Bigg boss 6 : బిగ్‌బాస్ సీజన్ 6.. కంటెస్టెంట్లే పరమ చెత్త అంటే చివరకు బిగ్‌బాస్ నిర్వాహకులు కూడా అలాగే తయారయ్యారు. ప్రస్తుతం టికెట్ టు ఫినాలే టాస్క్ నడుస్తోంది. సీజన్‌లోనూ ఈ టాస్క్ ఎలా ఉంటుంది? మంచి ఉత్కంఠ ఉంటుంది. కానీ ప్రస్తుత సీజన్‌లో మాత్రం ఇది చాలా చప్పగా సాగుతోంది.కంటెస్టెంట్స్ ఇంతకు ముందుతో పోలిస్తే బెటరే కానీ బిగ్‌బాస్ టీమే చాలా చెత్తగా తయారైంది. వాళ్లు ఏదో నానా తిప్పలు పడి వాళ్లు ఆడుతుంటే బిగ్‌బాస్ నిర్వాహకులు చెత్త రూల్స్ పెడుతూ మరింత చెత్త చేస్తున్నారు.
మొత్తంగా టికెట్ టు ఫినాలే టాస్క్‌లో బిగ్‌బాస్ తీసుకున్న నిర్ణయం గేమ్ ఆడే వాళ్లకే కాదు.. చూసే వాళ్లకు కూడా చాలా చెత్తగా అనిపించింది. ఈ టికెట్ టు ఫినాలేలో కూడా.. ఇంటి సభ్యుల ఏకాభిప్రాయం అంటూ చెత్త కాన్సెప్ట్‌ని బిగ్‌బాస్ తెరపైకి తెచ్చాడు. ప్రస్తుతం హౌస్‌లో 8 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. నెక్ట్స్ లెవల్‌కి ఆరుగురు క్వాలిఫై అయ్యారు. వీరిలో నుంచి నెక్ట్స్ లెవల్‌కి నలుగురిని క్వాలిఫై చేసే నిర్ణయాన్ని బిగ్‌బాస్ ఇంటి సభ్యుల ఏకాభిప్రాయంపై ఆధారపడి ఉంటుందని చెప్పాడు. దీంతో హౌస్‌మేట్స్‌కి మండిపోయింది.
చచ్చి చెడి నానా తిప్పలు పడి ఆడి వస్తే.. ఏదైనా టాస్క్ ఇచ్చి నెక్ట్స్ లెవల్‌కి నలుగురిని తీసుకెళ్లాలి కానీ ఇలా ఇద్దరిని పక్కనబెట్టడం హౌస్‌మేట్స్ చేతుల్లో పెట్టడమేంటని చూసే వారికి చిరాకేసింది. చివరకు ఆడేవారికి సైతం చిరాకేసి ఇందేంటంటూ బిగ్‌బాస్‌నే నిలదీశారు. ఇలా ఏకాభిప్రాయం అంటే తనకే నాలుగైదు సార్లు అన్యాయం జరిగిందని రేవంత్.. ఇది కరెక్ట్ కాదంటూ ఆదిరెడ్డి, ఆడి ఓడితే ఓకే కానీ.. ఏకాభిప్రాంతో తప్పించడం ఏంటంటూ రోహిత్ గట్టిగానే బిగ్‌బాస్‌ని ప్రశ్నించాడు. ఇక శ్రీహాన్ అయితే.. తనకు టికెట్ టు ఫినాలే చాలా అవసరమని.. తానైతే ఉండాలనుకుంటున్నానని.. ఏకాభిప్రాయం పేరుతో తనను పక్కకి తీసేస్తే ఒక ప్లేట్ కూడా ఇక ఉండనివ్వను. ఒక్కరిని కూడా గెలవనివ్వనంటూ తెగేసి చెప్పాడు.