మాధవ్ నిజస్వరూపం ఏంటో రాధకు తెలిసేలా చేస్తుంది చిన్మయి. అది చూసి షాకవుతుంది రాధ. మరోవైపు దేవుడమ్మ రుక్మిణిని కలిసి ఎమోషనల్ అవుతుంది. ఇంటికి రమ్మని అడగ్గా రాలేనని చెప్పి వెళ్లిపోతుంది రుక్కు. సత్య మాత్రం ఆదిత్య మీద కోపం పెంచుకుంటుంది. ఈ రోజు ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
నేను ఆ ఇంటికి పోతే నా చెల్లి బతుకు ఆగమైతదని బాధపడుతుంది రుక్మిణి. బ్యాగ్ సర్దుకొని ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది. నా గురించి ఆలోచించకుండా బిడ్డని మంచిగా చూసుకోండని జాగ్రత్తలు చెప్తుంది రామ్మూర్తికి. నీకు ఈ జన్మకు తీర్చుకోలేనంత రుణపడిపోయాం.. నువ్ ఆఫీసర్ బాబు సంతోషంగా ఉండాలమ్మా అంటూ ఎమోషనల్ అవుతాడు రామ్మూర్తి. నన్ను నా బిడ్డని సాకిన మీరు చల్లగా ఉండాలి. మీ దీవెన నాకు కావాలంటూ రామ్మూర్తికి దండం పెడుతుంది రుక్ము. నాకు మస్తు ఖుషిగా ఉంది బిడ్డా అంటుంది భాగ్యమ్మ.
సీన్ కట్ చేస్తే.. దేవుడమ్మ సీరియస్‌గా ఉంటుంది. ఏమైందమ్మా అలా ఉన్నావని ఆదిత్య అడగ్గా.. కొడుకు చెంపపగలగొడుతుంది దేవుడమ్మ. అందరూ వచ్చి ఏమైందని అడగ్గా.. ఎవరు మాట్లాడకండి నేను వీడే మాట్లాడుకోవాలి. నిన్న గుళ్లో దీపాలు ఎవరితో కలిసి వెలిగించావ్ అని నిలదీస్తుంది ఆదిత్యని. రుక్మిణిని నువ్ కలవడమే కాదు నేనూ కలిశాను అంటుంది. దాంతో అందరూ ఎక్కడుందంటూ సంబరపడిపోతారు. నీకెలా తెలిసింది దేవుడమ్మ అని రామ్మూర్తి అడగ్గా.. తను చేసిందంతా చెప్పేస్తుంది దేవుడమ్మ. మాకెందుకు నిజం చెప్పలేదని రామ్మూర్తి కూడా కొడుకుని నిలదీస్తాడు. అంతలోనే భాగ్యమ్మ గదిలో సత్య చెంప పగలగొడుతుంది. ఇపుడు ఆదిత్య నా భర్త.. తను మాధవ్‌తో కలిసి దీపాలు వెలిగించుకోవచ్చు కదా అంటుంది. మాధవ్ రుక్కు భర్త కాదని సత్యకు భాగ్యమ్మకు చెప్తుండగా.. ఆదిత్య కూడా అందరికీ రుక్మిణి గురించి చెప్తాడు. రుక్మిణి నా భార్య.. మాధవ్ ఇంటికి తనతో ఎలాంటి సంబంధం లేదంటాడు.
నువ్ చెప్పింది నిజమా అమ్మా అని ఆశ్యర్యపోతుంది సత్య. ఆ మాధవ్ గాడు తన స్వార్థం కోసం ఏం చెప్పినా నమ్ముతావా అని కోప్పడుతుంది. ఇంకా అక్క అక్కడే ఎందుకుంది అని అడగ్గా.. నీకోసమే అంటుంది భాగ్యమ్మ. నా చెల్లి బతుకు బాగుండాలని ఆ మాధవ్ గాడు ఎంత ఇబ్బంది పెట్టినా అక్కడే ఉంటుంది. రుక్మిణి మంచితనం గురించి చెప్తూ ఎమోషనల్ అవుతుంది భాగ్యమ్య. మనసులో ఇంత బాధపెట్టుకుని నవు్ ఎంత నరకం అనుభవించావ్ అంటూ బాధపడుతుంది దేవుడమ్మ. నా కళ్ల ముందే నా కూతురు తిరుగుతున్నా నేనే మీ నాన్నని చెప్పలేకపోయానమ్మా.. ఓ తండ్రికి ఇంతకంటే నరకం ఏముందమ్మా అంటూ కన్నీరు పెడతాడు ఆదిత్య. నా మనవరాలు ఎక్కడుందిరా అని అడుగుతుండగానే.. ఆఫీసర్ సారూ అంటూ వస్తుంది దేవి. నా మనవరాలు ఇలానే ఉంటుందా అని అడగ్గా.. దేవే నా కూతురమ్మ అంటాడు ఆదిత్య. ఈ ఇంటి వారసురాలు ఇదేనా అంటూ ఎమోషనల్ అవుతుంది దేవుడమ్మ. దేవిని దగ్గరికి తీసుకుని ముద్దాడుతుంది. నువ్ నా రక్త సంబంధమని తెలుసుకోలేకపోయాను కదే అంటూ ఏడుస్తుంది. నేను మీ నాయనమ్మనని చెప్తుంది. దాంతో అందరూ సంబరపడిపోతారు.
మీ ఆఫీసర్ సారూ ఎవరో కాదమ్మా.. నిన్ను కన్న తండ్రి మీ నాన్న అని దేవికి చెప్తుంది. మా నాన్నని చూపించండి సారూ అని అడిగావ్ కదమ్మా.. నేనే మీ నాన్నని అంటూ కూతుర్ని కౌగిలించుకుంటాడు ఆదిత్య. ఇదంతా నాకు తెలుసని దేవి జరిగిందంతా చెప్తుంది. కూతుర్ని చూసుకుని మురిసిపోతాడు ఆదిత్య. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్‌లో చూద్దాం..