అక్కడ మాధవ, ఇక్కడ ఆదిత్య.. ఇద్దరి ఇళ్లలో వినాయక చవితి పూజా కార్యక్రమాలు ముగుస్తాయి. దేవుడమ్మ కుటుంబమంతా దేవి, చిన్మయితో సంతోషంగా గడుపుతారు. సత్యకు దేవీ పట్ల అనుమానం కలుగుతుంది. మాధవ వక్రబుద్ధిలో ఏమాత్రం మార్పు ఉండదు. నిన్నటి ఎపిసోడ్‌లో రాధ ఇంట్లో ఒంటరిగా ఉంటుంది. రాధను మాధవ్ ఎలా ఇబ్బంది పెడతాడో ఈ రోజు ఎపిసోడ్‌లో తెలుసుకుందాం..
ఒంటరిగా ఇంట్లో వంట చేస్తున్న రాధ దగ్గరికి వస్తాడు మాధవ్. ఏదో ఒకటి చేయాలనుకుని.. మెట్ల మీది నుంచి జారిపడినట్లు నటిస్తాడు. అది చూసి రాధ పరుగెత్తుకొస్తుంది. మాధవ్ చేతికి కర్ర అందించి సాయం చేస్తుంది. కానీ మాధవ్ మాత్రం రాధని వేరే దురుద్దేశంతో చూస్తాడు. తనతో అసభ్యకరంగా ప్రవర్తిస్తాడు. ‘నువ్ ఇలా నాకు తోడుంటే, అండగా నిలబడితే ఈ చేతి కర్రతో పని ఉండదు’ అంటూ తన నిజస్వరూపం బయటపెడతాడు. అది చూసి రాధ షాక్‌కు గురవుతుంది. మాధవ్ ఎలాంటి అవిటితనం లేకుండా నడవడం చూసి రాధ మైండ్ బ్లాక్ అయిపోతుంది. ‘నీ మనసులో నాకు చోటు దక్కాలంటే నాలో ఒక లోపం ఉండాలి కదా. ఆడదాని మనసులో చోటు సంపాదించాలంటే ఏదో జాలి ఉండాలి కదా. అందుకే అవసరం లేకపోయినా ఈ కట్టెను ఇంతకాలం వాడాను. నిన్ను కోరుకున్న నాకు ఏ లోపం లేదు’ అంటూ బాంబ్ పేల్చుతాడు మాధవ్. ‘కన్నోళ్లను, కన్న బిడ్డను ఇంత మోసం చేస్తావా’ అంటూ కళ్లెర్రజేస్తుంది రాధ. అంతలోనే రామ్మూర్తి, జానకిలు ఇంటికి వస్తారు. అది చూసి మళ్లీ చేతికర్ర పట్టుకుని నటించడం మొదలుపెడతాడు మాధవ. దాంతో రాధకి మతిపోయినంత పనవుతుంది.
సీన్ కట్ చేస్తే.. దేవుడమ్మ ఇంట్లో పిల్లలిద్దరూ ఆడుకుంటారు. దేవీ అందర్నీ పిలిచి కలిసి ఆడుకుందాం అంటుంది. అందరూ హుషారుగా వచ్చి ఏం ఆడుకుందాం చెప్పు అంటారు. అంతలోనే చిన్మయి హైడెన్ సీక్ ఆడుకుందాం అనగా దేవీ కూడా ఊ కొడుతుంది. ఇపుడు ఎవరు వచ్చి ఎవర్ని పట్టుకోవాలమ్మా అంటాడు ఆదిత్య. మీరందరూ పోయిండ్రి.. అవ్వ వచ్చి అందర్నీ పట్టుకుంటంది అని చెబుతుంది దేవీ. ఆ తర్వాత గేమ్ స్టార్ట్ అవుతుంది. దేవుడమ్మ కళ్లు మూసుకుని ఉండగా అందరూ పోయి దాక్కుంటారు. ఒక్కొక్కరూ ఒక్కో ప్రదేశంలో దాక్కుంటారు. అయితే చిన్మయి, దేవీలు మాత్రం కబోర్డ్‌లో దాక్కుంటారు. అలా కబోర్డ్‌లో దేవీకి దేవుడమ్మ ఫొటో దొరకగా, చిన్మయికి రాధ ఆదిత్యల పెళ్లి ఫొటో దొరుకుతుంది. అది చూసి ఒక్కసారిగా షాకవుతుంది చిన్మయి. ‘ఇది పెళ్లి ఫొటో కదా. అంటే అమ్మకి ఆఫీసర్ అంకుల్‌కి పెళ్లయ్యిందా.. ’ అని మనసులో అనుకుంటుంది. ఆటలో భాగంగా దేవిని పట్టుకుంటుంది దేవుడమ్మ. తనకు దొరికిన ఫొటోని చూపించి బాగుంది అని చెప్తుంది దేవి. మరోవైపు చిన్మయి మాత్రం రాధ, ఆదిత్యల పెళ్లి ఫొటోను ఎవరి కంటాపడకుండా తీసుకెళ్తుంది.
మరోవైపు మాధవ్ చేసిన మోసాన్ని గుర్తుచేసుకుంటూ కుమిలి కుమిలి ఏడుస్తుంది రాధ. అది గమనించి ఏమైంది బిడ్డా.. అని అడుగుతుంది భాగ్యమ్మ. ‘ఇన్ని దినాలు ఏమో ఏమో సోచాయించినా. ఎవరి గురించో ఇక్కడే ఉండిపోయినా. నేను ఇక ఇక్కడ నిమిషం కూడా ఉండ. వెళ్లిపోవాలి’ అని తల్లితో చెబుతుంది రాధ. గా ముచ్చట ఎప్పటికెళ్లో చెప్తే నువ్ విన్నావా అంటుంది భాగ్మమ్మ. ‘ఇంకా ఈ ఇంట్లో ఉండడం నాకూ నా బిడ్డకు మంచిది కాదు. జల్దీ ఇక్కడి నుంచి పోవాలి’ అంటుంది తల్లితో రాధ. నడువు బిడ్డా పోదాం అని భాగ్యమ్మ అనగా.. దేవమ్మ వచ్చినకా తీసుకుని పోదాం. ముందు పోయి ఉండడానికి ఇల్లు చూసి రావాలి అని రాధ అంటుంది. అప్పుడు ఏం అర్థం కాక ఏమైంది బిడ్డా. ఇల్లు చూసుడు ఏంది అంటుంది భాగ్యమ్మ అయోమయంగా. ‘ఏందీ ఎందుకనేది ఇడిచిపెట్టు. ఇక్కడైతే నేను నా బిడ్డ ఉండడానికి లేదు. ఇల్లు చూడడానికి వస్తావా లేదా’ అంటూ ప్రశ్నిస్తుంది రాధ తల్లిని.
‘ఇంత కాలం ఇది అవసరం లేకపోయినా దీన్ని వాడుకున్నా. దీనివల్ల నాకు ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో నాకు తెలుసు. అందుకే దీని సాయం తీసుకుంటూనే ఉన్నా. ఎవరికీ తెలియని, ఎవ్వరూ చూడని నా అసలు రూపం మొదటిసారిగా చూసింది నువే రాధ. నా కన్న వాళ్లకు కూడా తెలియని ఈ నిజం నీకు తెలియగానే భయపడి ఉంటావ్ కదా. కానీ నీకు తెలిసిన ఈ నిజాన్ని బయటికి చెప్పలేవు. ఎందుకంటే అది అందరికీ అది అబద్ధం కదా. అది ఊరంతా నమ్మిన నిజం. అందరిముందు ఈ నిజం బయట పడాల్సిన పరిస్థితే వస్తే.. నా కాలు విరగొట్టుకోనైనా సరే జనం నమ్మిందే నిజమని నిరూపిస్తా’ అంటూ రాధను ఉద్దేశిస్తూ మనసులో అనుకుంటాడు మాధవ.
మరోవైపు రాధ, భాగ్యమ్మలు అద్దె ఇల్లు కోసం వెతుకుతుంటారు. అక్కడ, ఇక్కడా ఉండుడేంది బిడ్డా.. సీదా అక్కడికే పోదాం పా బిడ్డా అంటుంది భాగ్యమ్మ. ‘ఆడికే పోదామని ముందట అనుకున్నా కానీ అక్కడికి పోతే అత్తమ్మకు తెలవకుండా ఉంటదా. ఇక్కడ ఉంటేనన్న నా బతుకు నేను బతుకుతా..’ అని తన నిర్ణయాన్ని చెబుతుంది రాధ. సరేలే బిడ్డా.. ఇన్ని దినాలకైనా మంచి నిర్ణయం తీసుకున్నావ్. ఆ ఇంట్ల ఆ ఫాల్తు గాని ముందుకాకుండా నువ్ ఎక్కడ ఉన్నా మంచిగానే ఉంటావ్ అంటూ నెల అద్దె కట్టివస్తానని వెళ్తుంది భాగ్యమ్మ. మరి మాధవ్ ఊరుకుంటాడా లేదా తెలియాలంటే తరువాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే..