దేవి క్షేమంగా దొరకడంతో అందరూ ఊపిరి పీల్చుకుంటారు. రెండ్రోజుల తర్వాత ఆదిత్య తిరిగి ఇంటిముఖం పడతాడు. అక్కడ దేవి ఎప్పటిలాగే తన తండ్రి ఎవరో చెప్పమని రాధని సతాయిస్తుంది. తన బెడ్రూంలోకి వెళ్లిన మాధవ్‌కు క్లాస్ పీకుతుంది రాధ. ఆ తర్వాత నవంబర్ 1 ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
మీ నాయన కనిపిస్తే ఏం చేస్తావని ఆదిత్య అడగ్గా.. దేవి తన మనసులో ఉన్నదంతా చెప్పేస్తుంది. మా నాయన్ని వెతకడానికి నాకు సాయం చేస్తావా సారూ అని అమాయకంగా అడుగుతుంది దేవి. ‘తప్పకుండా చేస్తానమ్మా. మీ నాన్నంటే అంత ఇష్టమని తెలిశాక ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తీసుకొస్తా. త్వరలోనే మీ నాన్న నీకు కనిపిస్తాడు’ అంటూ భరోసానిస్తాడు కూతురికి. ఆ తర్వాత ఆదిత్య కారులో వెళ్తూ దేవి అన్న మాటల్ని తలుచుకుంటాడు. నీకు సమాధానం చెప్పలేక నాలో నేనే నరకం అనుభవిస్తున్నాను. నాన్నా అంటూ నువ్ నన్ను అభిమానంగా పిలిచేదెపుడు అనుకుంటాడు. అంతలోనే రుక్మిణి ఫోన్ చేస్తుంది. ‘ఇక్కడ జరిగిన దానికి పరేషాన్ అవుతున్నావా? పెనిమిటి’ అని అడుగుతుంది. నీ గురించే ఆలోచిస్తూ బాధపడుతున్న రుక్మిణి. నా భార్యవని తలుచుకుంటూ నువ్ పడుతున్న నరకాన్ని చూసి బాధపడతున్న. నీకంటే గొప్ప వాళ్లు ఎవరూ ఉండరు రుక్మిణి అంటూ భార్యని పొగడతాడు ఆదిత్య.
మళ్లీ నీకు కనపడతాననుకోలేదు. ఆ దేవుడు మళ్లీ నీ దగ్గరకు నన్ను చేర్చాడు. నువ్ కట్టిన తాళి నా గుండెల మీద ఉంది. నా పెనిమిటి నువే. దేవమ్మని నీ దగ్గరికి పంపిస్తా. మాటిస్తున్నా అంటూ ఎమోషనల్ అవుతుంది రుక్కు. దేవికి నువ్ ఏమని సమాధానం చెప్తావ్ అని ప్రశ్నిస్తాడు ఆదిత్య. ‘గతం గురించి నా బిడ్డకు చెప్పను. నువే నాయనవని తెలిస్తే మస్తు ఖుషి అయితది. మనసు నిండా నాయన కావాలని ఉంది’ అంటుంది రుక్క. బిడ్డని పంపిస్తా.. అంటున్నావ్ కానీ నువ్ రావా రుక్మిణి అని ఆదిత్య అడగ్గానే వెక్కి వెక్కి ఏడుస్తూ ఫోన్ కట్ చేస్తుంది రుక్మిణి.
సీన కట్ చేస్తే.. స్కూల్లో పిల్లలు నాన్న గురించి పోట్లాడుకుంటారు. దేవి వెళ్లి గొడవ ఆపే ప్రయత్నం చేస్తుంది. కానీ నాన్న గురించి ఆలోచిస్తూ బాధపడుతుంది. ఆ తర్వాత స్కూల్ నుంచి ఇంటికి వెళ్తారు చిన్మయి, దేవిలు. స్కూల్లో జరిగిందంతా రాధకు చెప్తుంది. మా నాయన కూడా అలాంటోడేనా? అందుకే నువ్ కూడా ఇడిసి పెట్టి వచ్చినవా.. అని రాధని నిలదీస్తుంది. అందుకే నాయనకు నన్ను దూరం పెడుతున్నావా? ఇంకెపుడు నాయన్ని రానీయకు. నీలాంటోడు ఉంటే ఎంత లేకుంటే ఎంత అను? అంటూ సలహా ఇస్తుంది దేవి. దాంతో రాధకు కోపం వచ్చి దేవి మీదికి చేయి ఎత్తుంది. నీకేం తెలుసని మాట్లాడుతున్నావ్? అంటూ కూతురు మీద అరుస్తుంది. అయితే మా నాయన చెడ్డోడు కాదు. అందుకే అమ్మకు కోపం వచ్చిందంటూ సంబరపడిపోతుంది దేవి.
దేవి మాటల్ని తలుచుకుంటూ కుమిలిపోతుంది రుక్కు. చిన్మయి వచ్చి ‘ఆఫీసర్ అంకులే నాన్నా అని తెలియక చెల్లి అట్ల మాట్లాడింది. ఎందుకు అలా ఊరుకున్నావ్’ అంటూ రాధని ప్రశ్నిస్తుంది. దేవిని ఆఫీసర్ ఇంటికి పంపించాలి ఎట్లాగైనా అంటుంది చిన్మయితో. తనకున్న కష్టాన్ని కూతురికి చెప్పుకుంటూ బాధపడతుంది రాధ. ఆ తర్వాత దేవిని టిఫిన్ చేయమని పిలుస్తుంది రాధ. నాకు ఆకలిగా లేదంటూ మారాం చేస్తుంది దేవి. నువ్ తినకపోతే నేనూ తినని చిన్మయి బలవంతంగా తీసుకెళ్తుంది. ఆ తర్వాత దేవి కోపం తగ్గి మాజాక్ చేస్తుంది తల్లితో. దాంతో అందరూ నవ్వుతారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే..