ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సలార్ మూవీ తెరక్కుతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. కేజీఎఫ్ సిరీస్ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ఇదే కావడంతో దీనిపై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుంది. ఇందులో శృతి హసన్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా గురించి తాజాగా ఓ హాట్ న్యూస్ వినిపిస్తుంది. ప్రభాస్ వ్యవహారంపై ప్రశాంత్ నీల్ చాలా సీరియస్ గా ఉన్నాడనే టాక్ టాలీవుడ్ లో వినిపిస్తుంది.
దీనికి కారణం ప్రభాస్ ఒకేసారి సలార్ మూవీతో పాటు, ప్రాజెక్ట్ కె సినిమా షూటింగ్స్ చేస్తున్నాడు. ఈ కారణంగా సలార్ సినిమా కోసం తాను అనుకున్న లుక్స్ మాటిమాటికి చేంజ్ అవుతున్నాయని టాక్. ఇలా లుక్స్, బాడీ షేప్స్ మారుతూ ఉండటం వలన ఒక్కో సీన్ లో ఒక్కోలా కనిపించే అవకాశం ఉందని ప్రశాంత్ నీల్ అసంతృప్తిగా ఉన్నారనే మాట వినిపిస్తుంది. అయితే ఈ విషయం ప్రభాస్ తో చెప్పలేక ప్రశాంత్ కాస్తా ఇబ్బంది పడుతున్నారనే మాట వినిపిస్తుంది. ఇక ఈ విషయంలో ప్రశాంత్ నీల్ ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్నాడని టాక్.
సలార్ కోసం ప్రభాస్ కనిపించే క్లోజ్ అప్ సన్నివేశాలని ముందుగా ఆయనతో షూట్ చేసేసి లాగ్ షాట్స్ అన్ని కూడా డూప్ ని పెట్టి చిత్రీకరిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. ఇక సినిమాకి తేడా కొట్టకుండా ఉండేందుకు ప్రశాంత్ నీల్ ఈ నిర్ణయం తీసుకున్నాడనే మాట వినిపిస్తుంది. అయితే ఈ వార్తలలో నిజం లేదని రెబల్ స్టార్ ఫ్యాన్స్ అంటున్నారు. ఒక దర్శకుడిని ఇబ్బంది పెట్టె పనులు ప్రభాస్ ఎప్పటికి చేయడని. ఎవరో కావాలనే ఎలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు. కావాలనే ప్రభాస్ పై దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శిస్తున్నారు. మరి ఇందులో వాస్తవం ఏంటి అనేది ప్రశాంత్ నీల్ స్పందించి చెబితే కాని తెలియదు.