దేవి వల్ల ఆదిత్య, సత్యల మధ్య గొడవలు పెరుగుతాయి. భార్య మీదికి ఆదిత్య చేయి ఎత్తుతాడు. అంతలోనే దేవుడమ్మ వచ్చి ఇద్దరికి క్లాస్ పీకుతుంది. అక్కడ దేవేమో జరిగిన దానికి బాధపడుతుంది. ఇదే అవకాశంగా భావించిన మాధవ్ ఇంట్లో జరిగిందంతా చెప్పి.. లోలోపల సంబరపడిపోతాడు. ఆ తర్వాత సెప్టెంబర్ 20న ఏం జరిగిందో చూద్దాం..
సత్య మీదికి చేయెత్తడం నాదే తప్పని క్షమాపణలు చెబుతాడు ఆదిత్య. ‘నాకోసం సత్యకు సారీ చెబుతావా. ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకోండి. నాకదే చాలు’ అంటూ బాధగా వెళ్లిపోతుంది దేవుడమ్మ. ‘దేవి మన బిడ్డని తెలియక నువే బాధపెడుతున్నావ్. నిజం తెలిస్తే నువ్ ఇలా చేయవ్’ అని సత్యను ఉద్దేశించి మనసులో అనుకుంటాడు ఆదిత్య. అక్కడ దేవి సత్య మాటలను తలుచుకుంటూ వెక్కి వెక్కి ఏడుస్తుంది. రాధ అసలేం జరిగింది బిడ్డా.. చిన్నమ్మ అట్ల ఎందుకు అన్నది? అని అడుగుతుంది దేవిని. తల్లికి పూసగుచ్చినట్లు అంతా వివరిస్తుంది బిడ్డ. చిన్నమ్మ అన్నది నువ్వేం మనసులో పెట్టుకోకు బిడ్డా అని ఓదార్చుతుంది రాధ. ‘నామీద కోపం ఉన్నదని అర్థమైంది. చిన్నమ్మ అలా అన్న తర్వాత ఇంకెట్ల పోతమ్మ’ అంటూ ఏడుస్తుంది. నువ్ పోకపోతే ఆఫీసర్ సారూ బాధపడతడని.. పలువిధాల దేవికి నచ్చచెప్తుంది రాధ. అయినా దేవి పట్టు విడవదు. నువ్ పొమ్మన్నా నేను పోనని తెగేసి చెప్తుంది. అపుడే చిన్మయి కూడా వచ్చి దేవికి అర్థమయ్యేలా చెప్తుంది. నువ్ అంటే వాళ్లందరికీ చాలా ఇష్టమని చెప్పి ఓదార్చుతుంది. చిన్మయి మాటల్ని విని రాధ సంబరపడిపోతుంది.
సీన్ కట్ చేస్తే.. సత్య రుక్కు చేసిన త్యాగాన్ని తలుచుకుని మదనపడుతుంది. నాకోసం ఇల్లు వదిలిపోయి మళ్లీ ఎందుకు ఈ ఇంటి వైపు అడుగులేస్తుంది. ఇద్దరు పిల్లలకు తల్లి అయింది. ఇప్పటివరకు నిజం నాకు చెప్పలేదు. ఆదిత్య మీద అక్కకు మళ్లీ ప్రేమ పెరిగిందా.. అదే నిజమై ఉంటుంది. దేవిని అడ్డుపెట్టుకుని ఆదిత్యకు అక్క దగ్గరవ్వాలనుకుంటుంది. మా అక్క దేవత అనుకున్నా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏనాడు అక్కని తప్పు పట్టలేదు. ఆదిత్యకు అక్క దగ్గరైపోతే నా పరిస్థితి ఏంటి? అక్క నా గురించి ఆలోచించనపుటు నేనెందుకు ఆలోచించాలి? అని రుక్క మీద చెడు అభిప్రాయం పెంచుకుంటుంది సత్య.
ఆ తర్వాత సీన్‌లో దేవి, సత్యల మధ్య వచ్చిన భేదాబిప్రాయాలకు సంతోష పడిపోతాడు మాధవ. నువ్ వెళ్లమని పంపించిన దేవి వెళ్లదు. ఒకవేళ బలవంతంగా పంపించినా సత్యలోపలికి రానివ్వదు. ఇక నేను ప్రశాంతంగా ఉండొచ్చు. రాధను ఎలాగైనా శ్రీశైలం తీసుకెళ్లాలలని అనుకుంటాడు మాధవ్. ఆ తర్వాత రాధకు ఫోన్ చేస్తాడు ఆదిత్య. కానీ తను ఫోన్ లిఫ్ట్ చేయదు. నేనిపుడు ఫోన్ మాట్లాడితే సత్య నన్ను అపార్థం చేసుకుంటది. దేవమ్మ పుట్టినప్పటి నుంచి ఎవరూ ఒక్క మాట అనలేదు. అలాంటిది నా చెల్లె అలా అంటే నాకు మస్తు బాధ అవుతుందని కుమిలిపోతుంటుంది రాధ.
దిగులుగా ఉన్న దేవి దగ్గరికి వెళ్లి చిన్మయి మాట్లాడిస్తుంది. అమ్మ చెప్పింది వినాలని హితబోధ చేస్తుంది. అమ్మను బాధపెట్టకూడదని, అమ్మలా ఉండాలని అంటుంది. దూరం నుంచి అదంతా వింటుంది రాధ. అంతలోనే దేవుడమ్మ కారు డ్రైవర్ గిఫ్ట్‌లు తీసుకుని వస్తాడు. అక్క మనకేం వద్దు.. తీసుకెళ్లమని అంటుంది దేవి కోపంగా. ప్రేమతో పంపింది నానమ్మ. వద్దనకూడదని చెప్పి గిప్ట్ తీసుకుంటుంది చిన్మయి. అన్నీ తెరిచి చూస్తుంది. ‘ఇప్పుడు చెప్పు. దేవుడమ్మ నానమ్మ ప్రేమ లేకపోతే ఇవన్నీ పంపిస్తుందా’ అంటుంది దేవితో. అంతలోనే రాధకు దేవుడమ్మ ఫోన్ చేసి ‘అమ్మా రాధ. నేను దేవుడమ్మని. దేవికి కోపం వచ్చినట్టే నీకు కూడా వచ్చిందా. అందుకే బహుమతులు పంపించాను. నువ్ కూడా దేవిని పంపించకుండా ఉండకమ్మా. సత్య అలా మాట్లాడేసరికి మా అందరి మీద కోపం వచ్చినట్టుంది. మా సత్య అలా అందని ఏం బాధపడకు. మా సత్య గురించి నీకు తెలుసు కదా. అది మనసులో పెట్టుకోకు. ఇక దేవి అంటావా. అది నా మనవరాలు. ఈ దేవుడమ్మని త్వరగానే క్షమిస్తుంది. మా ఆదిత్యని చూసిందంటే ఆఫీసర్ అంటూ అల్లుకుపోతుంది. నీ తల్లి మనసు కూడా కష్టపెట్టుకోకుండా వీలుంటే ఒకసారి ఇంటికి పంపిచమ్మ’ అని వేడుకుంటుంది. చిన్మయిని అడ్డుపెట్టుకుని శ్రీశైలం తీసుకెళ్లాలనుకుంటున్న మాధవ ప్లాన్ వర్కౌట్ అవుతుందా? లేదా? తెలియాలంటే తరువాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే..