Devotional: హిందూ మత విశ్వాసాల్లో ప్రతి వారానికి ఒక ప్రాధాన్యత ఉంది. హిందూ దేవతల్లో ఒక్కో దైవానికి ఒక్కో రోజు ప్రత్యేకతగా చెబుతారు. అందుకే చాలా మంది వారంలోని ఏడు రోజుల్లో ఒక్కో రోజు ఒక్కో దేవుడ్ని పూజిస్తుంటారు. ప్రతి ఒక్కరూ చేసే పూజల వెనుక వారి ఉద్దేశ్యం, అంతరార్థం దాదాపుగా ఒకేలా ఉంటాయి. ఎందుకంటే ఏ కోరికలు, వ్రతాలు, నోములను ఎవ్వరూ చేయరు. అందుకే వారంలో ఏదో ఒక రోజున జపం, హోమం, దానం, తపస్సు లాంటివి చేస్తుండాలి. ఇలా చేయడం వల్ల సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
సూర్యుడ్ని కొలవాలి
ఆదివారాన్ని సూర్య భగవానుడికి అంకితం ఇచ్చారు. సూర్యుడ్ని ఆరోగ్యానికి సంబంధించిన దేవుడిగా పరిగణిస్తారు. ఈ రోజున వేద పండితులను, ఇతర దేవతలను పూజించాలి. భాస్కరుడ్ని ఆదివారం రోజు ఆరాధించడం వల్ల కంటికి సంబంధించిన రోగాలు, కుష్టు వ్యాధి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇదే రోజు బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. ఇలా మూడ్నెళ్లు, ఒక ఏడాది లేదా మూడేళ్ల పాటు చేస్తే అనారోగ్య సమస్యల నుంచి బయటపడొచ్చు.
ఈశ్వరుడి ఆరాధన మంచిది
సోమవారం రోజు మహాశివుడికి అంకితమివ్వబడింది. పరమేశ్వరుడి ఆదేశం లేనిదే చీమైనా కుట్టదని పురాణాల్లో పేర్కొనబడింది. అంటే మనం ఏది చేయాలన్నా శంకరుడి అనుమతి తప్పనిసరి. కాబట్టి సోమవారం రోజున ఈశ్వరుడ్ని ఆరాధించే వారికి సకల సంపదలు లభిస్తాయి.
బ్రాహ్మణోత్తములకు భోజనాలు పెట్టాలి
మంగళవారం రోజున ఆంజనేయ స్వామి, కుమారస్వామికి అంకితమవ్వబడింది. ఈ పవిత్రమైన రోజున మీరు ప్రశాంతంగా ఉండాలి. కోపాన్ని తగ్గించుకోవడం వల్ల మానసికంగా ప్రశాంతత లభిస్తుంది. కోపాన్ని నియంత్రణలో ఉంచుకునేందుకు కాళీ దేవతను కూడా పూజించొచ్చు. ఈ రోజున వివిధ రకాల పప్పులతో బ్రాహ్మణోత్తములకు భోజనం పెట్టాలి. ఇలా చేయడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి బయటపడొచ్చు.
బుధవారం రోజున వినాయకుడికి, మణికంఠుడికి అంకితమివ్వబడింది. ఇదే రోజున శ్రీ మహా విష్ణువు ఆరాధన కూడా చేయొచ్చు. ఇలా చేయడం చాలా మంచిది. ఈ పవిత్రమైన రోజున పెరుగన్నం నైవేద్యంగా పెట్టాలి. ఇలా చేయడం వల్ల సంతానం గురించి శుభవార్తలు వినిపిస్తాయి. మీ మ్యారేజ్ లైఫ్ సంతోషంగా ఉంటుంది.
గురువారం రాఘవేంద్ర స్వామి, సాయిబాబాతో పాటు గురువులకు అంకితం ఇచ్చారు. ఆరోగ్యం, ఆయుష్షు, ఐశ్వర్యం కోరుకునే వారు ఈ రోజున గురుదేవుళ్లకు అభిషేకం చేయాలి. ఈ రోజు మీ సామర్థ్యం మేరకు పసుపు రంగు వస్త్రాలను దానంగా ఇస్తే శుభ ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
Devotional:
లక్ష్మీదేవికి శుక్రవారం రోజున అంకితం ఇచ్చారు. ఈ పవిత్రమైన రోజున పెళ్లయిన మహిళలందరూ భక్తిశ్రద్ధలతో పూజలు చేయాలి. అదే విధంగా లలితాదేవిని కూడా ఆరాధించాలి. దీని వల్ల మీకు ఐశ్వర్యం, సంపద లాంటివి పెరుగుతాయి. ఈ రోజు అలంకరణ వస్తువులను దానంగా ఇవ్వాలి. అదే విధంగా బట్టలను కూడా దానంగా ఇవ్వొచ్చు.