తెలుగు సినిమాల మీద వారికి ఒక మంచి అభిప్రాయం ఉంది. అయితే కమర్షియల్ కథలని కూడా హిందీలో డబ్ చేసి వదలడం ద్వారా టాలీవుడ్ మీద ఉన్న మంచి ఒపీనియన్ పోతుందనే మాట వినిపిస్తుంది. అయితే తెలుగు కమర్షియల్ సినిమాలకి హిందీలో ఏ స్థాయిలో ఆదరణ ఉంటుంది అనేది మాత్రం ధమాకా సినిమాతో తెలిసిపోయే అవకాశం ఉంది. ఒకవేళ రిజల్ట్ నెగిటివ్ గా వస్తే తరువాత ఇలాంటి కథలతో అక్కడి ప్రేక్షకుల ముందుకి వెళ్లే సాహసం చేయరు.