రాధ, ఆదిత్యలకు క్లాస్ పీకుతుంది సత్య. ఆ మాటలకు రాధ చాలా బాధపడుతుంది. సత్యకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలో తెలియక ఆదిత్య కూడా మదనపడతాడు. దేవితో మాట్లాడడానికి స్కూల్ దగ్గరికి వెళ్తాడు ఆదిత్య. కానీ దేవి ఆ అవకాశం ఇవ్వదు. అంతేకాకుండా దేవి టీచర్‌తో దురుసుగా ప్రవర్తిస్తుంది. ఆ తర్వాత రామ్మూర్తి రాధ సేవల్ని కొనియాడతాడు. ఇప్పుడు అక్టోబర్ 14 ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
దేవి మాటల్ని తలుచుకుంటూ చిన్మయి బాధపడుతుంది. చెల్లెలు దేని గురించో బాధపడుతుంది. అదేంటో తెలుసుకోవాలి. లేకపోతే చదువు పాడవుతుంది అనుకుంటుంది చిన్మయి మనసులో. చిన్మయిని చూసి మాదవ్‌కు అనుమానం కలుగుతుంది. నా బిడ్డను దగ్గరికి తీసుకుని చాలా రోజులయిందని తన దగ్గరికి వెళ్తాడు. ‘చిన్మయి.. ఏంటి తల్లి అలా ఉన్నావ్. ఈ మద్య ఎప్పుడు చూసినా ఏదో ఆలోచిస్తూ బాధపడుతూ కనిపిస్తున్నావ్.. ఏదైనా ప్రాబ్లం ఉంటే నాతో చెప్పు’ అంటాడు మాధవ్. ఏం లేదు అని చిన్మయి చెప్పగా వెళ్లి పడుకో అంటాడు. ‘నాన్నా.. నీకు నేనంటే ఇష్టమేనా.. ఆఫీసర్ సార్ లాగా నువ్ నన్ను ఎందుకు దగ్గరకి తీసుకోడు. ఆఫీసర్ సార్‌లా నువ్ ఎందుకు మాట్లాడవ్. నిజం చెప్పు నాన్నా.. నీకు నిజంగా నేనంటే ఇష్టం లేదు కదా’ అని అనుమానిస్తుంది. అదేం లేదు తల్లి. కొంచెం పనిలో ఉండి మీతో టైం స్పెండ్ చేయట్లేదంటూ కవర్ చేసుకుంటాడు మాధవ్. ‘నాకు నాన్న ఉన్నా లేనట్టే అనిపిస్తుంది’ అని చెప్పి వెళ్లిపోతుంది చిన్మయి. ఆ మాటలకు మాధవ్ షాకవుతాడు. ‘ఇపుడైనా బిడ్డ మనసు అర్థమైందా? ఇప్పటికైనా మారు.. నువ్ మనిషిగా చచ్చిపోయి చాలా రోజులయింది. అపుడే నీ వాళ్లందరూ మంచిగ ఉంటారు. కాదని ఇట్లనే ఉంటే నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు’ అని రాధ కూడా వార్నింగ్ ఇస్తుంది మాధవ్‌కు.
సీన్ కట్ చేస్తే.. భాగ్యమ్మ రాధని చూసి ‘ఏంది బిడ్డా అట్లున్నావ్’ అంటూ మందలిస్తుంది. మొఖం అంతా అట్లున్నదేంది.. ఆ ఫాల్తు గాడు ఏమైనా చేసిండా.. అని ప్రశ్నిస్తుంది. దేవి వల్ల నిద్ర పట్టట్లేదని బాధపడుతుంది రాధ. చిన్మయి, దేవిల ప్రవర్తనల్ని తల్లికి వివరిస్తూ తల్లడిల్లిపోతుంది రాధ. కష్టం అంటే ఏంటిదని చిన్మయి అడిగిందని… అందుకే పొలానికి తీసుకుపోతానని చెప్తుంది రాధ. నేను కూడా వస్తానంటుంది భాగ్యమ్మ. ఆ తర్వాత రామ్మూర్తి జానకికి బొట్టు పెట్టి తయారు చేసి.. భార్యకి ధైర్యం చెబుతాడు. నీకోసం ఇంత మందిమి ఉన్నామంటూ భరోసానిస్తాడు. అప్పుడే చిన్మయి వచ్చి మేము పొలానికి వెళ్తున్నామని చెప్తుంది. జాగ్రత్తగా వెళ్లమని సూచిస్తాడు రామ్మూర్తి. సరేనంటూ రాధ, దేవి, చిన్మయిలు వెళ్తారు. రాధకు ఉన్న ఓపికని కొనియాడుతాడు రామ్మూర్తి. నిజంగా మన ఇంటి మహాలక్ష్మి అని అంటాడు భార్యతో.
ఆ తర్వాత సీన్‌లో ఆదిత్య ఆఫీసు వాళ్లతో ఫోన్ మాట్లాడుతూ కారులో బయల్దేరతాడు. అపుడే రాధ, భాగ్యమ్మలు పిల్లలతో కలిసి పొలానికి వెళ్తుంటారు. బిడ్డా మిమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానో తెలుసా అంటూ.. కారణం వివరిస్తుంది రాధ. పొలాన్ని చూస్తే కష్టం ఎట్ల తెలుస్తదమ్మా అని చిన్మయి ప్రశ్నించగా.. మట్టి తీసుకుని ఇదే కష్టమని చెబుతుంది రాధ. రైతు గొప్పతనాన్ని పిల్లలకు తెలుపుతుంది. చిన్మయి అడిగిన ప్రశ్నలన్నింటికి రాధ వివరంగా సమాధానం చెప్తుంది. పొలాన్ని ఎలా దున్నాలని చిన్మయి అడగ్గా.. నాగలితో దున్నాలని చూపిస్తుంది భాగ్యమ్మ. విత్తనాలు ఎలా వేయాలి.. నాగలిని ఎలా వాడాలో పిల్లలకు చూపిస్తుంది రాధ. ఆ తర్వాత ఆదిత్య వచ్చి ఏం చేస్తాడో తెలియాలంటే తరువాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే..