మాధవ్ మా నాయన కాదని దేవి చెప్పడంతో సత్య ఫోన్ చేసి అడుగుతుంది. కానీ మాధవ్ మాత్రం దాన్ని కవర్ చేసుకుని మమ్మల్ని ఎలాగైనా కలపమని సత్యనే అడుగుతాడు. ఆ తర్వాత దేవి దేవుడమ్మతో కలిసి వెళ్తుంది. రుక్మిణి ఫొటో దేవుడమ్మ చూపించగానే దేవి ఏం జరుగుతుందో ఊహించుకుంటుంది. ఈ రోజు ఎసిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
తన మీద సత్యకు అనుమానం రావడంతో మాధవ్ కొత్త ప్లాన్ చేస్తాడు. ఆలోచిస్తూ కూర్చున్న తండ్రి దగ్గరికి వస్తుంది చిన్మయి. ‘నాన్నా నాకు దారిలో పది రూపాయిలు దొరికాయి. అవి మా ఫ్రెండ్‌వని తెలిసింది కానీ ఇవ్వలేని లేదు నాన్నా’ అంటుంది. పరాయివాళ్ల డబ్బుకు ఆశపడడం చాలా తప్పు అంటాడు మాధవ్. మరి ఆ తప్పు నువ్వెందుకు చేస్తున్నావ్ నాన్నా. అమ్మ మనకు అమ్మ కాదు. మరి నువ్ ఎందుకు ఆశ పడుతున్నావ్ నాన్నా అని నిలదీస్తుంది. అమ్మ కాకపోవడం ఏంటి నాన్నా.. అంటూ ఆశ్చర్యపోతాడు మాధవ్. నాకు అంతా తెలుసు నాన్నా.. అమ్మ ఆఫీసర్ సారు భార్యని తెలుసు. ఎందుకు ఇబ్బందిపెడుతున్నావ్ అని ప్రశ్నిస్తుంది. చిన్మయి పెద్ద వాళ్ల విషయాలు నీకవసరం లేదని దబాయిస్తాడు కూతుర్ని. దాంతో ఏడుస్తూ లోపలికి వెళ్తుంది చిన్మయి.
సీన్ కట్ చేస్తే.. దేవుడమ్మ కారు దారిలో చెడిపోతుంది. దాంతో పక్కనే ఉన్న గుడి మెట్ల మీద కూర్చుంటుంది దేవుడమ్మ. అక్కడే పూలు అమ్మే వ్యక్తి ‘ఈవిడ ఆఫీసర్ సారు అమ్మలా ఉంది. నేను డబ్బులు ఇవ్వాలి’ అనుకుంటూ వెళ్తాడు. నిన్న ఆఫీసర్ మేడంతో కలిసి దీపాలు వెలిగించాడు. డబ్బులు చిల్లర లేకపోవడంతో నా దగ్గరే ఉంచి వెళ్లాడు తీసుకోండి అంటాడు. నీ నిజాయితీ నాకు నచ్చిందంటుంది దేవుడమ్మ. సత్య, ఆదిత్యలు కలిసిపోయారని సంతోషిస్తుంది.
ఆ తర్వాత దేవి గురించి కంగారు పడుతుంది రాధ. అంతలోనే అక్కడికి వచ్చి మా దోస్తుల ఇంటికి పోయిన అని చెప్తుంది దేవి. నా దగ్గర ఏదో దాస్తుందని టెన్షన్ పడుతుంది రాధ. ఇంటికెళ్లిన దేవుడమ్మను రుక్మిణి గురించి తెలిసిందా అని అడుగుతుంది రాజమ్మ. నిన్న ఆదిత్య, సత్యలు గుడికి వెళ్లి దీపాలు పెట్టారంటా అని చెప్తుంది దేవుడమ్మ. దాంతో రాజమ్మకు అనుమానం వస్తుంది. మన సత్య నిన్న ఇంట్లో నుంచి బయటికే వెళ్లలేదు అక్క. అలాంటిది గుడికి వెళ్లి దీపాలు వెలిగించడం ఏంటి? అని ఆశ్చర్యపోతుంది. అది విని మళ్లీ పరుగున వెళ్తుంది దేవుడమ్మ.
రాధ ఆదిత్యను కలిసి దేవి చెప్పిన మాటల్ని చెప్తుంది. ఇంటికి వచ్చిన విషయం దాచాల్సిన అవసరం ఏముంది.. ఇంకేదైనా కారణం ఉందా అని ఆలోచిస్తారు భార్యభర్తలు. కొంపదీసి నా ఫొటో చూసిందా? మన గురించి తెలిసిందా అని అనుమానపడుతుంది రుక్కు. సత్యతో కాకుండా ఆదిత్య ఎవరితో దీపాలు వెలిగిస్తాడు. ఆదిత్య జీవితంలో మరొకరికి స్థానం లేదు. దీపాలు వెలిగించింది రుక్మిణే అయి ఉంటుందా అన్న ఆందోళన పెరిగిపోతుంది దేవుడమ్మలో. వెంటనే గుడిలోని ఆ వ్యక్తి దగ్గరికి వెళ్లి సార్‌తో వచ్చిన మేడం గుర్తుందా? అని అడుగుతుంది. సత్య ఫొటో చూపించి ఈవిడేనా అని అడగ్గా.. ఈవిడ కాదని అంటాడు అతడు. ఆ తర్వాత రుక్కు ఫొటో చూపించి ఈ మేడమా అని అడగ్గా అవునంటాడు ఆ వ్యక్తి. దాంతో నిర్ఘాంతపోతుంది దేవుడమ్మ.
వేరే వాళ్ల కూతుర్ని నీ కూతురని చెప్పుకోవడానికి సిగ్గు లేదా అని భర్తని ప్రశ్నిస్తుంది. దేవి మాధవ్ కూతురు. నీ కూతురని చెప్పించుకోవడానికి సిగ్గుగా లేదా? అని అరుస్తుంది. దాంతో భార్య చెంప పగలగొడతాడు ఆదిత్య. ఏం తెలుసని మాట్లాడుతున్నావ్.. దేవి నా కూతురు. నా రక్తం పంచుకుని పుట్టిన బిడ్డ. నాకు రుక్మిణికి పుట్టిన బిడ్డ అని నిజం చెప్తాడు. అవునా దేవిని మన ఇంటికి తీసుకురా అంటుంది సత్య. ఇంకా టైం ఉంది అని ఆదిత్య చెప్పగా.. నిజం తెలిసిన తర్వాత ఎందుకు తీసుకురానంటున్నావో నాకు తెలుసని భర్తని తప్పుగా అర్థం చేసుకుంటుంది సత్య. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే వచ్చే ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే..