ఒంటరిగా ఉన్న చిన్మయితో మాట్లాడతాడు మాధవ్. అపుడు తండ్రితో తన బాధనంతా చెప్పుకుంటుంది కూతురు. మరోవైపు రాధ కూడా మాధవ్‌కు వార్నింగ్ ఇస్తుంది. రామ్మూర్తి జానకిని అందంగా ముస్తాబు చేస్తాడు. పిల్లలిద్దర్నీ తీసుకుని రాధ పొలానికి వెళ్తుంది. ఆ తర్వాత అక్టోబర్ 15 ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
రాధ నాగలిని భుజాన మోస్తూ పొలం దున్నడం ఎలానో చూపిస్తుంది పిల్లలకు. వెనకాల భాగ్యమ్మ కూడా సాయం చేస్తుంది. దేవి, చిన్మయిలు కూడా మేం సహాయం చేస్తాం అమ్మా… అంటే సరేనంటుంది రాధ. పిల్లలతో కలిసి రాధ నాగలి దున్నుతుంది. అమ్మా జారిపోతుంది పడిపోతామేమో అంటుంది చిన్మయి. నాకలవాటే కానీ మీరు జాగ్రత్త బిడ్డా అంటుంది రాధ. రుక్మిణిని చూసి భాగ్యమ్మ గతాన్ని గుర్తుచేసుకుంటుంది. ఆనాటి నుంచి ఈనాటి వరకు నా బిడ్డకు అదే కష్టమని బాధపడుతుంది. నాగలి మస్తు బరువున్నది ఎలా మోస్తున్నవమ్మా అని అడుగుతారు పిల్లలు. రైతులు ఈ బరువు మోయడానికి చాలా ఇష్టపడతాడు. ఎందుకంటే దేశానికి అన్నం పెట్టాలి కదా అని చెప్తుంది. రైతు చాలా మంచోడు కదా అమ్మా అని పిల్లలడగ్గా.. రైతు గొప్పతనమేంటో వివరిస్తుంది రాధ పిల్లలకు.
సీన్ కట్ చేస్తే.. మాధవ్ రావడం చూసి జానకి వీల్ చైర్‌ని పక్కకు జరుపుకుంటుంది. దాంతో కిందపడిపోతుంది. అది చూసి అమ్మా అని మాధవ్ అరవగానే రామ్మూర్తి కూడా వస్తాడు అక్కడికి. ఇద్దరూ కలిసి జానకిని కుర్చీలో కూర్చోపెడతారు. ఆ సమయంలో మాధవ్ కర్ర విడిచిపెట్టి పరుగెత్తుకుంటూ వస్తాడు జానకి దగ్గరికి. చేతి కర్ర సహాయం లేకుండా నిల్చున్నమాధవ్‌ని చూసి రామ్మూర్తి షాకవుతాడు. అదేంట్రా కర్ర అక్కడ ఉంటే ఎలా వచ్చావ్ రా అని కొడుకును ప్రశ్నించగా.. అమ్మ పడిపోయిందన్న కంగారులో చేతిలో స్టిక్ పడిపోయింది కూడా చూసుకోలేదు నాన్నా అని కవర్ చేసుకుంటాడు మాధవ్. రామ్మూర్తి వెళ్లి స్టిక్ తీసుకొచ్చి ఇస్తాడు కొడుక్కు. ‘అమ్మా నువ్ ఓకే కదా.. నీకేం కాలేదు కదా’ అని నటిస్తాడు తల్లి దగ్గర. ఏం కాలేదనగా అక్కడినుంచి వెళ్లిపోతాడు మాధవ్. ఆ తర్వాత రామ్మూర్తి వచ్చి జానకితో కొడుకుని నువ్ తప్పుగా అర్థం చేసుకున్నావని సమర్థిస్తాడు.
ఆ తర్వాత సీన్‌లో ఆదిత్య కూడా పొలం దగ్గరికి వెళ్తాడు. ‘దేవీ ఆఫీసర్ అంకుల్ వచ్చాడు వెళ్దాం పద అంటూ తీసుకెళ్తుంది చిన్మయి’. దేవి ఆఫీసర్‌తో మాట్లాడకుండా సైలెంట్‌గానే ఉండిపోతుంది. అది చూసి ఆదిత్య ‘ఏంటమ్మా దేవి.. నాతో మాట్లాడవా’ అని ప్రశ్నిస్తాడు. భాగ్యమ్మ, రాధ, చిన్మయిలు ఆదిత్య దగ్గరికి వెళ్లమని చెప్పినా దేవి కదలదు అక్కడి నుంచి. ఆదిత్యే వెళ్లి ‘ఏంటమ్మా నామీద కోపమా’ అని అడుగుతాడు. నాకు ఎవరి మీద కోపం లేదని చెప్పినా ఆదిత్య వినడు. నీకు నా మీదున్న కోపం పోవాలంటే ఏం చేయాలో చెప్పు అని అడుగుతాడు ఆదిత్య. అపుడు చిన్మయి ‘మీరు వచ్చి అమ్మతో నాగలి పట్టి దున్నాలి’ అని అంటుంది. ‘వద్దు బిడ్డా.. ఆఫీసర్‌కు అవన్నీ తెలియదు’ అని రాధ చెప్పగా.. తెలియకపోతే చెప్పడానికి నువ్ ఉన్నావ్ కదా అంటాడు ఆదిత్య రాధతో. వద్దు మీకు మట్టి అంటుతుందని రాధ ఎంత చెప్పినా వినిపించుకోడు ఆఫీసర్. నాగలి భుజాల మీద మోస్తు రాధతో కలిసి నాగలి దున్నుతాడు. అపుడు చిన్మయి వెళ్లి ‘ఆఫీసర్ అంకుల్ మీ ఫోన్ ఇవ్వండి’ అంటుంది. ఎందుకమ్మా ఎవరికి ఫోన్ చేస్తావ్ అని అడగ్గా.. మీ ఫోటోలు, వీడియోలు తీస్తానంటుంది చిన్మయి. వద్దు బిడ్డా అని రాధ చెప్పినా చిన్మయి వినిపించుకోదు. దాంతో ఆదిత్య ఫోన్ ఇస్తాడు. రాధకు డిలీట్ చేస్తా నువేం కంగారు పడకు అంటాడు ఆదిత్య.
ఆ తర్వాత మాధవ్ ‘నాన్నా.. రాధ ఎక్కడికి వెళ్లింది’ అని అడుగుతాడు. పొలానికి వెళ్లిందని చెప్పగా ఎందుకు పంపిచారు. ఇంట్లో అమ్మకు సేవ చేసి రాధ అలిసిపోతుంది కదా అంటాడు. వెళ్తా అంటే నేనెలా వద్దంటానురా.. పైగా పిల్లలతో కలిసి వెళ్లిందని చెప్తాడు రామ్మూర్తి. సరే నాన్నా.. నేను వెళ్లి రాధని తీసుకొస్తానంటాడు మాధవ్. ‘నువ్వెళ్లి తీసుకురావడం ఏంటిరా.. ఈ అమ్మాయిని ఇది వద్దు కావాలి అనే హక్కు మనకు లేదు’ అంటాడు రామ్మూర్తి. హక్కు కాదు నాన్నా.. అభిమానం అంటాడు మాధవ్. రాధకు ఏ రోజు ఏ విషయంలో హద్దులు గీసి అధికారం చెలాయించే ప్రయత్నం చేయకు. ఆ అమ్మాయికి ఏ చిన్న హాని చేసినా నేను సహించను అని చెప్పి వెళ్లిపోతాడు రామ్మూర్తి. మరి మైండ్ బ్లాకయిన మాధవ్ ఏం చేస్తాడో తెలియాలంటే తరువాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే..