Cricket Players: విరాట్ తో కూడిన 15 మందితో కూడిన టీమ్ ఇండియా జట్టును టి20 వరల్డ్ కప్ కోసం ఎంపికచేశారు. దీనిలో భాగంగా ఆస్ట్రేలియా వెళ్తున్న విరాట్ కోహ్లీ, హర్షల్ పటేల్ తమదైన గ్లామర్ తో ఫోటోలకు ఫోజ్ ఇస్తూ తళుక్కుమన్నారు. ఆ ఫోటోలో వారిద్దరూ చూడటానికి ఎంతో ఆనందంతో గ్లామర్ గా కనిపించారు. లెగ్ స్పిన్ తో కీలక సమయంలో వికెట్లు పడగొట్టగల యజ్వేంద్ర చాహల్ కూడా తన భార్య ధన శ్రీ వర్మతో కలిసి ఫోటోకి ఫోజ్ ఇవ్వడం జరిగింది. చివరిసారిగా ఆస్ట్రేలియా వెళ్లేముందు టీమిండియా ఆటగాళ్లు బ్లూ సూట్ తో కోచ్ బృందంతో కలిసి ఎయిర్ పోర్ట్ లో దిగిన ఫోటో కూడా ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది
హార్డ్ హిట్టర్స్:
ఆస్ట్రేలియా లో జరిగే వరల్డ్ కప్ లో భారత జట్టు తరఫున హిట్టర్స్ గా పాండ్య, కార్తీక్ బరిలో దిగనున్నారు. ఆఖరి ఓవర్ వరకూ ఈ ఇద్దరిలో ఏ ఒక్కరు ఉన్నా సరే, పరుగుల వరద గ్యారెంటీ అని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు. భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గా రాహుల్ ద్రావిడ్ వ్యవహరిస్తున్నాడు. ఆస్ట్రేలియాలో రాహుల్ సూచనలను కెప్టెన్ కోహ్లి ఏ మేరకు సద్వినియోగం చేసుకుంటాడో వేచి చూడాలి.
ఇండియన్ ఏ బి డి :
వరల్డ్ కప్ లో టీమిండియా ఆటలో కీలకమైన ఆటగాడు ఎవరంటే ముందుగా సూర్యకుమార్ యాదవ్ మాటే చాలా పెద్దగా వినిపిస్తుంది. అలా చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. 300 డిగ్రీల కోణంలో ఏ కోణం వైపు నుంచి బంతి వచ్చిన సరే ఆ బంతిని బాదుతూ, ఇండియన్ ఏ బి డివిలియర్స్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్నాడు.
Cricket Players:
ఇద్దరు వికెట్-కీపర్ లతో టీమిండియా బరిలో దిగింది. వారే పంత్ , దినేష్ కార్తీక్. అయితే వీరిలో ఒకరు మాత్రమే పీల్డింగ్ లో దిగే అవకాశం ఉంది. టీమ్ ఇండియా స్క్వాడ్ లో ఉన్న అశ్విన్ ప్లేయింగ్ 11 లో ఉండే అవకాశాలు చాలా తక్కువగానే ఉన్నాయి. అక్షర్ పటేల్ తో పాటు చాహల్ చాలా అద్భుతంగా రానివ్వడం దీనికి కారణం. అదృష్టవశాత్తు అర్ష దీప్ సింగ్ కూడా వరల్డ్ కప్ కు ఎంపికయ్యాడు. టీమిండియా ఆటగాళ్లకు ఎంతో మంది ఫ్యాన్స్ ఎయిర్ పోర్ట్ లో వీడ్కోలు పలికి ఆల్ ద బెస్ట్ చెప్పడం జరిగింది.