బాలీవుడ్ లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హవా ప్రస్తుతం నడుస్తుంది. అక్కడ అగ్ర దర్శకులు, బడా నిర్మాతలు అందరూ ప్రభాస్ తో సినిమాలు చేయడం కోసం ఆసక్తి చూపిస్తున్నారు. గతంలో బాలీవుడ్ లో ఖాన్ త్రయం ఆధిపత్యం ఉండేది. అయితే ప్రస్తుతం వారి హవా నడవడం లేదు. వారి పెద్ద భారీ బడ్జెట్ లు పెట్టడానికి నిర్మాతలు రిస్క్ చేయడం లేదు. బాలీవుడ్ హీరోలు కేవలం హిందీకి మాత్రమే పరిమితం అయిపోయారు. అయితే పాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్ అయితే ఇండియన్ వైడ్ గా మార్కెట్ సొంతం చేసుకున్నాడు. సినిమాకి హిట్ టాక్ వస్తే ఏకంగా వెయ్యి కోట్ల కలెక్షన్ వచ్చి పడుతుంది.
ఒక వేళ ఏవరేజ్ టాక్ వచ్చిన పెట్టిన పెట్టుబడికి ఎలాంటి ఢోకా ఉండదు. ముందుగానే ప్రీరిలీజ్ బిజినెస్ అయిపోతుంది. ఓటీటీలలో కూడా ప్రభాస్ సినిమాలని తక్కువలో తక్కువ వంద కోట్లు పెట్టి డిజిటల్ స్ట్రీమింగ్ ఛానల్స్ కొనడానికి రెడీగా ఉంటున్నాయి. ఈ నేపధ్యంలో నష్టపోవడం అంటూ ప్రభాస్ తో జరగదు. టి-సిరీస్ భూషణ్ కుమార్ ప్రస్తుతం ఆదిపురుష్ సినిమాని ప్రభాస్ హీరోగా తెరకెక్కించారు. దీనికి 300 కోట్లకి పైగానే పెట్టుబడి పెట్టారు. ఈ సినిమా రిలీజ్ కాకుండానే మరో సినిమాని ప్రభాస్ తో నిర్మించడానికి భూషణ్ కుమార్ రెడీ అయినట్లు తెలుస్తుంది.
ప్రస్తుతం ప్రభాస్ ఆదిపురుష్ సినిమా తర్వాత బాలీవుడ్ పాన్ ఇండియాగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ అనే సినిమాని చేస్తున్నాడు. అలాగే ప్రాజెక్ట్ కె అయితే పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కుతుంది. దీంతో పాటు ప్రశాంత్ నీల్ సలార్ సినిమా ఎలాగూ సిద్ధం అవుతుంది. ఇన్ని భారీ ప్రాజెక్ట్ లతో ప్రభాస్ మీద వేల కోట్ల వ్యాపారం జరుగుతుందని చెప్పాలి. బాలీవుడ్ స్టార్స్ ఎవరూ కూడా ఇప్పట్లో ఈ హైట్స్ ని అందుకోవడం కష్టం అనే చెప్పాలి.