పరాయి వాళ్ల భార్య మీద ఆశపడడం తప్పు నాన్నా.. నువ్ మా నాన్న అని చెప్పుకోవాలంటేనే సిగ్గుగా ఉందని తండ్రిని అసహ్యించుకుంటుంది చిన్మయి. ఆ తర్వాత గుడిలో ఓ వ్యక్తి దేవుడమ్మకు రుక్మిణి కనిపించిందని చెప్తాడు. దాంతో షాకవుతుంది తను. ఆ తర్వాత ఏం జరుగుతుందో ఈ రోజు ఎపిసోడ్‌లో చూద్దాం..
అమ్మా ఇలా రా అంటూ రాధని మాధవ్ గదికి తీసుకెళ్తుంది చిన్మయి. అల్మారిలో పెట్టుకున్న శుభలేఖ, ఫొటో, తాళిబొట్టుని చూపిస్తుంది తల్లికి. అవి చూసి రాధ షాక్ అవుతుంది. మా నాన్న తప్పు చేస్తున్నాడని బాధపడుతుంది చిన్మయి. ఇక నువ్ ఇక్కడ ఉండదమ్మా.. చెల్లిని తీసుకుని వెళ్లిపో అంటుంది. రాధ కూడా ఇక ఇక్కడ ఉండకూడదనుకుంటుంది మనసులో. భాగ్యమ్మ వచ్చి కూడా అదే విషయం మాట్లాడుతుండగా రాధకు ఫోన్ వస్తుంది. ఏంది మీరు చెప్పేది నిజమేనా? ఇపుడే వస్తున్నా అంటూ కంగారుగా వెళ్తుంది. దారిలో వెతుకుతూ ఆక్సిడెంట్ అయిందన్నారు ఇక్కడేం లేదేంటి అని చుట్టుపక్కలా వెతుకుతుంది. రుక్మిణి.. అంటూ దేవుడమ్మ వస్తుంది. అత్తని చూసి షాకవుతుంది రుక్కు. ఎందుకిలా చేస్తున్నావ్.. మాకెందుకు దూరమయ్యావ్.. చెప్పు అంటూ నిలదీస్తుంది కోడల్ని. నీ చావును నమ్మలేక బతికే ఉంటావన్న ఆశతో గుళ్లు గోపురాలు తిరిగిన. నీకేం ద్రోహం చేశాను. నిన్ను నా ప్రాణంగా చూసుకున్నానంటూ ఎమోషనల్ అవుతుంది దేవుడమ్మ. పరాయిదానిలా బతికింది చాలు.. ఇంటికి వెళ్లి మాట్లాడుకుందాం పద అంటూ తీసుకెళ్తుంది. సత్యతో నేను మాట్లాడతానన్న నేను రానంటుంది రుక్కు.
ఈ మాట అంటారనే ఇన్నాళ్లు మీకు కనపడలేదు అంటుంది రుక్కు. నువ్వేమి సత్య గురించి ఆలోచించకు. ఆదిత్య నీ భర్త. మేము నిన్ను వద్దనుకోవడం లేదంటూ బతిలాడుతుంది. ఇంట్లోనుంచి బయటికి వచ్చేటపుడు గర్భవతిగా వచ్చావ్ కదా.. ఆ బిడ్డని ఇప్పటి వరకు నా దగ్గర దాచావ్.. ఎవరది అనగా నాకు ఆడబిడ్డ పుట్టిందంటుంది రుక్కు. ఏం పేరు పెట్టావ్ నా వారసురాలికి అని అడుగుతుంది. బిడ్డని మీ ఇంటికే పంపిస్తా మీరు పరేషాన్ కాకండి అంటుంది రుక్కు. నువ్ రాను అంటే వదిలేసి పోతాననుకున్నావా అని అడగ్గా.. రానని తెగేసి చెప్తుంది రుక్మిణి. మర్యాదగా చెప్తే వినవా? అని బలవంతం చేస్తుంది. నన్ను తీసుకెళ్తే నేను చచ్చినంత ఒట్టు అంటుంది. నేను మీ ఇంటిని కోడల్ని కాదు. నన్ను మన్నించండని అత్తని వేడుకుని వెళ్లిపోతుంది రుక్మిణి. తప్పించుకోవడానికి నాకు వేరే దారి లేదంటూ బాధపడుతుంది రుక్కు.
సీన్ కట్ చేస్తే.. ఆదిత్య మాటల్ని గుర్తు చేసుకుంటూ బాధపడుతుంది సత్య. రాజమ్మ వెళ్లి ఏమైంది సత్య అని అడుగుతుంది. మా ఆదిత్య తప్పు చేయడమేంటని అనుకుంటే బాధ అనేది నీ దగ్గరకు రాదంటుంది రాజమ్మ. ఆదిత్య అక్కతో తిరుగుతున్నాడని తెలియక మీరిలా అనుకుంటున్నారని ఫీలవుతుంది. అంతలోనే ఆఫీసులో ఆదిత్య మర్చిపోయిన సూట్‌కేసును ఓవ్యక్తి తీసుకొచ్చి సత్యకు ఇస్తాడు. అందులో రుక్కు ఫొటో చూసి సత్యకు కోపం వస్తుంది. ఈ రోజు ఆదిత్య సంగతేంటో తేల్చుకుంటానంటూ వెళ్తుంది.
ఆ తర్వాత కేరళకు వెళ్లే ఏర్పాట్లన్నీ చేశానంటాడు రామ్మూర్తి భార్యతో. మనసులో కొడుకు గురించి ఆలోచిస్తూ భయపడుతుంది జానకి. ఇంట్లో మనం లేకపోతే వాడు రాధని బతకనిస్తాడా? అనుకుంటూ కంగారు పడుతుంది. అత్త మాటల్ని తలుచుకుంటూ కుమిలి కుమిలి ఏడుస్తుంది రుక్మిణి. నేనిక్కడ ఉన్నానని తెలిస్తే నన్ను ఇంటికి తీసుకెళ్లకుండా ఊకుంటదా.. ఇంటికి పోయి అందిరికి చెప్తే నేను ఏం చేయాలి. నా చెల్లి బతుకేం కావాలని బాధపడుతుంది. మరి రుక్కు నిర్ణయం ఏంటో తెలియాలంటే తరువాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే..