Dasara Movie: నేచురల్ స్టార్ నాని హీరోగా దసరా అనే మూవీ తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కి రెడీ అవుతుంది. ఈ మూవీతో శ్రీకాంత్ ఓదేల దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. నాని కెరియర్ లోనే భారీ బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కిన సినిమా కావడం విశేషం. ఇదిలా ఉంటే ఈ మూవీతో వంద కోట్ల హీరో అనిపించుకోవాలని నాని భావిస్తున్నాడు. ఇప్పటికే థీయాట్రికల్, నాన్ థీయాట్రికల్ బిజినెస్ ద్వారానే దసరా సినిమాకి వంద కోట్లు కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తుంది. నిర్మాత టేబుల్ ప్రాఫిట్ తోనే మూవీని థియేటర్స్ లో రిలీజ్ చేయబోతున్నాడు అని టాక్. ఇదిలా ఉంటే ఈ మూవీ ప్రమోషన్ ని ఇప్పటికే నేచురల్ స్టార్ నాని స్టార్ట్ చేశాడు.
ఇక తెలుగులో ఎలాగూ హైప్ ఉంటుంది కాబట్టి ప్రస్తుతం ఇక్కడ కాకుండా నార్త్ ఇండియా నుంచి మొదలు పెట్టాడు. ఇప్పటికే టీజర్, సాంగ్స్ ద్వారా సినిమాపై హైప్ క్రియేట్ చేశాడు. అయితే నార్త్ ఇండియా మార్కెట్ లోకి మూవీ వెళ్ళాలంటే మాత్రం కచ్చితంగా అక్కడ గట్టిగా ప్రమోట్ చేయాలి. తనని తాని ఎలివేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నేపధ్యంలో నాని ఆ దిశగానే ప్రమోషన్ స్టార్ట్ చేసినట్లు తెలుస్తుంది. నిన్న హోలీ సంబరాల్లో నార్త్ లో పాల్గొన్నారు. ఇదిలా ఉంటే అక్కడ మీడియాతో మాట్లాడుతూ ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే సౌత్, నార్త్ అనే విధంగా ఉండేవని అన్నారు.
అయితే ప్రస్తుతం ఇండియన్ సినిమా అంటే భాషలకి పరిమితం లేదని తెలిపారు. దేశ వ్యాప్తంగా ప్రేక్షకులు మంచి సినిమాలని ఆదరిస్తున్నారని అన్నారు. ప్రేక్షకుల అభిరుచికి అనుగణంగానే ఇప్పుడు ఇండియన్ సినిమా స్టాండర్డ్ మారిందని తెలిపారు. అందులో సౌత్ నుంచి పుష్ప, కాంతారా, ఆర్ఆర్ఆర్, కార్తికేయ 2 లాంటి సినిమాలకి నార్త్ లో మంచి ఆదరణ లభించింది అన్నారు. అలాగే నార్త్ నుంచి వచ్చిన బ్రహ్మాస్త్ర, పఠాన్ సినిమాలకి సౌత్ లో భారీ కలెక్షన్స్ వచ్చాయని తెలిపారు. మొత్తానికి నాని నార్త్ ఇండియాకి వెళ్లి పాన్ ఇండియా ప్రమోషన్ లో తనని తాను గట్టిగానే ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాడు అనే మాట వినిపిస్తుంది.