మెట్ల మీది నుంచి పడడం వల్ల జానకి నరాలు దెబ్బతిని పక్షవాతం వస్తుంది. డాక్టర్ విషయం చెప్పడంతో అందరూ ఒక్కసారిగా షాకవుతారు. మాధవ మాత్రం తల్లి కోసం ఎలాంటి బెంగ పెట్టుకోకుండా హ్యాపీగా ఫీలవుతాడు. మరోవైపు సత్య ఆదిత్యని ఎలగైనా అమెరికా తీసుకెళ్లాలని ఫిక్స్ అవుతుంది. అలాగే రాధ మీద కూడా చెడు అభిప్రాయం పెంచుకుంటుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 27 ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
తమతో ముద్దు ముద్దుగా మాట్లాడే నానమ్మ ఇక మాట్లాడదని పిల్లలిద్దరూ కన్నీరు మున్నీరుగా విలపిస్తారు. ఆదిత్య ఏం కాదమ్మా అంటూ ధైర్యం చెబుతాడు పిల్లలకు. అంతలోనే డాక్టర్ నేను ఇచ్చిన మందులు క్రమం తప్పకుండా వాడితే క్యూర్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పగా.. ఆదిత్య ఎన్ని మందులైనా సరే.. బెటర్ ట్రీట్ మెంట్ ఇప్పించినా పర్లేదు.. త్వరగా కోలుకోవాలి అని అడుగుతాడు. ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారని దేవుడమ్మ అడగ్గా ఈ రోజే తీసుకెళ్లమని చెబుతాడు డాక్టర్. అపుడే బయట నుంచి చాటుగా చూస్తున్న రాధని పిలిచి పేషెంట్ మీకెదో చెప్పాలని ట్రై చేస్తున్నారు.. మీరు రండి అంటూ తీసుకెళ్తుంది. రాధ లోపలికి వెళ్తుంది కానీ దేవుడమ్మ ఎక్కడ తనని చూస్తుందోనని కంగారు పడుతూ వెళ్లిపోయి మళ్లీ చాటుగా ఉంటుంది. అంతలోనే అక్కడికి వచ్చిన దేవుడమ్మ.. ‘మాధవ్ వచ్చి ఇంతసేపైనా నీ భార్య కనిపించట్లేదేంటి’ అని ప్రశ్నిస్తుంది. మాధవ్ ఏం మాట్లాడకుండా ఆలోచిస్తుండగా.. మళ్లీ అడిగి నేను వెళ్లి చూసి వస్తానని అంటుంది. చిన్మయి కవర్ చేస్తూ అమ్మ లంచ్ తీసుకురావడానికి ఇంటికెళ్లిందని చెప్తుంది. మాధవ్‌కు జాగ్రత్తలు చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది దేవుడమ్మ. తల్లి దగ్గరికి వెళ్లిన మాధవ్ ‘నీ కోడలు నాకంటే నిన్ను జాగ్రత్తగా చూసుకుంటుంది’ అమ్మ అంటూ జానకితో చెప్తాడు.
సీన్ కట్ చేస్తే.. సత్య చీకటిలో కూర్చుని ఆలోచిస్తుంది. అంతలోనే ఆదిత్య, దేవుడమ్మలు వస్తారు. ఏంటి సత్య.. ఇంత చీకట్లో కూర్చున్నావ్ అని అడగ్గా.. ‘మీరు ఇంత త్వరగా వస్తారనుకోలేదు. ఓ ఆంటి తోడుగా ఉందని ఇంత త్వరగా వచ్చావా’ అంటుంది వెటకారంగా. ఏంటి సత్య అలా అంటున్నావ్ అని దేవుడమ్మ ప్రశ్నించగా.. ఈ మధ్య ఆదిత్య రోజూ ఆలస్యంగా వస్తున్నాడు కదా. ఈ రోజు త్వరగా వచ్చాడు కదా అని కవర్ చేసుకుంటుంది సత్య. వెంటనే జానకమ్మకు ఎలా ఉంది ఆంటీ అని అడుగుతుంది. ‘పాపం ఆవిడకు ఈ వయసులో రాకూడని కష్టం వచ్చింది’ అంటూ బాదపడుతుంది దేవుడమ్మ. మెట్ల మీది నుంచి కిందపడడం వల్ల తలకు బలమైన గాయమై పక్షవాతం వచ్చిందని చెబుతుతంది. అది విని సత్య కూడా ఆలోచిస్తూ బాధపడుతుంది. రామ్మూర్తి పడిన బాధను కోడలికి చెప్తూ దేవుడమ్మ కూడా మదనపడుతుంది.
ఆ తర్వాత ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్లిన జానకి వీల్ చైర్‌లో కూర్చుని జరిగింది తలుచుకుంటూ బాధపడుతుంది. మాధవేమో గిటారు వాయిస్తాడు. ఆ శబ్దం విని జానకి కంగారు పడుతుంది. అంతలోనే రాధ వచ్చి ‘ఏమైంది ఎందుకు అలా భయపడుతున్నారు అంటూ ఓదారుస్తుంది జానకిని. నువ్ ఇంట్లో నుంచి వెళ్లిపో అంటూ జానకి రాధకి సైగ చేస్తుంది కానీ ఇప్పుడు మిమ్మల్ని విడిచిపెట్టి ఎట్ల పోతా. మీ బిడ్డకి భయపడి మిమ్మల్ని వదిలిపోలేను. ఈ పొద్దు మీకు నిజం ఏంటో తెలిసింది. మీ బిడ్డ సంగతి నేను చూసుకుంటా. ఇన్ని రోజులు మీ రుణం ఎట్ల తీర్చుకోవాలని ఆలోచించిన. ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది. మీ ప్రేమ ఎప్పుడూ ఇలాగే ఉండాలి’ అంటూ జానకికి అన్నం పెడుతుంది. ఆ తర్వాత పిల్లలకు కూడా తినిపిస్తుంది. అపుడే చిన్మయి దేవితో ‘నువ్ ఆఫీసర్ అంకుల్ వాళ్లతో మాట్లాడకపోతే వాళ్లు ఎంత బాధపడతారో చెప్పు. నువ్ ఇలాగే ఉన్నావంటే నా మీద ఒట్టే’ అంటుంది. అది పక్క నుంచి చాటుగా వింటాడు మాధవ్. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే..