Delhi CM : కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలి. ప్రస్తుతం అదే పనిలో ఉన్నారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ప్రధాని మోదీ సొంత గడ్డపై పాగా వేసేందుకు పార్టీలు కాసింత గట్టిగానే కృషి చేస్తున్నాయి. ఆ పార్టీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఒకటి. ఢిల్లీ సీఎం,ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కూడా తన ఎన్నికల వ్యూహాలకు పదును పెట్టారు. అక్కడ సామాన్య వర్గాల ప్రజలే తమ లక్ష్యంగా ఆయన కదులుతున్నారు. వారితో సమావేశమవుతున్నారు. నేడు ఆయన అహ్మదాబాద్‌లోని ఆటో వాలాలతో సమావేశమయ్యారు. అక్కడ ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.
ఈ క్రమంలో అరవింద్ కేజ్రీవాల్‌కు అహ్మదాబాద్‌లో ఆటో డ్రైవర్‌ను నుంచి ఆహ్వానం అందింది. తన ఇంటికి వచ్చి భోజనం చేయాలని కేజ్రీని పిలిచాడు. కేజ్రీవాల్ ప్రసంగం అనంతరం విక్రమ్ లల్తానీ అనే ఆటోవాలా.. లేచి నిలబడి.. కేజ్రీవాల్‌ను తన ఇంటికి భోజనానికి రమ్మని పిలిచాడు. ‘‘నేను మీ అభిమానిని. పంజాబ్‌లో ఓ ఆటో డ్రైవర్ ఇంట్లో మీరు భోజనం చేసిన వీడియో చూశా. అలాగే ఈరోజు డిన్నర్‌కు మా ఇంటికి వస్తారా’’ అని కేజ్రీవాల్‌ను విక్రమ్ లల్తానీ అడిగాడు. దీనికి అరవింద్ కేజ్రీవాల్ ఒక్క సెకను కూడా ఆలోచించకుండా అంగీకరించారు. అంతేకాదు.. తనను “రాత్రి 8 గంటలకు హోటల్ నుంచి నీ ఆటోలో నన్ను తీసుకెళ్తావా..?” అని అడగ్గా విక్రమ్ సంతోషంగా ఒప్పుకున్నాడు.
Delhi CM : ఆ సెంటిమెంట్ వర్క్ అవుట్ అవుతుందా?
అంతేకాదు తాను పంజాబ్‌లోని ఆటో డ్రైవర్ల ఇళ్లకు వెళ్లానని, వాళ్లు తనను చాలా ఇష్టపడతారని ప్రేమిస్తారని కేజ్రీవాల్ వెల్లడించారు. తన పార్టీకి చెందిన మరో ఇద్దరితో కలిసి విక్రమ్ ఇంటికి వస్తానని కేజ్రీవాల్ మాటిచ్చారు. కేజ్రీవాల్ నేటి సాయంత్రం అహ్మదాబాద్‌లో పారిశుధ్య కార్మికులతో కూడా భేటీ అయ్యారు. గుజరాత్‌లో ఎలాగైన గెలవాలనే పట్టుదలతో ఉన్న కేజ్రీవాల్.. గత కొంతకాలంగా రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తే.. ఉచిత విద్యుత్, ఉచిత విద్యా, వైద్యం అందిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. కాగా పంజాబ్‌లో ఆటో డ్రైవర ఇంటికెళ్లి కేజ్రీవాల్ భోజనం చేశారు.. అక్కడ తిరుగు లేని విజయం సాధించారు. మరీ గుజరాత్‌లో కూడా ఆ సెంటిమెంట్ వర్క్ అవుట్ అవుతుందో లేదో.. చూడాలి.