మాధవ్ చేసిన పని తెలిసి రాధ కోపంతో ఊగిపోతుంది. అతడి చెంప పగలగొట్టాలని చేయి ఎత్తుతుంది. దాంతో మాధవకి మతి పోయినంత పనవుతుంది. మరోవైపు దేవుడమ్మ.. ఆదిత్య, సత్యలను అమెరికా పంపించాలనుకుంటుంది. ఆ తర్వాత్ ఆగస్టు 30 ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
ఆదిత్య ఎవరినో వెతకడానికి బయలుదేరుతాడు. అంతలోనే ‘హలో ఆఫీసర్. ఎవరి కోసమో వెతుకుతున్నట్టున్నారు. నేను అంత అమాయకుడినా చెప్పు.. వాడు కనిపిస్తే నాలుగు తన్ని నిజం చెప్పిస్తారని నాకు తెలుసు’ అంటూ పొగరుగా మాట్లాడుతాడు మాధవ్. దాంతో కోపంగా మాధవ్ కాలర్ పట్టుకుని.. వాడు ఎవడు? ఎక్కడున్నాడో మర్యాదగా చెప్పమని నిలదీస్తాడు ఆదిత్య. నువ్ ఏం చేసినా, నా ప్రాణం పోయిన నిజం చెప్పనని అంటాడు మాధవ. నీ ప్రాణం పోతే అసలు సమస్యే ఉండదు కదా అంటూ కళ్లెర్రజేస్తాడు ఆదిత్య. నేను ఏం చేయనని భ్రమపడకు.. నా భార్య చెప్పిన మాటలు విని నిన్ను ఏం చేయకుండా వదిలేస్తున్నా.. ఇక నుంచి నేనంటే ఏంటో చూపిస్తా.. నా నుంచి దూరం చేసినందుకు నా బిడ్డే నిన్ను చంపుతుంది అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఆదిత్య.
సీన్ కట్ చేస్తే.. దేవి తాగుబోతు తండ్రిని తలుచుకుంటూ బాధపడుతుంది. జానకి వచ్చి ఏమైందమ్మా.. నిన్ను ఎవరైనా ఏమైనా అన్నారా అంటూ పలురకాలుగా ప్రశ్నిస్తుంది. అయినా దేవి నోరు విప్పకుండా.. కోపంగా వెళ్లిపోతుంది. అంతలోనే అక్కడికి వచ్చిన రాధని కూడా అడగ్గా.. తనకు కూడా ఏం తెలియదని అంటుంది. ఇంట్లో ఏదో జరుగుతుందని.. మనసులో అనుకుంటుంది జానకి.
మరోవైపు ఆదిత్య.. తాగుబోతు వ్యక్తిని ఎలాగైనా వెతికి పట్టుకోమని ఎవరినో ఆదేశిస్తాడు. అక్కడ రాధేమో.. దేవి గురించి ఆలోచిస్తూ పరేషాన్ అవుతుంది. అంతలోనే అక్కడికి వచ్చి ‘ఏంటి రాధా. ఏం చేయాలా అని ఆలోచిస్తున్నావా. ఏ దారిలో వెళ్లాలని ఆలోచిస్తున్నావా. అన్ని దారులు మూసేసిన’ అంటూ గర్వంగా చెబుతాడు. నా పెనిమిటి ఉండగా నువ్ ఏం చేయలేవని రాధ సవాల్ విసురుతుంది. అలా ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. ‘నువ్వు ఆశపడినట్టే దేవిని ఆదిత్యకు ఇచ్చేద్దాం. కానీ నువ్ మాత్రం నేను చెప్పినట్టు చిన్మయికి తల్లిగా ఉండు. నాకు భార్యగా ఉండు’ అని మాధవ్ అనగానే ‘సారూ’ అంటూ చేతెత్తి ఆగిపోతుంది. ఓ రేంజ్‌లో మాధవని తిట్టి వెళ్లిపోతుంది.
దేవికి తండ్రిగా నటించిన తాగుబోతు వ్యక్తి దేవి స్కూల్ దగ్గరకు వెళ్తాడు. అతడిని చూసి దేవి దగ్గరకు వెళ్తుంది. ‘తాగుబోతు తండ్రి దగ్గరకు రావాలంటే అసహ్యంగా ఉందా’ అంటూ నటిస్తాడు అతడు. చాక్లెట్ ఇచ్చి దేవి తలని ప్రేమగా నిమురుతాడు. మీ అమ్మను నేను బాధపెట్టాను అంటూ మళ్లీ కథంతా చెప్తూ.. సడన్‌గా దగ్గుతాడు. ఏంది నాయనా అని దేవి అడగ్గా.. జ్వరంగా ఉందమ్మా అంటూ నమ్మిస్తాడు. ‘నేను మారిపోయానని.. మనం ముగ్గురం కలిసే రోజు ఎప్పుడు వస్తుందోనని’ చెప్పి వెళ్లిపోతాడు బాధగా. అంతలోనే ఆదిత్య కూడా కారులో అక్కడికి వస్తాడు. అప్పుడ సీన్ మరింత రసవత్తరంగా మారుతుంది. కొంచెంలో తప్పించుకుని ఆ తాగుబోతు వ్యక్తి ఆదిత్య కంట్లో పడకుండా తప్పించుకుంటాడు.
ఒంటరిగా ఉండి బాధపడుతున్న రాధ దగ్గరకు వెనక నుంచి వెళ్లిన మాధవ్.. ‘నా మీదే చేయి చేసుకోవాలన్న నిన్ను ఎంత దెబ్బ కొడతానో చూడు’ అని మనసులో కసిగా అనుకుంటాడు. రాధకు వినిపించకుండా ఫోన్లో మాట్లాడుతూ ‘రేయ్, నేను చెప్పేది జాగ్రత్తగా విని.. చెప్పింది చెప్పినట్టు చేయ్. నువ్ దేవిని ఇంటికి తీసుకెళ్లు. ఏదో ఒకటి చెప్పి నీ దగ్గరి నుంచి కదలకుండా చేయ్’ అని ఫోన్ కట్ చేస్తాడు. నువ్ నా చెంప మీద కొట్టినందుకు ప్రతిఫలంగా నీ బిడ్డని నీకు కాకుండా చేస్తా. నా బిడ్డ ఎక్కడా అంటూ ఆదిత్య, నువ్ వచ్చి నా కాళ్ల మీద పడి ఏడ్చేలా చేస్తా.. చూస్తూ ఉండు రాధ అంటూ మనసులో ఛాలెంజ్ చేసుకుంటాడు మాధవ. మరి మాధవ్ మళ్లీ ఏ రకంగా ఆదిత్య, రాధలను ఏడిపిస్తాడో తెలియాలంటే తరువాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే..