Dance India Dance : సూపర్ స్టార్ మహేష్ బాబు, అయన ముద్దుల కూతురు సితార గ్రాండ్ గా లాంచ్ చేసిన జీ తెలుగు డాన్స్ ఇండియా డాన్స్ టాలెంట్ షో టెలివిజన్ లో దుమ్ము రేపుతోంది. పార్టిసిపెంట్స్ అద్భుతమైన డాన్స్ ప్రదర్శనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు . ఒకప్పటి హీరోయిన్ సంగీత , నటి ఆనంది , డాన్స్ మాస్టర్ బాబా భాస్కర్ లు జడ్జిలుగా వ్యవహరిస్తున్న ఈ షో కు సంబంధించిన ప్రోమో యూట్యూబ్ లో విడుదలైన ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయ్యింది . మాస్టర్స్ ఛాలెంజ్ రౌండ్ లో భాగంగా శాకినీ ఢాకిని మూవీ బ్యూటీ లు నివేత థామస్, రెజీనా కసాండ్రా లు షో లో సందడి చేసారు. డాన్సర్ ల పెర్ఫార్మెన్స్ చూసి ఎంజాయ్ చేసారు. షో లో హైలెట్ గా నిలిచారు.

Dance India Dance : షో యాంకర్ లు బాలాజీ , రోహిణీల పంచ్ డైలాగులు కామెడీ సెన్స్ అందరిని నవ్వించింది . కొరియన్ భాషా లో మాట్లాడుతూ రోహిణి చేసిన ఫన్ పొట్ట చెక్కలయ్యేలా నవ్వించింది. స్పెషల్ గెస్ట్ ల క్యూట్ మూమెంట్స్ ఆధ్యంతం అలరించింది. అవుట్ స్టాండింగ్ డాన్స్ పెర్ఫార్మెన్స్ తో పార్టిసిపెంట్స్ ఇరగదీసారు. తగ్గేదెలే అంటూ చోట పటాకాస్ ఊ అంటావా మావ పాటకు చేసిన డాన్స్ అరుపులు పుట్టించింది. ఈ డాన్స్ పెర్ఫార్మెన్స్ కి నివేత ఫిదా అయిపోయి స్టేజి మీదకు వచ్చి చిన్నారులను విష్ చేసింది. పుష్ప సినిమా లోని డైలాగ్ చెప్పి అలరించింది. నివేత తో పాటు రెజినా కూడా శ్రీవల్లీ లా సిగ్గు పడుతూ చేసిన ఆక్ట్ కు విజిల్స్ వర్షం కురిసింది.

Dance India Dance : చెర్రీ , భూమిక లు మగధీర సాంగ్ పెర్ఫార్మెన్స్ లో రెచ్చిపోయారు. వీరి కెమిస్ట్రీ కి జడ్జెస్ ఫిదా అయ్యారు. మధ్య మధ్య లో రోహిణి కత్తి పట్టుకుని చేసిన ఫన్నీ మూమెంట్స్ కడుపుబ్బా నవ్వించాయి. ఇక వినోద్ చేసిన సింగల్ పెర్ఫార్మెన్స్ అందరికి వారి లవ్ ని గుర్తు చేసింది . జడ్జి ఆనంది స్టేజి పైకి వచ్చి పెర్ఫార్మెన్స్ చేసి మెస్మరైజ్ చేసింది. శరత్ ఆయుషి ల హాట్ పెర్ఫార్మెన్స్ తో పార్టిసిపెంట్స్ అందరు స్టెప్పులు వేశారు. నటి సంగీత కూడా వీరితో పాటు డాన్స్ చేసి దుమ్ము దులిపింది. ఈ షో కు రావడం చాలా బాగుందని నివేత థామస్ సంతోషాన్ని వ్యక్తం చేసింది. మరి బుల్లి తెరలో ఈ సందడంతా చూడాలంటే సండే వరకు వెయిట్ చేయాల్సిందే.
