రాధ పిల్లలకు పొలం, రైతు ప్రత్యేకత గురించి వివరిస్తుంది. రాధతో కలిసి ఆదిత్య నాగలి దున్నుతాడు. దానికి పిల్లలు సంతోషిస్తారు. మరోవైపు జానకి వీల్ చైర్‌లో నుంచి కిందపడుతుంది. మాధవ్ చేతికర్ర సహాయం లేకుండా నడవడం చూసి రామ్మూర్తి షాకవుతాడు. అంతేకాకుండా రాధపై అధికారం చెలాయించే ప్రయత్నం చేయకని మాధవ్‌కు వార్నింగ్ ఇస్తాడు. ఆ తర్వాత అక్టోబర్ 17 ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
‘అమ్మా.. ఆఫీసర్ సార్ కాళ్లకి మట్టి అంటిది కదా నీళ్లు పోయమ్మా’ అంటుంది చిన్మయి. దాంతో రాధ నీళ్లు పోస్తే ఆదిత్య కాళ్లు, చేతులు కడుక్కుంటాడు. ఆ తర్వాత టవల్ కూడా ఇవ్వమంటుంది చిన్మయి. ‘నా పెనిమిటిని నన్ను కలిపే ప్రయత్నం చేయకు’ అని చిన్మయిని ఉద్దేశించి మనసులో అనుకుంటుంది రాధ. ఆ తర్వాత మాధవ్ కూడా పొలం దగ్గరికి వస్తాడు. ఆదిత్య, రాధలు మాట్లాడుకోవడం చూసి కుళ్లుకుంటాడు. నేనుండాల్సిన స్థానంలో ఆదిత్య వచ్చి చేరాడని తిట్టుకుంటాడు జానకిని. నిన్ను ఇలా సంతోషంగా చూస్తూ ఊరుకోనని సత్యకు ఫోన్ చేసి కలవమంటాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటారు. ‘నీకెలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఇంట్లో ఉన్న నీకు ఆదిత్య ఏం చేస్తున్నాడో ఎక్కడ ఉన్నాడో ఏం తెలియదు’ అంటూ ఆదిత్య మీద కోపం వచ్చేలా మాటలు చెప్తాడు మాధవ్. కలెక్టర్ అయిన నీ భర్తకు నా భార్యతో చేల వెంబడి చెట్ల వెంబడి తిరగాల్సిన అవసరం ఏముంది చెప్పు అంటూ.. జరిగిందంతా చెప్తాడు.
అది విని సత్య షాకవుతుంది. ‘సత్య ఒకటి నాకు చాలా బాధగా అనిపించింది. ఇతరులు భార్యతో కలెక్టర్ ఇలా చేస్తుంటే కలెక్టర్ భార్య ఏం చేస్తుంది అని అందరూ అనుకోవడం చెవులారా విన్నా’ అని రెచ్చగొడతాడు మాధవ్. ఆ మాటలకు బాధపడుతూ వెళ్లిపోతుంది సత్య. అపుడు మాధవ్ హ్యాపీగా ఫీలవుతాడు. ఆ తర్వాత సీన్‌లో దేవుడమ్మ ఇంట్లో ఏదో తెలియని అలజడి కనిపిస్తుందని భర్తతో చెప్పి మదనపడుతుంది. రుక్మిణితో పాటే ఈ ఇంటి ఆనందం పోయిందా అనిపిస్తుంది అంటాడు ఈశ్వరప్రసాద్. ‘అవునండీ రుక్మిణి చనిపోయిందని కొంత కాలం, ఆదిత్య ఏమై పోతాడా అని కొంతకాలం, సత్య ఆదిత్యలు ఒకటవుతారా? అని కొంతకాలం ఇలా ఎప్పటికప్పుడు ఏదో ఒక కారణం ఈ ఇంటి సంతోషాన్ని దూరం చేస్తుంది’ అంటూ ఎమోషనల్ అవుతుంది దేవుడమ్మ. సత్య, ఆదిత్యల సమస్య ఎలా తీరుతుందో అర్థం కావట్లేదని భర్తతో చెప్తూ బాధపడుతుంది. నువ్ చెప్తే ఆదిత్య వింటాడు కద దేవుడమ్మా.. అని భర్త సూచించగా నేను ఎవరికి చెప్పే విదంగా వారికి చెప్పాను కానీ ఇద్దరిలో మార్పు కనిపించట్లేదంటుంది.
బాషా వచ్చి ఆదిత్య ఈ రోజు కూడా ఆఫీసుకు పోలేదని చెప్తాడు దేవుడమ్మతో. అసలు వాడికి ఏమైంది నాకేం అర్థం కావట్లేదంటాడు దేవుడమ్మ. బాషాని వాళ్లకి ఏమైందో తెలుసుకోమ్మంటుంది. సరేనంటాడు బాషా. ఆ తర్వాత రాధ పొలం నుంచి భాగ్యమ్మతో కలిసి ఇంటికి వస్తుంది. మాధవ్ ఎదురుగా వచ్చి ‘రాధా పొలం దున్ని బాగా అలిసిపోయావ్ కదా. ఒళ్లు నొప్పులు ఉంటాయి. వేడి నీల్లు పెట్టు భాగ్యమ్మ’ అంటాడు. ఆ మాటలకు రాధ కళ్లెర్రజేస్తుంది కానీ ఏమీ అనదు. భాగ్యమ్మ వచ్చి నాగలి దున్నినవ్ అంటుండు నువ్ నీ పెనిమిటితో సంతోషంగా ఉన్నదంతా చూసిండేమో అంటుంది రాధతో. ఇద్దరూ కలిసి మాధవ్ ప్రవర్తనపై మండిపడతారు. ఆ తర్వాత రాధ.. ఆదిత్యతో కలిసి పొలంలో చేసిన పనులను గుర్తు చేసుకుని సంబరపడిపోతుంది.
సీన్ కట్ చేస్తే.. సత్య మాధవ్ చెప్పిన మాటల్ని గుర్తుచేసుకుంటుంది. అంతలోనే దేవుడమ్మ వచ్చి భోజనం చేద్దువు పద అంటుంది కోడల్ని. నాకు ఆకలిగా లేదు మీరు వెళ్లి తినండి అంటుంది సత్య. నువ్ ఇలా ఆలస్యంగా తింటే ఆరోగ్యం పాడైపోతుందని సూచిస్తుంది దేవుడమ్మ. జీవితం పాడైపోతుంటే ఆరోగ్యం ఎంత ఆంటీ.. అని అంటుంది సత్య. ఆ తర్వాత రాధ.. మా నాయన గురించి చెప్పమ్మా అన్నమాటల్ని తలుచుకుంటూ కుమిలిపోతుంది. సత్యని చూస్తే బాధగా ఉందని దేవుడమ్మతో చెప్తుంది రాజమ్మ. ఇద్దరూ కలిసి సత్య గురించి మాట్లాడుకుంటారు. అంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది.