కమల కూతురి బారసాల ఏర్పాట్లు పూర్తయ్యి ఉంటాయి. అందరూ చాలా ఆనందంగా ఉంటారు. అక్కడి రుక్మిణి కూడా వచ్చి ఎవరికీ కనిపించకుండా చాటుగా నిలుచుని ఉంటుంది. అది చూసి ఆదిత్య షాక్ అవుతాడు. దేవుడమ్మకి కనిపించకుండా అడ్డుగా నిలబతాడు. అనంతరం బాషా వెళ్లి పాప చేవిలో రుక్మిణి అని మూడుసార్లు చెబుతాడు. అనంతరం ఒక్కరి అందరూ వెళ్లి ఆ పాప తల మీద తలంబ్రాలు పోసి ఆశీర్వాదిస్తారు. అనంతరం.. శుభకార్యానికి వచ్చిన వాళ్లలో ఒకామె పాపకి పేరుగా పెట్టిన రుక్మిణి ఎవరు అని అడుగుతుంది. దానికి.. ‘రుక్మిణి అంటే నా కోడలండి.. ఇప్పుడు ఇక్కడ లేదు. ఎక్కడో ఉంది. అందరు నన్ను దేవుడమ్మ అని పిలుస్తూ ఉంటారు. కానీ.. నన్ను అలా మార్చిన నిజమైన దేవుడమ్మ తను’ అని ఎమోషనల్ అవుతుంది. అత్త మాటలు విన్న రాధ సైతం చాలా బాధ పడుతుంది. అనంతరం జానకమ్మని మాధవ గురించి అడుగుతుంది దేవుడమ్మ. కుదరలేదని, వీలైతే వస్తాడని చెబుతుంది జానకమ్మ. ఇంతలో అక్కడికి ఎంట్రీ ఇస్తాడు మాధవ. రాధ అక్కడి నుంచి వెళ్లిపోతుండగా మాధవ ఎదురుపడతాడు.
రాధని చూసిన మాధవలో విలన్ బయటికి వచ్చి.. ‘ఎంటి రాధ.. ఎవరికీ తెలియకుండా బారసాలకి వచ్చి.. అలాగే కనిపించకుండా వెళ్లిపోదామనుకున్నావా. రామ్మూర్తిగారి కోడలికి ఇంత కష్టం అవసరమా’ అని వెటకారంగా అంటాడు. దాంతో రాధ.. ‘అక్కడ అందరూ నేను మీ ఇంటి కోడలిని అని అందరూ అనుకుంటున్నారు. కానీ కాదు కదా.. నాతో జాగ్రత్త. మాటలు మంచిగా రానియ్యి’ అని వార్నింగ్ ఇస్తుంది రాధ. దానికి.. ‘నువ్వు బయటికి రావడమే నాకు కావాలి రాధ. దేవిని పిలిచి మీ నాన్న ఎవరని అడిగితే నన్ను.. మీ అమ్మ ఎవరని అడిగితే నిన్ను చూపిస్తుంది. అప్పుడు అందరి ముఖాలు చూడాలి. ముఖ్యంగా మీ అత్త దేవుడమ్మ గుండెపగిలిపోదు’ అని ఏదేదో మాట్లాడుతుంటాడు.
అప్పుడే ఏదో పని మీద బయటికి వచ్చిన దేవుడమ్మ, మాధవని చూస్తుంది. దగ్గరకి వచ్చి మాధవ బావున్నావా అని పలకరిస్తుంది. అయితే.. అక్కడే ఉన్న రాధ గోడ చాటుగా ఉండడం వల్ల దేవుడమ్మకి కనిపించదు. అనంతరం.. ‘నువ్వు రావు.. మీ ఆవిడ రాదు. ఎందుకు మేము ఎమైనా పరాయివాళ్లమా’ అని అడుగుతుంది దేవుడమ్మ. దానికి.. ‘మీరంటే చాలా అభిమానం ఆంటీ.. రావాలనుకుంటుంది. కానీ రాదు. లేకపోతే ఇలా ముసుగేసుకుని వస్తుంది’ అని రాధని చూపిస్తాడు మాధవ. అప్పుడు ముందువచ్చి చూసి ఈ అమ్మాయి ఎవరనీ అడిగితే రాధ ఫ్రెండని, ఆమెకి మొహమాటం వల్ల బయటే ఉండిపోయిందని కవర్ చేస్తాడు. దాంతో భాగ్యమ్మకి చెప్పి ఆమెకి చీర పెట్టి పంపమని చెబుతుంది. అది చూసి ఆమెని తిప్పి చూస్తే అక్కడ రాధ ఉండడం చూసి షాక్ అవుతుంది భాగ్యమ్మ. దేవుడమ్మని రాధని చూడలేదని తెలిసి రిలాక్స్ అవుతుంది.
అనంతరం ఆదిత్యకి మాధవ ఎదురుపడతాడు. అప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి నువ్వు వస్తావని నాకు తెలుసు. కానీ ఏం చేయలేవు. రుక్మిణిని ఆదరించింది. ఆశ్రయం ఇచ్చింది మీ అమ్మనాన్న నువ్వు కాదు. కాబట్టి నువ్వు ఏం చేయలేవు. త్వరలోనే నా భార్యని, బిడ్డని శాశ్వతంగా ఇంట్లోనే ఉండేలా చేస్తాను’ అని శపథం చేస్తాడు ఆదిత్య. ఆ అవకాశం అస్సలు ఇవ్వనని అనుకుంటాడు మాధవ.
అనంతరం లోపలికి రావడానికి భయపడుతున్న రాధకి.. నీ ఆశీర్వాదం ఇస్తే బావుంటుందని తీసుకొస్తుంది భాగ్యమ్మా. అనంతర కమల, సత్యతో కలిపి రాధతో కలిపి ఆశీర్వాదం ఇప్పిస్తుంది. అది చూసిన కమల ఈమెవ్వరూ అని అడిగితే రాజస్థాన్ నుంచి వచ్చిండ్రు అని కవర్ చేస్తుంది భాగ్యమ్మ. ఇంతో దేవి వచ్చి అందరం కలిసి ఫొటోలు దిగుదామని ఆదిత్యతోపాటు మిగిలిన వారందరినీ అక్కడిని తీసుకెళుతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన మాధవ ‘నువ్వే రుక్మిణివని చెప్పాలని ఉంది.. దేవి ముఖం చూసి ఆగుతున్నా. కంగారు పడకుండా ఇంటికి వచ్చేసేయి’ అంటాడు రాధతో. అనంతరం ఏం జరుతుందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకూ ఆగాల్సిందే.