నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఫ్యూచర్ జెనరేషన్ కంటెంట్ తో ప్రాజెక్ట్ కె మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ప్రస్తుతం హైదరాబాద్ లో రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. ప్రత్యేకంగా వేసిన సెట్స్ లో షూటింగ్ ని దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్వహిస్తున్నారు. ఇక తాజాగా దీపికా పదుకునే ఈ మూవీ షూటింగ్ లో జాయిన్ అయ్యింది. అయితే షూటింగ్ మొదలైన కొద్ది సేపటికి ఈ బ్యూటీ తీవ్ర అస్వస్థతకి గురైంది. దీంతో నిర్మాత అశ్వినీదత్ దగ్గరుండి ఆమెని హాస్పిటల్ లో జాయిన్ చేశారు. అధిక రక్తపోటు కారణంగా ఒత్తిడికి గురి కావడంతో ఆరోగ్యం దెబ్బతింది అని డాక్టర్లు నిర్ధారించారు.
దీంతో కొద్ది రోజులు ఆమె రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. దీపికా పదుకునే గ్యాప్ లేకుండా, రెస్ట్ తీసుకోకుండా సినిమా షూటింగ్ లు చేస్తూ ఉండటంతో బీపీ ఎక్కువై అస్వస్థతకి గురైనట్లు తెలుస్తుంది. గతంలో ఆమె ఓవర్ డిప్రెషన్ కారణంగా కొద్ది కాలం సినిమాలకి దూరంగా ఉంటూ ట్రీట్మెంట్ తీసుకుంది. తరువాత కొంత సెట్ అయిన బీపీ సమస్య ఉందనే మాట వినిపిస్తుంది. అయితే ప్రయాణం, అలాగే పని ఒత్తిడి కారణంగా బీపీ ఎక్కువై ఒత్తిడికి గురైనట్లు టాక్ వినిపిస్తుంది.
దీపికా మీదనే చిత్రీకరించాల్సిన సన్నివేశాలని నాగ్ అశ్విన్ సిద్ధం చేసుకొని షూటింగ్ స్టార్ట్ చేశారు. అయితే ఆమె ఉన్నపళంగా అస్వస్థతకి గురి కావడం షూటింగ్ ఆపేయాల్సి వచ్చిందనే మాట వినిపిస్తుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ప్రతి రూపాయి చాలా వేలిడ్ గా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అలాంటిది మధ్యలో ఒక్క రోజు ఆగిన లక్షల్లో నష్టం వస్తుంది. అయితే తప్పని సరి పరిస్థితిలో ఆమె ట్రీట్మెంట్ కి నిర్మాత ఆశ్వీనిదత్ ప్రాధాన్యత ఇచ్చినట్లు టాక్ వినిపిస్తుంది. ప్రభాస్ ఈ సినిమా షూటింగ్ లో ఇంకా పార్టిసిపేట్ చేయలేదు. ప్రస్తుతం అతను సలార్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు.