మాధవ గురించి నిజం తెలుసుకున్న జానకి… రాధని ఇంట్లో నుంచి వెళ్లిపోమని చెబుతుంది. ఆఫీసర్ సారూ రాధ భర్తని కూడా తెలిసిపోతుంది. మాధవకు నిద్రమాత్రలు ఇచ్చి రాధ వెళ్లేందుకు సహాయ పడాలనుకుంటుంది జానకి. కానీ అంతా దానికి విరుద్ధంగా జరుగుతుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 24 ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం…
జానకి తన గురించి నిజం చెప్పేస్తుందేమోనని భయంతో మెట్లమీది నుంచి తోసేస్తాడు మాధవ్. మళ్లీ ఏమీ తెలియనట్లే అమ్మా.. అని ఏడుస్తూ అందర్నీ నమ్మిస్తాడు. తన కళ్లముందే మెట్ల మీది నుంచి జారి పడిపోయిందని చెప్తాడు. ఇంట్లో వాళ్లందరూ ఏడుస్తూ జానకిని ఆస్పత్రికి తీసుకెళ్తారు. అక్కడ డాక్టర్ రావడం ఆలస్యమైతుంది కాస్త. అప్పుడు కూడా మాధవ్ రాధ గురించే ఆలోచిస్తాడు. ఎవరు అడ్డుపడినా ఇదే జరుగుతుందని అనుకుంటాడు మనసులో. ఆ రాత్రే రుక్మిణి ఆదిత్యకు ఫోన్ చేస్తుంది. ఆదిత్య వెంటనే ఆస్పత్రికి బయలుదేరి వెళ్తాడు. సత్య భర్తని చూసి ఏం చేస్తున్నాడో అర్థం కాక బాధపడుతుంది.
మరోవైపు ఆస్పత్రి నుంచి జానకి ఆరోగ్యంగా తిరిగిరావాలని దేవి, చిన్మయి, భాగ్యమ్మలు దేవుడిని వేడుకుంటారు. పిల్లల్ని పరేషాన్ కావద్దని ఓదారుస్తుంది భాగ్యమ్మ. డాక్టర్లు జానకికి చికిత్స మొదలుపెడతారు. అందరూ కంగారుగా ఉంటారు మాధవ్ తప్ప. అప్పుడే ఆదిత్య వస్తాడు హాస్పిటల్‌కి. రామ్మూర్తి ఏడుస్తూ ఆదిత్యకి విషయం చెబుతాడు. కండిషన్ తెలుసుకొని స్పెషలిస్ట్‌లని పిలిపిద్దామని ధైర్యం చెబుతాడు ఆదిత్య. డాక్టర్ వచ్చి ఆఫీసర్‌తో జానకి ఎలా ఉందో తెలియజేస్తారు. కానీ మాధవ మాత్రం అక్కడ కూడా ఆదిత్యతో యుద్ధానికి దిగుతాడు. ఇక్కడ మీ అవసరం లేదని, వెళ్లిపోమని చెబుతాడు. రామ్మూర్తి కొడుకు ప్రవర్తనని తప్పు పడతాడు. ఈ పరిస్థితుల్లో కూడా ఆఫీసర్‌తో ప్రవర్తించేది అలాగేనా అని కొడుకును చెడామడా వాయిస్తాడు మాదవ్.
సీన్ కట్ చేస్తే.. అర్జెంటుగా బెడ్ మీది నుంచి వెళ్లిన ఆదిత్య గురించి ఆలోచిస్తూ బాధపడుతుంది సత్య. ‘నేను అనుకున్నట్లు గానే ఆదిత్య అక్కని కలుస్తున్నాడు. నా ముందు అక్కతో మాట్లడడం లేదు. ఇద్దరి మధ్య ప్రేమ తగ్గలేదు. అక్క మీది ప్రేమ దేవి మీద చూపిస్తున్నాడు. అందుకే ఆదిత్య నన్ను దూరం పెడుతున్నాడా? అక్క మరొకరి భార్య. ఆదిత్య నా భర్త. మరొకరి కోసం నేను ఎందుకు బాధపడాలి. అయినా అక్క నా సొంత అక్క కాదు కదా.. ఏం చేయాలో అది చేస్తా’ అనుకుంటుంది మనసులో.
ఆ తర్వాత జానకి స్పృహలోకి వస్తుంది. జరిగింది గుర్తుకువచ్చి రాధా.. రాధా అని కలవరిస్తుంది. నర్సు వచ్చి చెప్పగా రాధ లోపలకి వెళ్తుంది. మాధవలో టెన్షన్ మొదలవుతుంది. జానకి జరిగిందంతా చెప్పే ప్రయత్నం చేస్తుంది కానీ.. మాధవ్ కోపంగా చూసేవరకు మళ్లీ స్పృహ కోల్పోతుంది. దాంతో హ్యాపీగా ఫీలవుతాడు మాధవ్. అక్కడ సత్య, దేవుడమ్మలు ఆదిత్య కోసం ఎదురు చూస్తారు. అంతలోనే అక్కడకి వచ్చిన ఆదిత్యని అడగ్గా.. అసలు విషయం చెప్తే ఏం జరుగుతుందో ఊహించి మినిస్టర్ మీటింగ్ అని అబద్ధం చెప్తాడు. దాంతో సత్య అనుమానం మరింత బలపడుతుంది. దేవి ఫోన్ చేసి దేవుడమ్మతో విషయం చెప్తుంది. మరి రుక్కు.. దేవుడమ్మ కంటపడుతుందా? తెలియాలంటే తరువాతి ఎపిసోడ్ వరుకు ఆగాల్సిందే..