సౌత్ ఇండియా స్టార్ హీరోలకి ఇండియన్ వైడ్ గా పాపులారిటీ పెరిగిపోతుంద పాన్ ఇండియా స్టార్స్ గా తమని తాము రిప్రజెంట్ చేసుకుంటూ అందరికి చేరువ అవుతున్నారు. ఈ నేపధ్యంలో వారికున్న ఇమేజ్ కూడా పెరుగుతుంది. ఇక వరల్డ్ వైడ్ గా సినిమాలకి రేటింగ్స్ ఇచ్చి ప్రముఖ ఎంటర్టైన్మెంట్ వెబ్ సైట్ ఐఎండిబి ప్రతి ఏడాది అత్యధిక ప్రజాదారణ పొందిన సినిమా సెలబ్రిటీల జాబితాని ప్రకటిస్తుంది. ఈ జాబితాలో ఈ సారి మొదటి స్థానంలో కోలీవుడ్ హీరో ధనుష్ ఉండటం విశేషం. ఇక రెండో స్థానంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ నిలబడింది. మూడో స్థానంలో టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిలబడటం విశేషం.
ఇక టాప్ 10 జాబితాలో ఎన్టీఆర్, అల్లు అర్జున్, సమంత, రాకింగ్ స్టార్ యష్ నిలబడటం విశేషం. మొత్తం పది మందిలో ఈ ఏడాది అత్యధిక ప్రజాదారణ పొందిన వారిలో ఆరుగురు స్టార్స్ సౌత్ ఇండియాకి చెందిన వారే కావడం విశేషం. ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే కేవలం హిందీ మూవీ మాత్రమే ఉండేది. అయితే ఇప్పుడు ఆ స్థానంలోకి సౌత్ ఇండియన్ సినిమాలు కూడా వెళ్ళడం విశేషం.
అలాగే ఒకప్పటి తరహాలో సౌత్, నార్త్ అనే వేరియేషన్ లేకుండా ఇప్పుడు అంతా ఇండియన్ సినిమా అనే ఐడెంటిటి నడుస్తుంది. అలాగే సౌత్ సినిమాలు, హీరోల ఆధిపత్యం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం నడుస్తుంది. ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్, యష్, ధనుష్ లాంటి స్టార్స్ అందరూ పాన్ ఇండియా లెవల్ లో స్టార్స్ గా ఎస్టాబ్లిష్ అయ్యారు. వారి సినిమాలకి కూడా అదే స్థాయిలో ప్రజాదారణ లభిస్తుంది. ఇక ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఏకంగా 3 వేల కోట్ల వ్యాపారం కేవలం ప్రభాస్ మీద నడుస్తూ ఉండటం విశేషం.