కరాటే నేర్చుకుని తన తండ్రిని కొట్టాలనుకుంటున్నట్లు భాగ్యమ్మకి చెబుతుంది దేవి. దానికి భాగ్యమ్మ.. అలా మాట్లాడకూడదు బిడ్డా అని దేవికి హితబోధ చేస్తుంది. మరోవైపు దేవుడమ్మనెమో ఎలాగైనా రుక్మిణిని వెతికిపట్టుకోవాలని గట్టిగా ఫిక్స్ అవుతుంది. ఇంకో వైపు ఆదిత్య చేసే పనులకు సత్య బాధపడుతూ తన అమెరికా ఆలోచనను విరమించుకుంటుంది. దేవి మాత్రం తోచినప్పుడల్లా రాధని తన తండ్రి గురించి అడుగుతూ ఇబ్బందిఇ పెడుతుంటుంది. ఆ తర్వాత ఆగస్టు 5 ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
‘దేవమ్మా.. మీ నాయనా విషయం విడిచిపెట్టూ.. నువ్వు కరాటే నేర్చుకుంటున్నావు కదా.. నాకు నేర్పించూ’ అంటూ దేవిని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది భాగ్యమ్మ. అయినా పంతం విడవదు దేవి. తండ్రి గురించి గుచ్చి గుచ్చి అడుగుతూ వరుస ప్రశ్నలు వేస్తూనే ఉంటుంది. మీ అమ్మా ఏదో పరేషాన్ ఉందమ్మ అని భాగ్యమ్మ చెప్పిన వినదు. అమ్మ.. ఎప్పుడూ బాధ పడుతూనే ఉంటుంది. కానీ నాయనా గురించి మాత్రం చెప్పదని కోపంగా అని అక్కడి నుంచి వెళ్లిపోతుంది దేవి. అది చూసి మాధవగాడు దేవి మనసును పాడుచేశాడు అనుకుంటూ తమలో తామే బాధపడతారు రాధ, భాగ్యమ్మ.
మరోవైపు ఆదిత్య చాలా ఏకాగ్రతగా ఆఫిసు వర్క్ చేసుకుంటూ ఉంటాడు. అది చూసిన సత్యకి కోపం వస్తుంది. అందుకే ఆదిత్య దగ్గరకి వచ్చి.. ‘ఆఫీసు వర్క్ అక్కడ చేసుకోమని చెప్పా. కానీ ఇంట్లో చేయమని చెప్పలేదు కదా. ఒకసారి ఇంటి గురించి ఆలోచించూ. ఉదయమే లేస్తూ నాతో సరదాగా మాట్లాడి.. మీ అమ్మనాన్నకి సంతోషంగా ఆఫీసుకి వెళ్లోస్తానని చెప్పి ఎన్ని రోజులవుతోంది గుర్తు తెచ్చుకో. ఆంటీ వాళ్ల బాధ చూడలేక అమెరికాలో పిల్లలు పుట్టేందుకు ట్రీట్మెంట్ తీసుకోవాలని అనుకున్నా. కానీ ఏదో కారణం చెప్పి వారం తర్వాత వెళదాం అన్నావు. మళ్లీ దాని గురించి ఊసు లేదు. ఏర్పాట్లు చేయట్లేదు’ అని క్లాస్ పీకుతుంది సత్య. దాంతో ఆదిత్య బాధపడిపోతూ.. సత్యకు ఏదో సర్ది చెప్పే ప్రయత్నం చేస్తాడు. అయినా వినకుండా కోపంగా వెళ్లిపోతుంది సత్య.
మరోవైపు దేవి స్కెచ్ తీసుకుని తన ఫొటోకి మీసాలు పెడుతుంటుంది. అప్పుడే అక్కడికి వస్తాడు ఆదిత్య. అది చూసి.. ఏంటమ్మా నీ ఫొటోకి నువ్వే మీసాలు పెడుతున్నావేంటి అని అడుగుతాడు. దానికి.. ‘నేను అచ్చం మా నాయనా లాగుంటానని మా అమ్మ చెప్పింది. మీకు మా నాయనా ఎలా ఉంటాడో తెలియక వెతకడానికి ఇబ్బంది పడుతున్నారు కదా. అందుకే నాకు మీసాలు పెడితే మా నాయనాలాగా కనిపిస్తా. అప్పుడూ మా నాయన్ని వెతకడం ఈజీ అవుతుంది. మీరు తొందరగా మా నాన్నని వెతికిస్తే.. మా అమ్మని బాధపెట్టినందుకు బుద్ది చెప్పాలి’ అని దేవి అంటుంది. దాంతో చాలా బాధపడతాడు ఆదిత్య.
మరునాడు ఉదయాన్నే నిద్ర లేచిన రాధకు బాగా ఒల్లు నొప్పులుగా ఉంటాయి. మంచం దిగడానికి ప్రయత్నించిన లేవలేకపోతుంది. అప్పుడే చిన్మయి కాఫీతో పాటు టాబ్లెట్స్ పట్టుకొని వస్తుంది. నీకు జ్వరంగా ఉందని తెలిసి నేను కాఫీ చెసుకొని వచ్చాను. ముందు ఇది తాగి టాబ్లెట్స్ వేసుకోమని చెబుతుంది చిన్మయి. అది చూసి నువ్వు ఇలాంటి పనులు చేయకూడదు బిడ్డా. మంచి తల్లి కావాలంటే ముందు నువ్వు బాగా చదువుకోవాలి. అప్పుడే నాలాగా ఇబ్బంది పడవు అని చెబుతుంది. అంతే.. కాఫీ తాగి టాబ్లెట్లు వేసుకుంటుంది.
మరోవైపు.. దేవుడమ్మ తన భర్త తలకు రంగు వేస్తూ ఉంటుంది. అప్పుడే వారి వయస్సు గురించి మాట్లాడుకుంటూ సరదాగా ఉంటారు. అప్పుడే అక్కడికి వచ్చిన సత్య అది చూసి చాలా ముచ్చటపడుతుంది. వెంటనే ఊహల్లోకి వెళ్లిపోతుంది. ‘నేను ఆదిత్య ముసలివాళ్ల అయితే ఇలానే ఉంటాం..’ అనుకుంటూ మురిసిపోతుంది. ఊహల్లో ఆదిత్య తలకు రంగేస్తుంది సత్య. అది తలుచుకుని నవ్వుకుంటూ.. వాస్తవానికి వస్తుంది. అప్పుడు మనసులో.. ‘ఆ వయసులో అలాగే ఉంటాం. కానీ ఆదిత్య ఇప్పుడు ఉన్నట్లే అప్పుడూ ఉంటే.. ఇంత ప్రేమ ఎక్కడ నుంచి వస్తుంది? నిజంగానే నాతో అంత ప్రేమగా ఉంటాడా?’ అని మనసులోనే బాధపడిపోతుంది సత్య.
ఆరోగ్యం బాగాలేకపోయిన వంటింట్లోకి వచ్చి పని చేస్తుంటుంది రాధ. అది చూసి నేను చేసేదాన్ని కదా బిడ్డా అంటూ రాధమ్మ బాధపడుతుంది. తర్వాత చిన్మయి పొద్దున్నే తనని లేపి టాబ్లెట్స్ ఇచ్చిన విషయాన్ని చెప్పి ముచ్చటపడుతుంది. అది చూసి భాగ్యమ్మకి కోపం వస్తుంది. ‘చిన్మయి మీద అంతప్రేమ పెంచుకోవడం మంచిది కాదు. మాధవగాడేమో నిన్ను పోనీయ్యా కుండా కంచెస్తాడు. వాడి కూతురేమో కాళ్లకు బంధాలు వేస్తుంది. ఇలాగైతే నువ్వు ఇల్లు దాటలేవు. అందుకే చిన్మయిని వదిలేసి నీ బిడ్డాని మంచిగా చూసుకో చాలు’ అంటుంది భాగ్యమ్మ. అలా మాధవ మీద కోపంతో చిన్మయిని కూడా తిడుతుంది. దాంతో రాధకు కోపం వస్తుంది. ‘వాడిలానే నేను ఆలోచిస్తే నాకు వాడికీ తేడా ఏంటమ్మా. నాకు ఇద్దరు బిడ్డలు అంతే.. నా బిడ్డని నా పెనిమిటి దగ్గరకి చేర్చే ఉపాయం ఉంటే చెప్పు.. ఇలాంటివి కాదు’ అని అరిచి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
ఆ తర్వాత సీన్‌లో.. కొందరు వ్యక్తులు హోటల్లో ఎవరినో వెతుకుతూ ఉంటారు. అందులో ఒకడు అదుగో వస్తాడు చూడు అంటాడు. అప్పటి వరకూ చేతి కర్ర సాయంతో నడిచిన మాధవ్ ఎటువంటి సపోర్టు లేకుండా ప్యాంటు జేబులో చేతులు పెట్టుకొని స్టైలిష్‌గా నడుస్తూ వస్తుంటాడు. దాంతో కథ మరో మలుపు తీసుకోడానికి సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ఇంతకుముందు లాగే ఆదిత్యని, రాధని ఎన్ని ఇబ్బందులకి గురిచేస్తాడో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే..