Devotional Tips: మనం ఏదైనా ఒక పనిని చేస్తున్నప్పుడు అది విజయవంతంగా పూర్తికావాలని కోరుకుంటాం. అయితే అందుకోసం మనం మన ఇష్టమైన దేవుడికి మొక్కుకుంటాం. అయితే కొంతమందికి శివుడు తమ ఇష్టదైవంగా భావిస్తే, మరికొందరు విష్ణువును ఇష్టదైవంగా భావిస్తారు. అయితే ప్రతి ఒక్కరికి ఇష్టదైవం ఉంటుందని, ఇష్టదైవం గురించి తెలుసుకొని ప్రార్థిస్తే మంచి ఫలితాలు వస్తాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.
ఒక ఆఫీసులో ఎలాగైతే ఏ పని, ఏ సెక్షన్ అధికారిని పట్టుకుంటే అవుతుందో అలాంటిదన్న మాట. మనకు ఎప్పుడూ అండగా ఉంటే దేవుడికి మనం ప్రార్థిస్తే అతడు/ఆమె మనం అనుకున్న పనులను పూర్తి చేస్తారట. అందుకే ఇష్టదైవాన్ని తెలుసుకొని, ప్రార్థించడం ఎంతో ముఖ్యం అంటూ జ్యోతిష్య నిపుణులు చెబుతుంటారు.
ఇంతకీ మీ ఇష్టదైవాన్ని ఎలా తెలుసుకోవాలి?
ఇష్టదైవం ఎవరు అనేది తెలుసుకోవడం అనేది కాస్త జన్మ కుండలితో లేదంటే మన పేరుతో ముడిపడిన వ్యవహారం. అందుకే జ్యోతిష్యం గురించి తెలిసిన వారి ద్వారా ఇష్టదైవం ఎవరనే విషయాలను తెలుసుకోవడానికి వీలవుతుంది. జ్యోతిష్య శాస్త్రంలో జన్మ కుండలి పంచమ భాగం ద్వారా జ్యోతిష్యులు ఇష్టదైవం ఎవరు అనేది చెబుతారట.
Devotional Tips:
అదే సమయంలో మన పేర్లను బట్టి ఎలాగైతే మన రాశి ఏంటని, జాతకం ఎలా ఉంటుందో ఎలా చెబుతారో.. అలాగే మన పేర్ల రాశిని బట్టి ఇష్టదైవాన్ని కూడా చెబుతారట. ఇలా ఇష్టదైవాన్ని తెలుసుకున్న తర్వాత ఆ ఇష్టదైవాన్ని ప్రసన్నం చేసుకోవడం ద్వారా మనకు కావాల్సిన ఫలితాలు త్వరగా సిద్ధిస్తాయట.