Delhi : ఎన్ని చట్టాలు వచ్చినా , ప్రభుత్వాలు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా అమ్మాయిలపై ఆకతాయిల అఘాయిత్యాలు తగ్గడం లేదు. అందులోనూ ఢిల్లీ రాజధానిలో అమ్మాయిలపై దాడులు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా పశ్చిమ ఢిల్లీలోని మోహన్ గార్డెన్ ప్రాంతంలో మరో దారుణం చోటు చేసుకుంది. తన చెల్లెలితో కలిసి పాఠశాలకు వెళ్తున్న 17 ఏళ్ల బాలికపై మోటార్‌సైకిల్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ముఖంపై యాసిడ్ పోయడంతో పెద్ద దుమారం రేగింది. ఘటన జరిగిన కొన్ని గంటలకే ఈ కేసులో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. టీనేజ్‌కి 8 శాతం కాలిన గాయాలైనట్లు సమాచారం , ఆమెను నగరంలోని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. తీవ్రమైన గాయాలతో ఆసుపత్రిలో పోరాడుతూనే ఉంది ఆ బాలిక. ఈ యాసిడ్ దుర్ఘటన సీసీటీవీ కెమెరాల్లో నిక్షిప్తం కావడంతో ప్రజలతో పాటు రాజకీయ, మహిళా నేతలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. దేశంలో అసలు మహిళలకు రక్షణ లేకుండా పోతోందిని ఆందోళన చేస్తున్నారు.

Delhi : పశ్చిమ ఢిల్లీలో ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నిందితులకు కఠిన శిక్షలు వేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా పోలీసు కమిషనర్ సంజయ్ అరోరా, ఢిల్లీ మరియు జాతీయ మహిళా కమిషన్ల నుంచి ఆయన వివరణాత్మక నివేదికలను కోరారు, నేరస్థులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. మహిళలపై నేరాలలో తరచుగా ఆయుధాలుగా ఉన్న యాసిడ్ బహిరంగ విక్రయాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఓ టీనేజ్ బాలికపై యాసిడ్ దాడి జరగడంతో ఢిల్లీ మహిళా కమిషన్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లకు లేఖ రాసింది. నిందితులు ఫ్లిప్‌కార్ట్ ద్వారా యాసిడ్ కొనుగోలు చేశారని మహిళా ప్యానెల్ తన లేఖలో పేర్కొంది. అమెజాన్ ,ఫ్లిప్‌కార్ట్‌లలో యాసిడ్ సులభంగా లభిస్తుంది, ఇది చట్టవిరుద్ధం అని కూడా ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయంలో తక్షణ చర్యలు తీసుకోవాలని ప్యానెల్ కోరింది. ఆ లేఖలో దయచేసి ఈ-షాపింగ్ ప్లాట్‌ఫారమ్‌లో యాసిడ్ లభ్యతకు కారణాన్ని తెలియజేయండి. దయచేసి మీ ప్లాట్‌ఫారమ్‌లో యాసిడ్‌ను ఉత్పత్తిగా ఉంచిన విక్రేతల పూర్తి వివరాలను అందించండి. ప్యానెల్ ఆన్‌లైన్‌లో యాసిడ్ విక్రయించడానికి లైసెన్స్ కాపీని ,ప్రభుత్వ నియంత్రిత ఉత్పత్తుల అమ్మకంపై సంస్థలు అనుసరించిన విధానం యొక్క కాపీని కూడా కోరింది. యాసిడ్ కొనుగోలు చేసిన వారి ఫోటో ఐడీలను కూడా కోరారు.