దీపావళి అంటే చిన్న,పెద్ద తేడా లేకుండా అందరూ దీపాలను వెలిగించి టపాకాయలను కాలుస్తూ సాయంత్రం సమయాన్ని సరదాగా గడుపుతుంటారు.కానీ ప్రస్తుతం దీపావళి రోజున కాల్చే టపాసుల వల్ల శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యం జరుగుతుందని ప్రముఖులు ట్వీట్స్ చేస్తూ కోర్టులను ఆశ్రయిస్తున్నారు.దీంతో ఆ ప్రముఖుల అభిమానులు,సామాన్యులు క్రమక్రమంగా టపాసుల వాడకాన్ని తగ్గిస్తున్నారు.తాజాగా దీనిపైన జరిపిన సర్వేలో నల్లమందు నిండి ఉన్న టపాకాయలను జాగ్రత్తగా వాడకుంటే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి.వాటిని దృష్ఠిలో ఉంచుకొని 42 శాతం కుటుంబాలు టపకాయలు నిషేధాన్ని సమర్థిస్తున్నారు కానీ 53 శాతం ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు.
ఈ సర్వేలో 63 శాతం పురుషులు,37 శాతం మహిళలు పాల్గొన్నారు.