బింబిసారా సినిమాతో బ్లాక్ బెస్ట్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న కళ్యాణ్ రామ్ నెక్స్ట్ సినిమాలు కూడా అంతే స్థాయిలో డిఫరెంట్ కాన్సెప్ట్ లతో ప్లాన్ చేసుకుంటున్నాడు. అందులో భాగంగా ఇప్పటికే అమిగోస్ అనే డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీని సెట్స్ పైకి తీసుకొని వెళ్ళాడు. ఇందులో మూడు భిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రలలో కళ్యాణ్ రామ్ కనిపిస్తున్నాడు. ఇక ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఇదిలా ఉంటే కళ్యాణ్ రామ్ గతంలో డెవిల్ టైటిల్ తో ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ రిలీజ్ అయ్యి ఏడాదికి పైగా అవుతుంది. నవీన్ మేడారం దర్శకత్వంలో ఈ సినిమా ఉండబోతుంది.
1945 బ్యాక్ డ్రాప్ లో బ్రిటిష్ ప్రభుత్వంలో పని చేసిన ఇండియన్ స్పై క్యారెక్టర్ లో కళ్యాణ్ రామ్ కనిపించబోతున్నాడు. యాక్షన్ బ్యాక్ డ్రాప్ లోనే రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకొని నవీన్ మేడారం ఈ మూవీ కథ సిద్ధం చేసినట్లు తెలుస్తుంది . ఇక భారీ బడ్జెట్ తో తెరకెక్కబోయే ఈ సినిమాకి సంబంధించి కళ్యాణ్ రామ్ తాజాగా అప్డేట్ ఇచ్చారు. జిమ్ లో వర్క్ అవుట్ చేస్తున్న ఫోటో షేర్ చేస్తూ డెవిల్ మూవీ కోసం సిద్ధం అవుతున్నట్లు చెప్పాడు.
త్వరలో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లి కంటిన్యూ షూటింగ్ జరుపుకుంటుందని చెప్పాడు. దీంతో డెవిల్ మూవీ ఆగిపోయింది అనే టాక్ కి ఫుల్ స్టాప్ పడింది. మొత్తానికి బింబిసారా ఇచ్చిన స్ఫూర్తితో కళ్యాణ్ రామ్ పవర్ ఫుల్ సబ్జెక్ట్స్ తో డిఫరెంట్ సినిమాలు చేయడానికి మరింత ధైర్యంగా ముందడుగు వేస్తూ ఉండటం విశేషం. ఇక అమిగోస్ సినిమా షూటింగ్ కూడా చివరి దశకి వచ్చినట్లు తెలుస్తుంది. త్వరలో దీనికి సంబందించిన అప్డేట్ కూడా ఇవ్వడానికి రెడీ కాబోతున్నట్లు బోగట్టా.