Crocodile and Dog: మొసలి నోట కరిస్తే ఏనుగు బలం కూడా సరితూగదు. దీనిపై పురాణంలో ఓ కథ ఉంది. మొసలి బారిన పడిన గజేంద్రుడు తన గర్వ భంగమై.. సాక్షాత్తూ శ్రీమహా విష్ణువును ప్రార్థిస్థాడు. ఇక నీవే రక్ష అంటూ.. కరుణించి కాపాడమని ప్రార్థిస్తాడు. విష్ణుమూర్తి ఆఘ మేఘాలమీద వచ్చి గజేంద్రుని కాపాడతాడు. ఇదంతా ఎందుకంటే.. ఇక్కడ ఓ ముసలి బారిన పడిన శునకం ఎలా ప్రాణాలు కోల్పోయిందో చెప్పడానికే. కాకపోతే ఇక్కడ కుక్క శ్రీహరిని వేడుకోలేకపోయింది. మొసలినే భయపెట్టాలని చూసి తన ప్రాణాలను కోల్పోయింది.
మొసలిని భయపెట్టిన కుక్కపిల్ల పరిస్థితి ఎలా మారింది ఈ వీడియోలో చూడొచ్చు. సాధారణంగా మొసలి అంటే చాలా బలమైన జంతువు. నీటిలోనూ, నేలమీద కూడా వేగంగా కదలికలు చేయగలిగిన సత్తా మొసళ్లకు ఉంటుంది. మొసళ్ల పళ్లు చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. దేన్నైనా పట్టుకుంటే ఇక వాటిపని అయిపోయినట్లే. ఈ వీడియోలో కుక్కకీ, మొసలికి జరిగిన కామెడీ కాస్తా ట్రాజెడీగా ముగిసింది.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు ఈ వీడియోలో ఏముందంటే.. ఓ చెరువు నుంచి మొసలి ఒడ్డుకు వస్తోంది. దాన్ని చూసిన ఓ పెంపుడు కుక్క మొసలి వద్దకు వెళ్తుంది. మొరుగుతూ బెదిరిస్తుంది. మరో సందర్భంలోనూ ఇలాగే చేస్తూ మొసలిని తరిమేస్తుంది కుక్క. మొసలి వెళ్లిపోతుండగా దాని తోకను కరిచేందుకు ప్రయత్నిస్తుంది కుక్కపిల్ల.
Crocodile and Dog: ప్లాన్ చేసి.. లటుక్కున మింగేసింది..
అయితే, అంతటి బలమైన మొసలి చిన్న కుక్కపిల్లకు భయపడటమేంటనే ప్రశ్న కలగక మానదు. మొసలి చాలా తెలివిగా ప్లాన్ చేసి మరోసారి బయటకు వస్తుంది. ఈసారి రౌండ్ ద వికెట్ అన్నట్లుగా ఇంకో వైపు నుంచి వస్తుంది. ఈసారి కూడా కుక్క మొరుగుతూ మొసలిని భయపెట్టాలని చూస్తుంది. కానీ, నోట కరుచుకొని నేరుగా చెరువులోకి వెళ్లిపోతుంది. కుక్కను అప్పటిదాకా మెచ్చుకున్న యజమానికి కన్నీరే మిగిలింది. ఈ వీడియో మొసలితో జాగ్రత్తగా ఉండాలనే సందేశం ఇచ్చింది.
https://twitter.com/i/status/1584972699658780672