Bigboss 6 : బిగ్‌బాస్ 6కు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్‌బాస్ సీజన్-6 రేపు సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కానుంది. ఆదివారం సాయంత్రం లాంఛ్ కానున్న ఈ మోస్ట్ అవైటెడ్ షో కోసం బిగ్‌బాస్ హౌస్ ఇప్పటికే సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. సీజన్-3 నుంచి హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న అక్కినేని నాగార్జునే ఈ సీజన్‌కు కూడా హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. ఇక ఈ సారి అన్ని విషయాల్లో చాలా జాగ్రత్తలు బిగ్‌బాస్ నిర్వాహకులు తీసుకున్నారని టాక్ నడుస్తోంది. ఎంటర్‌టైన్‌మెంట్‌కి అడ్డా ఫిక్స్ అని నాగ్ చెప్పినట్టుగానే ఈ షో ఎంటర్‌టైన్‌మెంట్ విషయంలో ఈసారి ఏమాత్రం తగ్గదట.
ఈ సీజన్‌కు సంబంధించి సరికొత్త న్యూస్ ఒకటి వైరల్ అవుతోంది. సరికొత్తగా రూల్స్ తీసుకొచ్చారని టాక్ వినిపిస్తోంది. నామినేషన్ ప్రక్రియ, శిక్షలను విభిన్నంగా ఏర్పాటు చేయనున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ షో మొత్తంలో ఎలిమినేషన్ ప్రక్రియ చాలా హైలైట్‌గా ఉంటుంది. శత్రువులు మిత్రులుగానూ.. మిత్రులు శత్రువులుగానూ మారేది ఇక్కడే. దాని ఆధారంగానే షో రంజుగా సాగుతుంది. కాబట్టి కంటెస్టెంట్లను ఎలిమినేషన్ జోన్‌లోకి తీసుకొచ్చే నామినేషన్ టాస్క్‌కు చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఇది గత ఐదు సీజన్లుగా సోమవారం జరుగుతూ వస్తోంది. అయితే ఈ సారి నామినేషన్ ప్రక్రియను మరో రోజుకు మారుస్తున్నట్టు టాక్ నడుస్తోంది.
Bigboss 6 : కామన్ మ్యాన్ కేటగిరీలో ముగ్గురు..
వీరిలో 20మంది పేర్లు బయటికి రాగా.. ఇక పక్కాగా ఇదే ఫైనల్ లిస్ట్ అని లీక్స్ బయటకు వస్తున్నాయి. సోషల్ మీడియాలో అందుతున్న సమాచారం ప్రకారం.. కమెడియన్ చంటి, ఆర్జే సూర్య, నటుడు బాలాదిత్య, గీతూ రాయల్, నటి సుదీప(పింకీ), యాంకర్ నేహా చౌదరి, యాంకర్ ఆరోహీ రావ్, ఆదిరెడ్డి, లేడీ కమెడియన్ ఫైమా, సిరి బాయ్‌ఫ్రెండ్ శ్రీహాన్, షాన్ని, సింగర్ రేవంత్, సీరియల్ నటి శ్రీ సత్య, కీర్తి, రియల్ కపుల్ రోహిత్, మరీనా, ఇనయా సుల్తానా(ఆర్జీవీ వీడియోతో పాపులర్), నటి వసంతి, అర్జున్, రాజశేఖర్ ఉన్నారు. వీరితో పాటు కామన్ మ్యాన్ కేటగిరీలో ఇద్దరు లేదా ముగ్గురు ఈసారి బిగ్‌బాస్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారని టాక్.