Cooking Oils: తీసుకొనే ఆహారాన్ని బట్టి మన శరీరంలో ఆరోగ్యం, అనారోగ్యం చోటు చేసుకుంటూ ఉంటాయి. మంచి ఫుడ్ తీసుకోవడం వల్ల అనారోగ్యాలు దరిచేరకుండా ఉంటాయి. ముఖ్యంగా మనం ఎలాంటి ఆహారం తీసుకుంటున్నామనే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ఎంత తింటున్నామో చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకోవచ్చు.
కొందరికి తాము తీసుకొనే ఆహారంపై నియంత్రణ ఉండదు. ఏది పడితే అది తినేస్తుంటారు. ఇలా చేయడం వల్ల అనారోగ్య సమస్యల్ని కొని తెచ్చుకుంటుంటారు. అందుకే ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం కోసం మంచి ఫుడ్‌ను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా అధిక కొలెస్ట్రాల్ కలిగించే ఫుడ్‌కు దూరంగా ఉండాలి. దీని వల్ల బాడీలో కొవ్వు పేరుకుపోతుంది. ఫలితంగా అధికబరువు, ఊబకాయం, గుండె జబ్బుల్లాంటి సమస్యలు వెంటాడతాయి.
నేటి కాలంలో చాలా మందికి ఆహారం విషయంలో మంచి స్పృహ ఉండదు. ఆహారం పట్ల అలసత్వంగా ఉంటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. ముఖ్యంగా ఆయిల్ ఫుడ్ ఎక్కువగా తీసుకునేవారిలో కొలెస్ట్రాల్ పెరిగే చాన్స్ ఎక్కువ ఉంది. ఇంట్లో మనం వంటకు వాడే నూనెల విషయంలోనూ జాగ్రత్తలు పాటించాలి. ఏది పడితే ఆ ఆయిల్ వాడటం వల్ల కొలెస్ట్రాల్ శాతం పెరిగిపోయే వీలుంది.
Cooking Oils: ఈ ఆయిల్స్‌తో రిస్క్ తప్పించుకోండి..
వంట నూనెల్లో అన్నీ ఆరోగ్యాన్ని దెబ్బతీసేవిగా ఉండవు. వంట నూనెల్లో సంతృప్త కొవ్వులు, అసంతృప్త కొవ్వులు ఉండే ఆయిల్స్ ఉంటాయి. ఈ రెండింటిలో అసంతృప్త కొవ్వులు ఉండే ఆయిల్ ఆరోగ్యానికి బెస్ట్. సంతృప్త కొవ్వులు ఉండే నూనె ద్వారా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. న్యూట్రిషనిస్టులు సూచించిన మేరకు భారత్‌లో దొరికే వంట నూనెల్లో ఐదు రకాల వంటలు ఆరోగ్యానికి మంచివని చెబుతున్నారు. వాటిలో ఆలివ్ ఆయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్, కార్న్ ఆయిల్, వైట్ మస్టర్డ్ ఆయిల్, నట్స్ ఆయిల్ మంచివని చెబుతున్నారు.