Devotional Tips: మనం మామూలుగా కొంతమంది ఏ పని చేసినా కలిసి రావడం చూస్తుంటాం. ఏ పని మొదలుపెట్టినా, అది సక్సెస్ అవడంతో పాటు బాగా లాభాలను కూడా ఆర్జిస్తుంటారు. కానీ మరికొందరు మాత్రం ఎంత కష్టపడినా వారికి కాలం కలిసి రాదు. నిజానికి జ్యోతిష్యం ప్రకారం కొంతమందికి వారి రాశుల వల్ల ఈ ప్రభావం ఉంటుందట. సంపదకు మూలమైన లక్ష్మీదేవి కృప కొన్ని రాశుల వారి మీద ఎక్కువగా ఉంటుందని, వారు ఏం చేసినా డబ్బు కురుస్తుంటుందట. మరి లక్ష్మి దేవికి ఇష్టమైన ఆ రాశులు ఏంటో మీరూ తెలుసుకోండి.
కర్కాటకరాశి:
లక్ష్మీదేవి కరుణా, కటాక్షాలు ఉండే రాశుల జాబితాలో కర్కాటక రాశి కూడా ఒకటి. ఈ రాశి వారి మీద లక్ష్మిదేవి చల్లని చూపు ఉంటుందట. అందుకే ఈ రాశి వారు ఏ పని మొదలుపెట్టినా లక్ష్మీదేవి కరుణ వల్ల విజయం సాధిస్తారట.
వృశ్ఛికరాశి:
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం వృశ్ఛికరాశి వారికి చిన్నప్పటి నుండే సంపదలు ఉంటాయి. వీరి జీవితం ఎంతో ప్రశాంతంగా, డబ్బుతో కూడి ఉంటుందట. లక్ష్మీదేవి అనుగ్రహం ఈ రాశి వారి మీద ఉంటుంది కాబట్టే వీరికి డబ్బు లోటు ఎప్పుడూ రాదట.
Devotional Tips: వృషభరాశి:
లక్ష్మీదేవి కటాక్షం ఉంటే మరో రాశి వృషభరాశి. ఈ రాశి వారు కూడా ఎంతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారట. ఈ రాశి వారు పుట్టినప్పుడు డబ్బు లేకపోయిన తర్వాత తర్వాత మాత్రం బాగా సంపాదిస్తారట.
సింహరాశి:
ఎల్లప్పుడూ లక్ష్మీదేవి కటాక్షం ఉండే రాశుల్లో సింహరాశి కూడా ఒకటి. సింహరాశి వారు ఎంతో కష్టపడి పని చేస్తారని, వీరి మీద లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుందని జ్యోతిష్యం చెబుతోంది.