Desi Ghee: నెయ్యితో లాభాలు అనేకం. మన పూర్వీకుల నుంచి నెయ్యిని వాడుతూ వస్తున్నారు. ముఖ్యంగా మనం తయారు చేసుకున్న నెయ్యితో అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ప్యాకెట్లలో దొరికే వాటికన్నా ఇంటినెయ్యి వాడటం అన్ని రకాలుగా క్షేమదాయకం. చాలా మంది నెయ్యి తింటే లావైపోతామని భయపడుతుంటారు. అలాగే కొవ్వు పెరుగుతుందని అపోహ పడుతుంటారు.
కానీ, దేశీ నెయ్యి వాడితే అలాంటి ప్రమాదాలేవీ ఉండవు. దేశీ నెయ్యి వాడటం వల్ల మన శరీరం ఫిట్ గా తయారవుతుంది. ఇందులో మన శరీరానికి హాని కలిగించే చక్కెర ఉండదు. విటమిన్ కె, ఈ, ఎ పుష్కలంగా దొరుకుతాయి. నెయ్యిలో బ్యూట్రిక్ యాసిడ్ ఉండటం వల్ల మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
క్యాన్సర్ కణాలను నశింపజేసే శక్తి..
దేశీ నెయ్యిని తరచూ మనం ఆహారంలో కలిపి తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ముఖ్యంగా జీర్ణ వ్యవస్థ సెట్ చేసే శక్తి ఈ నెయ్యికి ఉంది. దేశీ నెయ్యితో పేగుల పనితీరు మెరుగుపడుతుంది. కడుపులో అల్సర్, క్యాన్సర్ లాంటి కణాలను తొలగిస్తుంది. చాలా విటమిన్లు ఉండటం వల్ల శరీరానికి అన్ని రకాలా ఉపయోగపడుతుంది.
Desi Ghee:
దేశీ నెయ్యిలో అనేక విటమిన్లు దాగుంటాయి. జట్టు రాలడం అనే సమస్య ఉన్న వారికి నెయ్యి తీసుకుంటే రాలడం తగ్గుతుంది. జుట్టును బలోపేతం చేస్తుంది. చుండ్రు, దురద లాంటి సమస్యలనూ నివారిస్తుంది. దంత సమస్యలనూ దూరం చేస్తుంది. చిగుళ్లు పటిష్టంగా తయారవుతాయి. ఆకలి, నిద్ర సమస్యలను దూరం చేస్తుంది. చిన్నారులు, పెద్దలు అందరూ దేశీ నెయ్యి వాడటం వల్ల ఆకలి పెరిగి, అజీర్తి సమస్య తొలగుతుంది. ముఖ్యంగా నిద్ర లేమితో బాధ పడే వారు రోజూ కాసింత నెయ్యి అన్నంలో కలుపుకొని తింటే మంచి ఫలితాలు చూడవచ్చు.